New UPI Rules: యూపీఐ యూజర్లకు అలెర్ట్‌.. జూలై 15 నుంచి కొత్త రూల్స్‌ అమలు!

యూపీఐ ద్వారా డబ్బు పంపిన తర్వాత లావాదేవీ విఫలమైతే, NPCI కొత్త నిబంధనల ప్రకారం డబ్బు వెంటనే వినియోగదారులకు తిరిగి వస్తుంది. తప్పు UPI నంబరుకు పంపిన డబ్బు కూడా తిరిగి పొందవచ్చు. బ్యాంకులు ఛార్జ్‌బ్యాక్‌లను స్వయంగా సేకరించే అధికారం కూడా కలిగి ఉంటాయి. లావాదేవీ సమయం కూడా తగ్గించారు.

New UPI Rules: యూపీఐ యూజర్లకు అలెర్ట్‌.. జూలై 15 నుంచి కొత్త రూల్స్‌ అమలు!
Upi

Updated on: Jun 26, 2025 | 1:27 PM

యూపీఐని ఉపయోగించే లక్షలాది మందికి గుడ్‌న్యూస్‌ ఏంటంటే.. యూపీఐ ద్వారా డబ్బు పంపిన తర్వాత బ్యాంక్‌ అకౌంట్‌ నుంచి డెబిట్‌ అయిన తర్వాత ట్రాన్స్‌యాక్షన్‌ ఫెయిల్‌ అయితే ఆ డబ్బు వెంటనే వినియోగదారుకు వాపసు లభిస్తుంది. నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ (NPCI) జూలై 15 నుండి కొత్త నియమాన్ని అమలు చేయబోతోంది. ఒకసారి అమలులోకి వచ్చిన తర్వాత, ఖాతా నుండి అమౌంట్‌ డెబిట్‌ అయిన తర్వాత చెల్లింపు పూర్తి కాకపోతే వినియోగదారుకు వెంటనే వాపసు లభిస్తుందని ఈ నియమం నిర్ధారిస్తుంది. ఇది మాత్రమే కాదు, తప్పు UPI నంబర్‌కు డబ్బు పంపిన సందర్భంలో వినియోగదారుడు రిసీవర్ బ్యాంక్ నుండి డబ్బును తిరిగి పొందవచ్చు.

బ్యాంకులు ఛార్జ్‌బ్యాక్‌లను పెంపు..

కొత్త మార్గదర్శకాల ప్రకారం.. బ్యాంకులు ఇప్పుడు NPCI నుండి ముందస్తు అనుమతి అవసరం లేకుండానే కొన్ని తిరస్కరించబడిన ఛార్జ్‌బ్యాక్‌లను స్వయంగా సేకరించగలవు. NPCI ప్రారంభించనున్న కొత్త UPI ఛార్జ్‌బ్యాక్ వ్యవస్థ, గతంలో తిరస్కరించబడిన రీఫండ్ క్లెయిమ్‌లకు ఉపశమనం కలిగిస్తుంది. కొత్త నిబంధనల ప్రకారం.. పాత తిరస్కరించబడిన కేసులను తిరిగి దర్యాప్తు చేసి, వాటిని పరిష్కరించే అధికారం బ్యాంకులకు ఉంది.

చెల్లింపు పద్ధతుల్లో మార్పులు

UPI ద్వారా చెల్లింపు పద్ధతుల్లో NPCI కొన్ని మార్పులు చేసింది. గతంలో చెల్లింపులు 30 సెకన్లలో ప్రాసెస్ చేయబడ్డాయి. ఇప్పుడు చెల్లింపులు 10-15 సెకన్లలోపు పూర్తి చేయాలి. కొత్త నియమం 16 జూన్ 2025 నుండి అమల్లోకి వచ్చింది. గత నెలలో, NPCI బ్యాంకులు, చెల్లింపు యాప్‌లను వాటి సంబంధిత వ్యవస్థలను అప్‌గ్రేడ్ చేయాలని ఆదేశించింది, తద్వారా చెల్లింపు కేవలం 15 సెకన్లలో సాధ్యమవుతుంది.

లావాదేవీ స్థితి

అలాగే లావాదేవీ స్థితిని తనిఖీ చేయడానికి లేదా విఫలమైన లావాదేవీని రివర్స్ చేయడానికి పట్టే సమయంలో కూడా మార్పులు చేశారు. గతంలో చెల్లింపు జరగకపోతే, డబ్బు కట్‌ అయిందా? లేదా తిరిగి యాడ్‌ అయిందా? అని చెక్‌ చేయడానికి వినియోగదారులు 30 సెకన్లు లేదా అంతకంటే ఎక్కువ సమయం వేచి ఉండాల్సి వచ్చేది. ప్రస్తుతం, లావాదేవీ స్థితిని తనిఖీ చేసే ప్రక్రియ కేవలం 10 సెకన్లు మాత్రమే పడుతుంది. లావాదేవీ విఫలమైందా లేదా విజయవంతమైందా అని వినియోగదారులు తెలుసుకోవడం సులభతరం చేస్తుంది.