UPI Services: ఈ నెలలో రెండు రోజులు యూపీఐ సేవలు బంద్‌.. ఎందుకో తెలుసా?

|

Nov 03, 2024 | 1:57 PM

UPI Services Closed: మన దేశంలో యూపీఐ సేవలు వేగంగా పెరుగుతున్నారు. డిజిటల్‌ టెక్నాలజీ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు ఆన్‌లైన్‌ సేవలను వినియోగించుకుంటున్నారు. ఇక యూపీఐ సేవలు అందుబాటులోకి వచ్చాక వినియోగదారులకు వివిధ రకాల చెల్లింపులు మరింత సులభతరం అయ్యాయి..

UPI Services: ఈ నెలలో రెండు రోజులు యూపీఐ సేవలు బంద్‌.. ఎందుకో తెలుసా?
Follow us on

భారతదేశంలో ప్రతిరోజూ వేల కోట్ల రూపాయల విలువైన యూపీఐ లావాదేవీలు జరుగుతున్నాయి. దీన్ని బట్టి దేశంలో యూపీఐని ఏ స్థాయిలో వాడుతున్నారో పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. యూపీఐ నగదును తీసుకువెళ్లాల్సిన అవసరాన్ని తొలగించడమే కాకుండా లావాదేవీలను మరింత సులభతరం చేసింది. అలాగే సురక్షితంగా చేసింది. కానీ ఈ నెల UPI రెండు రోజులు పని చేయదని, ప్రజలు UPIని ఉపయోగించలేరని హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ తన ఖాతాదారులకు తెలియజేసింది.

నవంబర్‌లో రెండు రోజుల పాటు బ్యాంక్ యూపీఐ సేవను ఉపయోగించుకోలేమని HDFC బ్యాంక్ తన ఖాతాదారులకు తెలిపింది. బ్యాంక్ వెబ్‌సైట్ నుండి అందిన సమాచారం ప్రకారం, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ యుపిఐ సేవ కొన్ని అవసరమైన సిస్టమ్ నిర్వహణ కారణంగా నవంబర్‌లో రెండు రోజుల పాటు మూసివేస్తుంది. HDFC బ్యాంక్ UPI సేవను ఉపయోగించే కస్టమర్‌లు నవంబర్ 5, నవంబర్ 23న యూపీఐ నుంచి ఎలాంటి చెల్లింపులు చేయలేరని తెలిపింది.

నవంబర్ 5వ తేదీ అర్ధరాత్రి 12.00 గంటల నుండి తెల్లవారుజామున 02.00 గంటల వరకు 2 గంటల పాటు, ఆపై నవంబర్ 23వ తేదీ అర్ధరాత్రి 12.00 గంటల నుండి తెల్లవారుజామున 03.00 గంటల వరకు 3 గంటల పాటు బ్యాంక్ UPI సేవలు అందుబాటులో ఉండవని హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ తెలిపింది. అలాగే యూపీఐ సేవలు తీసుకునే దుకాణాదారులు కూడా ఈ సదుపాయం పొందలేరని బ్యాంకు తెలిపింది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి: Best Geyser: మీరు గీజర్‌ కొంటున్నారా? గ్యాస్ లేదా ఎలక్ట్రిక్‌.. ఏది బెస్ట్‌..!

మీరు మీ HDFC బ్యాంక్ ఖాతా నుండి UPIని అమలు చేస్తే, HDFC బ్యాంక్ మొబైల్ యాప్, Paytm, PhonePe, Google Pay, Mobikwik వంటి UPIల ద్వారా మీరు డబ్బును పంపలేరు లేదా స్వీకరించలేరు. మొత్తంమీద ఈ కాలంలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌కి లింక్ చేసిన యూపీఐ లావాదేవీ ఏదీ సాధ్యం కాదు.

ఇది కూడా చదవండి: Car Mileage: మీ కారు మైలేజీ ఎక్కువగా రావాలా? అయితే ఈ పొరపాట్లు చేయకండి!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి