Vehicle Sales Increased: కరోనా సీజన్‌లోనూ పెరిగిన వాహనాల విక్రయాలు.. యూనిట్ల వివరాలు వెల్లడించిన ఫాడా

|

Jan 13, 2021 | 3:32 PM

Vehicle Sales Increased: కరోనా మహమ్మారి కారణంగా మార్కెట్‌ పూర్తిగా పడిపోయిన విషయం తెలిసిందే. ఇక వాహనాల విక్రయాలు కూడా దారుణంగా పడిపోయాయి. అయితే ...

Vehicle Sales Increased: కరోనా సీజన్‌లోనూ పెరిగిన వాహనాల విక్రయాలు.. యూనిట్ల వివరాలు వెల్లడించిన ఫాడా
Follow us on

Vehicle Sales Increased: కరోనా మహమ్మారి కారణంగా మార్కెట్‌ పూర్తిగా పడిపోయిన విషయం తెలిసిందే. ఇక వాహనాల విక్రయాలు కూడా దారుణంగా పడిపోయాయి. అయితే ప్యాసింజర్‌ వాహనాల రిటైల్‌ అమ్మకాలు మాత్రం డిసెంబర్‌ నెలలో 23.99 శాతం పెరిగాయని ఫెడరేషన్‌ ఆఫ్‌ ఆటోమోబైల్స్‌ డీలర్స్‌ అసోసియేషన్‌ (ఫాడా) ప్రకటించింది.

2019 డిసెంబర్‌లో 2,18,775 ప్యాసింజర్‌ వాహనాలు అమ్ముడు పోగా, కిందటి నెలలో మాత్రం 2,71,249 వాహనాలు అమ్మడుపోయాయని తెలిపింది. ఫెస్టివ్‌ సీజన్‌ నుంచి డిమాండ్‌ కొనసాగుతోందని వెల్లడించింది. దేశ వ్యాప్తంగా ఉన్న 1,270 రవాణా కార్యాలయాల నుంచి సేకరించిన రిజిస్ట్రేషన్ల ఆధారంగా ఫాడా ఈ డేటాను విడుదల చేసింది.

గత సంవత్సరం డిసెంబర్‌లో 14,24,620 ద్విచక్ర వాహనాలు అమ్ముడు కాగా, ఇవి 2019 డిసెంబర్‌లో అమ్ముడైన 12,73,318 వాహనాల కంటే 11.88 శాతం ఎక్కువ అని తెలిపింది. ఇక కమర్షియల్‌ వాహనాల విషయానికొస్తే.. 59,497 యూనిట్ల నుంచి 13.52 శాతం పడిపోయి గత నెలలో 51.454 యూనిట్లుగా నమోదైనట్లు ఫాడా వెల్లడించింది.

అలాగే త్రీ వీలర్స్‌ అమ్మకాలైతే డిసెంబర్‌ లో 52.75 శాతం పడిపోయాయి. 2019 డిసెంబర్‌లో 58.651 వాహనాలు అమ్ముడు పోగా, గత నెలలో 27,715 యూనిట్లకు ఈ సేల్స్‌ పడిపోయింది. ట్రాక్టర్ల అమ్మకాలు 35.49 శాతం పెరిగి 51,004 యూనిట్ల నుంచి 69,105 యూనిట్లకు పెరిగాయని తెలిపింది. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో మొదటిసారిగా డిసెంబర్‌లో వాహనాల రిజిస్ట్రేషన్లు పెరిగాయని ఫాడా వివరించింది.

Petrol and Diesel Prices : మరోసారి స్వల్పంగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. 5 రోజుల తర్వాత రూ.0.25 ఫైసలు పెంపు