Best Investment Plan: నెలకు రూ. లక్ష ఆదాయం.. 40 ఏళ్లకే రిటైర్‌మెంట్.. పూర్తి వివరాలు తెలుసుకోండి..

|

Mar 31, 2023 | 1:30 PM

40 ఏళ్ల వయసుకు వచ్చేసరికి మీకు రూ. లక్షల్లో సంపాదన కావాలా? మీరు చేసే ఉద్యోగంతో సంబంధం లేకుండా.. వ్యాపారం చేయాల్సిన అవసరం లేకుండా నెలకు రూ. లక్ష సంపాదించవచ్చు. అదెలా సాధ్యం అనుకుంటున్నారా? అయితే ఈ కథనం చదవండి..

Best Investment Plan: నెలకు రూ. లక్ష ఆదాయం.. 40 ఏళ్లకే రిటైర్‌మెంట్.. పూర్తి వివరాలు తెలుసుకోండి..
మ్యూచువల్ ఫండ్- మ్యూచువల్ ఫండ్ అనేది వృత్తిపరంగా నిర్వహించబడే పెట్టుబడి. ఇది స్టాక్‌లు, బాండ్‌లు, ఇతర సెక్యూరిటీల విభిన్న పోర్ట్‌ఫోలియోను కొనుగోలు చేయడానికి అనేక మంది పెట్టుబడిదారుల నుండి డబ్బును పూల్ చేస్తుంది.
Follow us on

40 ఏళ్ల వయసుకు వచ్చేసరికి మీకు రూ. లక్షల్లో సంపాదన కావాలా? మీరు చేసే ఉద్యోగంతో సంబంధం లేకుండా.. వ్యాపారం చేయాల్సిన అవసరం లేకుండా నెలకు రూ. లక్ష సంపాదించవచ్చు. అదెలా సాధ్యం అనుకుంటున్నారా? దానికి బెస్ట్ ఆప్షన్ మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడులు పెట్టడం. అవునండి ఇదే నిపుణులు చెబుతున్న మాట. ఒకవేళ మీరు 40 ఏళ్ల వయసు వచ్చేటప్పటికే మీ ఆదాయం నెలకు ఒక లక్ష రూపాయలకన్నా ఎక్కువ సంపాదించాలంటే మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులు పెట్టడం ఉత్తమమని మార్గమని చెబుతున్నారు. అయితే దీనిలో కొంచెం రిస్క్ ఉంటుంది. కొన్ని సవాళ్లు ఉంటాయి. ఆ రిస్క్ లు ఏంటి? సవాళ్లు ఏంటి? వాటిని ఎలా అధిగమించాలి చూద్దాం రండి..

సవాళ్లకు సిద్ధంగా ఉండాలి..

మీరు 40 ఏళ్ల వచ్చే నాటికి నెలకు రూ. 1 లక్ష సంపాదించాలనుకుంటే మీరు మ్యూచువల్ ఫండ్స్ ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. అయితే దీనిలో చాలా సవాళ్లు ఉంటాయి. వాటిలో మొదటిది, మీరు 40 ఏళ్లకు నెలకు రూ. 1లక్ష సంపాదించాలంటే మీరు ఆ ప్రణాళికను చాలా ముందుగా ప్రారంభించాలి. అంటే చాలా చిన్న వయసులోనే పెట్టుబడి పెట్టడం స్టార్ట్ చేయాలి. ఒకరకంగా మీరు సంపాదించడం ప్రారంభించినప్పుడే పెట్టుబడి పెట్టడం కూడా ఆరంభం అవ్వాలి. అయితే ఇది అందరికీ సాధ్యం కాకపోవచ్చు. మరొక సవాలు ఏమిటంటే, మీరు పెట్టే పెట్టుబడిలో దూకుడుగా వ్యవహరించాలి. ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టాలి. ఎందుకంటే మీరు 40 ఏళ్లకే రిటైర్ అవ్వాలని ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ సమయంలో నెలకు రూ. లక్ష చొప్పున్న మీకు ఏడాదికి రూ. 12 లక్షలు ఆదాయం అవసరం. అయితే మీకు ఇంకా 40 నుంచి 50 ఏళ్లు బతికే అవకాశం ఉంటుంది కాబట్టి అంత మేర మీరు కార్పస్ ను పోగేసుకోవాల్సి ఉంటుంది. అందుకోసం తొలి నుంచే ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టాలి..

ఇలా చేస్తే ప్లాన్ వర్క్ అవుట్ అవుతుంది..

మీరు సంవత్సరానికి రూ. 12 లక్షల ఇన్‌ఫ్లో పొందాలనుకుంటే, మీకు దాదాపు రూ. 4 కోట్ల పోర్ట్‌ఫోలియో అవసరమని గణాంకాలు సూచిస్తున్నాయి, ఎందుకంటే ఈ పోర్ట్‌ఫోలియోను కొనసాగించడానికి ఇది మాత్రమే సరిపపోతుంది. మీ ఆదాయంలో దాదాపు 60% డబ్బు ఈక్విటీ-ఆధారిత పథకాలలో పెట్టుబడులు పెట్టాలి. 20% రుణంలో ఉండవచ్చు, 10% బంగారం లేదా ఇతర లోహాలలో ఉండవచ్చు, అప్పుడు మీరు పోర్ట్‌ఫోలియోలో అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలుగుతుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..