AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Debit Card: వర్చువల్ డెబిట్ కార్డు ఉపయోగిస్తున్నారా..? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే మోసపోయినట్లే..

ప్రస్తుతం డిజిటల్ పేమెంట్ల యుగం నడుస్తోంది. ఏ లావాదేవీ అయినా సరే ఆన్‌లైన్‌లో సులువుగా చేసుకునే సౌకర్యాలు అందుబాటులో వచ్చాయి. దీంతో ఫిజికల్ డెబిట్ కార్డు అవసరం లేకుండా వర్చువల్ కార్డులను బ్యాంకులు జారీ చేస్తున్నాయి. ఈ కార్డు ద్వారా ఫిజికల్ కార్డు దగ్గర ఉంచుకోవాల్సిన అవసరం ఉండదు.

Debit Card: వర్చువల్ డెబిట్ కార్డు ఉపయోగిస్తున్నారా..? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే మోసపోయినట్లే..
Virtual Debit Card
Venkatrao Lella
|

Updated on: Aug 09, 2026 | 7:12 AM

Share

ప్రస్తుతం టెక్నాలజీ యుగం నడుస్తోంది. దీంతో బ్యాంకింగ్ రంగం కూడా కొత్త పుంతలు తొక్కుతోంది. చేతిలో కార్డులు లేకుండా డిజిటల్‌గానే పేమెంట్స్ చేయవచ్చు. ఇందుకోసం వర్చువల్ డెబిట్ కార్డులను బ్యాంకులు జారీ చేస్తున్నాయి. దీని వల్ల ఫిజికల్ కార్డు అవసరం లేకుండానే పేమెంట్స్ చేయవచ్చు. ఇటీవల వర్చువల్ డెబిట్ కార్డుల వినియోగం పెరిగిపోతుంది. ఫిజికల్ డెబిట్ కార్డు ద్వారా పేమెంట్స్ చేయాలంటే కార్డు కలిగి ఉండాలి. అయితే ఈ డిజిటల్ డెబిట్ కార్డును మన వెంట ఉంచుకోవాల్సిన అవసరం ఉండదు. బ్యాంక్ యాప్‌లో డిజిటల్‌గా సేవ్ అయి ఉంటుంది. దీంతో సులువుగా పేమెంట్స్ చేయవచ్చు.

అసలు వర్చువల్ డెబిట్ కార్డు అంటే ఏంటి..?

ఫిజికల్ డెబిట్ కార్డుకు డిజిటల్ రూపమే వర్చువల్ డెబిట్ కార్డు. దీనిపై కార్డు నెంబర్, సీవీవీ, గడువు తేదీ అన్నీ ఉంటాయి. కాకపోతే ఫిజికల్ కార్డు తరహాలోనే ప్లాస్టిక్ కార్డు అనేది ఉండదు. కేవలం బ్యాంక్ యాప్ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా మాత్రమే యాక్సెస్ చేయవచ్చు. ఆన్‌లైన్ పేమెంట్స్, సబ్‌స్క్రిప్షన్లు, ఇతర డిజిటల్ చెల్లింపుల కోసం దీనిని ఉపయోగించవచ్చు. కొన్ని బ్యాంకులు వర్చువల్ డెబిట్ కార్డుల ద్వారా చేసే లావాదేవీలకు అనేక ఆఫర్లు అందిస్తున్నాయి. పరిమితులు సెట్ చేసుకోవడం, డీయాక్టివేట్ చేసుకోవడం, తాత్కాలిక కార్డ్ సృష్టించుకోవడం వంటి సౌకర్యాలు ఉంటాయి. ఈ వర్చువల్ కార్డు అనేది మీ బ్యాంక్ అకౌంట్‌తో లింక్ అయి ఉంటుంది. దీంతో దీని ద్వారా లావాదేవీలు చేసినట్లయితే మీ బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు కట్ అవుతాయి.

ఎక్కడెక్కడ పనిచేయదు..?

అయితే వర్చువల్ డెబిట్ కార్డ్ కొన్నిచోట్ల పనిచేయకపోవచ్చు. ఏటీఎం నుంచి డబ్బులు విత్ డ్రా చేసుకోవడం, స్టోర్లలో చెల్లింపులు చేయడంలో సమస్యలు ఎదురుకావొచ్చు. అలాగే కొన్ని వెబ్‌సైట్లు, ఇంటర్నేషనల్ పేమెంట్స్, సాధారణ సబ్‌స్క్రిప్షన్లు కోసం పనిచేయకపోవచ్చు. దీంతో వర్చువల్ డెబిట్ కార్డు ఉపయోగించేముందు మీ బ్యాంక్ నియమ, నిబంధనల గురించి తెలుసుకోవడం మంచిది. అయితే వర్చువల్ డెబిట్ కార్డు ద్వారా కూడా మోసాలు జరుగుతున్నాయి. నకిలీ వెబ్ సైట్, లింకులు, ఫిషింగ్ మెస్సేజుల ద్వారా మీ కార్డు సమాచారం తెలుసుకోవచ్చు. దీంతో ఓటీపీ, సీవీవీ, పిన్ నెంబర్లు ఎవరితో షేర్ చేసుకోవద్దు.  ఇక వర్చువల్ డెబిట్ కార్డులు, టోకనైజేషన్‌ రెండు వేర్వురు వ్యవస్థలు. టోకనైజేషన్ మీ ఫిజికల్ కార్డు సమాచారానికి బదులుగా ఒక ప్రత్యేకమైన, సురక్షితమైన టోకెన్‌ను ఉపయోగిస్తుంది. ఈ టోకెన్‌ను ఒక నిర్దిష్ట లావాదేవీ లేదా వ్యాపారి కోసం ఉపయోగించవచ్చు.

Follow Us