LPG Connection: వంట గ్యాస్ కనెక్షన్ వేరే వారికి బదిలీ చేయాలా? ముందు దీని గురించి తెలుసుకోండి..

| Edited By: Janardhan Veluru

Jan 10, 2024 | 6:16 PM

మీ ఇంట్లో ఎల్పీజీ కనెక్షన్‌ని కలిగి ఉన్న వ్యక్తి పేరును మార్చాలనుకుంటే ఏం చేయాలి? అది సాధ్యమవుతుందా? అంటే సాధ్యమవుతుందని చెబుతున్నారు డిస్ట్రిబ్యూటర్లు. కానీ అది కేవలం బంధువుల విషయంలోనే మాత్రతే సాధ్యమవుతుందని చెబుతున్నారు. అలాగే కనెక్షన్ హోల్డర్ మరణించిన సందర్భాల్లో కూడా ఇది వర్తిస్తుంది. ఎల్పీజీ కనెక్షన్‌ని వేరే పేరుకు బదిలీ ప్రక్రియ ఇండియన్ ఆయిల్ కంపెనీలో ఎలా ఉంటుందో తెలుసుకుందాం..

LPG Connection: వంట గ్యాస్ కనెక్షన్ వేరే వారికి బదిలీ చేయాలా? ముందు దీని గురించి తెలుసుకోండి..
Lpg Gas Connection
Follow us on

వంట గ్యాస్ అనేది అనివార్యంగా మారిపోయింది. ప్రతి కుటుంబం ఎల్పీజీ కనెక్షన్ ను కలిగి ఉంటోంది. ఒకవేళ ఎవరైన తీసుకోలేకపోతే ప్రభుత్వమ పలు పథకాల ద్వారా ఉచిత కనెక్షన్ ను అందిస్తోంది. కొత్త కనెక్షన్ తీసుకునే ప్రక్రియ కూడా చాలా సులభతరం చేశారు. వ్యక్తిగతంగా మీరు డిస్ట్రిబ్యూటర్ను సందర్శించే అవసరం కూడా లేకుండా ఇంట్లో నుంచే ఆన్ లైన్లోనే కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ప్రస్తుతం అందుబాటులో ఉంది. హెచ్పీసీఎల్, బీపీసీఎల్, ఐఓసీఎల్ వంటి కంపెనీలు మన దేశ అంతటా ఎల్పీజీ సిలెండర్లను వినియోగదారులకు అందిస్తున్నాయి. ఎల్పీజీ కనెక్షన్ తీసుకోవడం ద్వారా పౌరులకు వివిధ సేవలు అందుతాయి. వాటిల్లో కొత్త నివాసితులకు కనెక్షన్‌ను బదిలీ చేయడం, ఇష్టపడే సమయంలో డెలివరీ కోరడం, పంపిణీదారులపై ఫీడ్‌బ్యాక్, ఫిర్యాదులను కూడా పరిగణనలోకి తీసుకోవడం వంటివి ఉంటాయి. కాబట్టి, మీ కేవైసీ వివరాలను ఎల్పీజీ పంపిణీదారులతో అప్‌డేట్ చేయడం మంచిది. అయితే మీరు మీ ఇంట్లో ఎల్పీజీ కనెక్షన్‌ని కలిగి ఉన్న వ్యక్తి పేరును మార్చాలనుకుంటే ఏం చేయాలి? అది సాధ్యమవుతుందా? అంటే సాధ్యమవుతుందని చెబుతున్నారు డిస్ట్రిబ్యూటర్లు. కానీ అది కేవలం బంధువుల విషయంలోనే మాత్రతే సాధ్యమవుతుందని చెబుతున్నారు. అలాగే కనెక్షన్ హోల్డర్ మరణించిన సందర్భాల్లో కూడా ఇది వర్తిస్తుంది. ఎల్పీజీ కనెక్షన్‌ని వేరే పేరుకు బదిలీ ప్రక్రియ ఇండియన్ ఆయిల్ కంపెనీలో ఎలా ఉంటుందో తెలుసుకుందాం..

కుటుంబ సభ్యునికి బదిలీ..

కుటుంబ సభ్యునికి కనెక్షన్ బదిలీ సులభంగా అవుతుంది. మీ కుటుంబంలో బదిలీ చేయబడిన వ్యక్తికి ఎల్పీజీ కనెక్షన్ లేనట్లయితే అది సాధ్యమవుతుంంది. అయితే మీరు మీ పంపిణీదారునికి కొన్ని పత్రాలు కూడా సమర్పించాల్సి ఉంటుంది. అవేంటో చూద్దాం..

  • బదిలీదారు కేవైసీ
  • చిరునామా రుజువు, గుర్తింపు రుజువు
  • మీ పేరులోని ఒరిజినల్ సబ్‌స్క్రిప్షన్ వోచర్(ఎస్వీ), ఎస్పీ లేకుంటే దయచేసి అఫిడవిట్ అందించాల్సి ఉంటుంది.
    బదిలీ అవుతున్న వ్యక్తి నుంచి డిక్లరేషన్
  • కేవైసీ ధ్రువీకరించుకోవాల్సి ఉంటుంది. బదిలీ కోసం పేర్కొన్న చిరునామాలోని బహుళ కనెక్షన్‌లు ఏమైనా ఉన్నాయేమో తనిఖీ చేస్తారు.
  • బదిలీదారు పేరుపై కొత్త సబ్‌స్క్రిప్షన్ వోచర్‌ను తయారు చేస్తారు. సెక్యూరిటీ డిపాజిట్ అసలు ఎస్వీలో ఉన్నట్లే ఉంటుంది.

మరణిస్తే బదిలీ ఇలా..

చట్టపరమైన వారసుడికి కనెక్షన్ బదిలీ ఇప్పుడు సరళీకృతం అయ్యింది. బదిలీ చేయబడిన వ్యక్తికి (చట్టపరమైన వారసుడు) ఎల్పీజీ కనెక్షన్ లేనట్లయితే, మీరు మీ పంపిణీదారునికి దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే దానికి కూడా కొన్ని పత్రాలు కావాలి. అవేంటంటే..

ఇవి కూడా చదవండి
  • చట్టపరమైన వారసుడు డిక్లరేషన్
  • మరణ ధ్రువీకరణ పత్రం కాపీ
  • లీగల్ హెయిర్ కేవైసీ
  • చిరునామా రుజువు, గుర్తింపు రుజువు
  • మరణించిన వ్యక్తి పేరులోని అసలు సబ్‌స్క్రిప్షన్ వోచర్(ఎస్వీ), ఎస్పీ లేకుంటే అఫిడవిట్ సమర్పించాల్సి ఉంటుంది.
  • కాబట్టి, కొత్త పేరుతో ఎల్పీజీ కనెక్షన్‌ని బదిలీ చేయడంలో మీకు ఏవైనా సందేహాలు ఉంటే, పైన పేర్కొన్న మార్గదర్శకాలను చూడండి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..