ఫ్రాన్స్, యుఏఈ, సింగపూర్, శ్రీలంక, మారిషస్, భూటాన్, నేపాల్‌తో సహా ఏడు దేశాల్లో ఇప్పుడు యూపీఐ పేమెంట్స్ జరుగుతున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. యూపీఐ పేమెంట్స్‌లో భారత్ కీలక రికార్డు సాధించిందనట్లు పేర్కొంది. ఈ ఏడాది జనవరి నుండి నవంబర్ వరకు 223 లక్షల కోట్ల రూపాయల విలువైన 15,547 కోట్ల లావాదేవీలు జరిగినట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ శనివారం వెల్లడించింది. “ఈ ఏడాది జనవరి నుంచి నవంబర్ వరకు రూ.15,547 కోట్ల లావాదేవీల్లో రూ.223 లక్షల పేమెంట్స్ జరిగాయన్ని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ట్విట్ చేసింది. ప్రపంచ వ్యాప్తంగా యూపీఐ పేమెంట్స్‌కి ఆదరణ పెరుగుతుందని తెలిపారు. అలాగే భారత్‌లో డిజిటల్ పేమెంట్స్‌కి ప్రాధాన్యత పెరుగుతుందని వెల్లడించారు.
తక్కువ టైమ్‌లో డిజిటల్ చెల్లింపులు భారతదేశం మొత్తం వ్యాపించింది. వీధి వ్యాపారుల నుండి పెద్ద షాపింగ్ మాల్స్ వరకు అన్ని స్థాయిలలో డిజిటల్ చెల్లింపులు జరుగుతున్నాయి. 2016లో ప్రారంభించినప్పటి నుండి యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) భారతదేశంలో క్రమ క్రమంగా పెరుగుతూ వచ్చింది. ప్రస్తుతం 300 మిలియన్ల వ్యక్తులు, 50 మిలియన్ల వ్యాపారులు డిజిటల్ లావాదేవీలు చేస్తున్నట్లు తెలుస్తుంది.
అక్టోబర్ 2023 నాటికి, భారతదేశంలో మొత్తం రిటైల్ డిజిటల్ చెల్లింపుల్లో 75 శాతం UPI ద్వారా జరిగాయి. దేశవ్యాప్తంగా అందుబాటులో ఉన్న ఇంటర్నెట్ కారణంగా UPIని వేగంగా భారత ప్రజలు అందిపుచ్చుకున్నారు. UPI లావాదేవీలలో 10 శాతం పెరుగుదల క్రెడిట్ లభ్యతలో 7 శాతం పెరుగుదలకు దారితీసింది. 2025 ఆర్థిక సంవత్సరం మొదటి 7 నెలల్లో, రూపే క్రెడిట్ కార్డ్‌పై UPI ద్వారా జరిపిన లావాదేవీలు 2024 ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే దాదాపు రెట్టింపు అయ్యాయి. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు రూ.63,825.8 కోట్ల విలువైన 750 మిలియన్ల UPI రూపే క్రెడిట్ కార్డ్ లావాదేవీలు జరిగాయి. అదే సమయంలో, FY 2024లో, UPI రూపే క్రెడిట్ కార్డ్ ద్వారా లావాదేవీల సంఖ్య 362.8 మిలియన్లు, దీని మొత్తం విలువ రూ. 33,439.24 కోట్లుగా కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి