Car Mileage: మీ కారు మైలేజీ ఎక్కువగా రావాలా? అయితే ఈ పొరపాట్లు చేయకండి!

Car Mileage: కొన్ని చిన్న పొరపాట్లు కూడా మీ వాహనం మైలేజీని తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. కారు డ్రైవింగ్‌పై పూర్తి క్లారిటీ ఉండటం ముఖ్యం. ఇష్టానుసారంగా డ్రైవింగ్ చేస్తే మైలేజీ కూడా తక్కువగా ఇస్తుంది. మీ కారు మైలేజీని పెంచడానికి, పొరపాట్ల వల్ల కలిగే నష్టాన్ని నివారించడానికి ఈ చిట్కాలను పాటించండి..

Car Mileage: మీ కారు మైలేజీ ఎక్కువగా రావాలా? అయితే ఈ పొరపాట్లు చేయకండి!
Car Mileage
Follow us

|

Updated on: Nov 03, 2024 | 1:27 PM

కారు, బైక్, ఏ రకం వాహనం కొనుగోలు చేసినా ముందుగా మనం ఆలోచించేది మైలేజీ గురించి. మంచి మైలేజీ, భద్రత వాహనం అత్యంత ముఖ్యమైనవి. కొన్ని కార్లు మంచి మైలేజీని ఇస్తాయని కంపెనీ వారు చెబుతున్నప్పటికీ అవి వాడే విధానాన్ని బట్టి మైలేజ్ ఉంటుందని గుర్తించుకోవాలి. ఇష్టానుసారంగా వాహనాలు నడిపితే మైలేజీ ఇవ్వవని గుర్తించుకోండి. కారు మైలేజీని పెంచడానికి సరైన విధానం, డ్రైవింగ్ చాలా ముఖ్యమైనవి. కొన్ని చిన్న పొరపాట్లు కూడా మీ వాహనం మైలేజీని ప్రతికూలంగా ప్రభావితం చేస్తాయి. కారు డ్రైవింగ్ విషయంలో పూర్తి క్లారిటీ ఉండటం ముఖ్యం.

వాహనం నడిపే విధానంలో మార్పు ఉంటే మైలేజీ తక్కువగా ఇస్తుంది. అంతేకాదు ఇంధనం ఖర్చు కూడా ఎక్కువగా పెరుగుతుంది. మీ కారు మైలేజీని పెంచడానికి, పొరపాట్ల వల్ల కలిగే నష్టాన్ని నివారించడానికి ఇక్కడ కొన్ని చిట్కాలు పాటించండి.

ఇది కూడా చదవండి: Stored Food: రిఫ్రిజిరేటర్‌లో ఉంచిన ఆహారం ఎన్ని గంటల తర్వాత తింటే ప్రమాదం..!

ఇవి కూడా చదవండి
  1. సమయానికి సర్వీసింగ్‌: ఇంజిన్, ఎయిర్ ఫిల్టర్, ఆయిల్ ఫిల్టర్ రెగ్యులర్‌గా సర్వీస్‌ చేయడం మంచిది. ఇలా సమయానుకూలంగా వాహనం సర్వీసింగ్‌ చేయడం వల్ల మంచి మైలేజీ ఇస్తుంది. సర్వీసింగ్‌లో జాప్యం ఇంజిన్‌పై అదనపు ఒత్తిడిని కలిగిస్తుంది. ఇది ఇంధన వినియోగం పెరుగుతుంది. అందుకే సమయానికి సర్వీసింగ్‌ చేయడం, వాహనంలో అన్ని పార్ట్స్‌ను చెక్‌ చేయించడం తప్పనిసరి.
  2. టైర్ నిర్వహణ: టైర్‌లోని గాలి పరిమాణం చాలా ముఖ్యం. టైర్‌లో గాలి తక్కువగా ఉన్నప్పటికీ, ఆ ఒత్తిడి టైర్‌ను నెమ్మదిస్తుంది. తక్కువ లేదా అధిక టైర్ ఒత్తిడి ఇంధన వినియోగాన్ని పెంచుతుంది. దీంతో మైలేజీ కూడా తగ్గుతుంది.
  3. స్మూత్ డ్రైవింగ్: కారును సగటు వేగంతో నడపడం చాలా ముఖ్యం. ఓవర్ స్పీడ్, సడన్‌ బ్రేకింగ్ వంటి క్రమరహిత డ్రైవింగ్ ఇంధన వినియోగాన్ని పెంచుతుంది. దీని కారణంగా కూడా మైలేజీని తగ్గిస్తుంది.
  4. కారులో అనవసరమైన బరువు: కారు బరువు తక్కువగా ఉంటే, దానికి తక్కువ శక్తి అవసరం. ఇది మైలేజీని పెంచుతుంది. అనవసరమైన వస్తువులను తీసుకెళ్లడం వల్ల కారు బరువు పెరుగుతుంది. అలాగే కారులో ప్రయాణించేవారికంటే ఎక్కువ మంది ఉంటే కూడా మైలేజీ తక్కువ ఇస్తుంది. ఇలాంటివి ఇంజిన్‌పై మరింత ఒత్తిడిని పెంచుతాయి.
  5. సరైన గేర్‌ని ఉపయోగించండి: సరైన గేర్‌లో డ్రైవింగ్ చేయడం వల్ల ఇంజిన్ RPM అదుపులో ఉంటుంది. ఇది ఇంధన వినియోగం తగ్గిస్తుంది. తప్పుడు గేర్‌లో నడపడం వల్ల ఇంజిన్‌పై ఒత్తిడి పెరుగుతుంది. ఇది ఇంధన వినియోగం పెరుగుతుంది.
  6. AC వినియోగం: అవసరం లేనప్పుడు AC స్విచ్ ఆఫ్ చేయండి. ఇది ఇంధన వినియోగం తగ్గిస్తుంది. ఏసీని ఎక్కువగా ఉపయోగించడం వల్ల ఇంధన వినియోగం పెరుగుతుంది. ఇది మైలేజీని ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది.
  7. కారు వేగాన్ని నియంత్రించండి: గంటకు 50-60 కి.మీ వేగంతో నడపడం వల్ల ఎక్కువ మైలేజీ వస్తుంది. అధిక వేగంతో డ్రైవింగ్ చేయడం వలన అధిక ఇంధన వినియోగం, మైలేజీ తగ్గుతుంది.
  8. ఈ చిట్కాలను అనుసరించడం ద్వారా మీరు మీ కారు మైలేజీని పెంచుకోవచ్చు. ఇంధనాన్ని ఆదా చేసుకోవచ్చు. చిన్న పొరపాటు మైలేజీపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. అందుకే జాగ్రత్తగా, సరిగ్గా డ్రైవ్ చేయండి.

ఇది కూడా చదవండి: US President: ఇతర దేశాల ప్రధానులకంటే అమెరికా అధ్యక్షుడి కారు భిన్నమైనది.. ఎందుకో తెలుసా?

మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి