UPI Payments: మేలో రికార్డు సృష్టించిన యూపీఐ పేమెంట్స్.. రూ.10 లక్షల కోట్లు దాటిన లావాదేవీలు..

|

Jun 02, 2022 | 12:40 PM

దేశంలో యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ ( UPI ) లావాదేవీలు రికార్డు సృష్టించాయి. మే నెలలో యూపీఐ లావాదేవీలు రూ.10 లక్షల కోట్లు దాటాయి. ఈ ఏడాది మేలో UPI ప్లాట్‌ఫారమ్‌లో మొత్తం 595 కోట్ల లావాదేవీలు జరిగాయి..

UPI Payments: మేలో రికార్డు సృష్టించిన యూపీఐ పేమెంట్స్.. రూ.10 లక్షల కోట్లు దాటిన లావాదేవీలు..
Upi Payments
Follow us on

దేశంలో యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ ( UPI ) లావాదేవీలు రికార్డు సృష్టించాయి. మే నెలలో యూపీఐ లావాదేవీలు రూ.10 లక్షల కోట్లు దాటాయి. ఈ ఏడాది మేలో UPI ప్లాట్‌ఫారమ్‌లో మొత్తం 595 కోట్ల లావాదేవీలు జరిగాయి. మొత్తం 10.41 లక్షల కోట్ల రూపాయలు ట్రాన్సక్షన్స్‌ చేశారు. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన డేటా ప్రకారం అంతకుముందు ఏప్రిల్ 2022లో 558 కోట్ల చెల్లింపులు జరిగాయి. ఆ మొత్తం రూ.9.83 లక్షల కోట్లు. ఈ నెలలో లావాదేవీల సంఖ్య 600 కోట్లు దాటుతుందని అంచనా. డిసెంబర్ 2018లో UPI లావాదేవీలు రూ. 1 లక్ష కోట్ల మార్కును దాటాయి. వచ్చే మూడు నుంచి ఐదేళ్లలో రోజుకు 100 కోట్ల లావాదేవీలు జరపాలని NPCI లక్ష్యంగా పెట్టుకుంది. ఆర్థిక వ్యవస్థ తెరవడంతో, ఇతర డిజిటల్ చెల్లింపులు కూడా మేలో స్థిరమైన వృద్ధిని సాధించాయి. తక్షణ చెల్లింపు సేవ మేలో 48.48 మిలియన్ల లావాదేవీలు జరిగాయి. కరోనా మహమ్మారి డిజిటల్ చెల్లింపులకు ఊతం ఇచ్చింది. ప్రజలు UPI చెల్లింపు యాప్‌పై ఎక్కువగా ఆధారపడుతున్నారు.

Paytm, Google Pay, Phone వంటి UPI యాప్‌లపై ప్రజల్లో ఆసక్తి పెరగడంతోపాటు నగదు పట్ల ప్రజల్లో మొగ్గు తగ్గింది. 2022 ఆర్థిక సంవత్సరంలో UPI ద్వారా 46 బిలియన్ల లావాదేవీలు జరిగాయి. మొత్తం 84.17 ట్రిలియన్లు లేదా 84.17 లక్షల కోట్ల రూపాయలు. దీంతో యూపీఐ లక్ష కోట్ల మార్కును అధిగమించింది. UPI చెల్లింపు అత్యంత వేగవంతమైనది. సురక్షితమైనదిగా పరిగణిస్తు్నారు. మీరు ఏదైనా UPI చెల్లింపు యాప్ నుండి నిధులను బదిలీ చేయవచ్చు. దీని కోసం మీరు మీ మొబైల్ ఫోన్‌ను ఉపయోగించవచ్చు. మీ ఫోన్‌లో Google Pay, PhonePe, Amazon Pay లేదా Paytm వంటి యాప్ ఉంటే, మీరు సులభంగా UPI లావాదేవీలు చేయవచ్చు. దీని కోసం, మీరు UPI పిన్‌ని సృష్టించాలి. ఇంతకుముందు UPI బ్యాంక్ ఖాతాకు లింక్ చేసేవారు, కానీ ఇప్పుడు ఈ సదుపాయాన్ని డెబిట్, క్రెడిట్ కార్డ్‌ల ద్వారా కూడా పొందవచ్చు. మీరు UPI యాప్‌ని డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్‌తో లింక్ చేయడం ద్వారా సులభంగా చెల్లింపులు చేయవచ్చు.

ఇవి కూడా చదవండి