Aadhaar Card: ప్రూఫ్ లేకపోయినా ఆధార్ కార్డులో అడ్రస్ మార్చుకోవచ్చు.. కొత్త ఆప్షన్ వచ్చేసిందోచ్చ్.. సింపుల్‌గా ఇలా చేయండి..

ఆధార్ కార్డులో అడ్రస్ మార్చుకోవాలంటే ప్రూఫ్ సమర్పించాలి ఉంటుంది. కరెంట్ బిల్లు, రెంటల్ అగ్రిమెంట్ లాంటి పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. అయితే అవేవి అవసరం లేకుండానే మీరు ఆన్‌లైన్‌లో సులువుగా అడ్రస్ అప్డేట్ చేసుకోవచ్చు. ఈ అవకాశాన్ని యూఐడీఏఐ ప్రవేశపెట్టింది. ఎలా అంటే..

Aadhaar Card: ప్రూఫ్ లేకపోయినా ఆధార్ కార్డులో అడ్రస్ మార్చుకోవచ్చు.. కొత్త ఆప్షన్ వచ్చేసిందోచ్చ్.. సింపుల్‌గా ఇలా చేయండి..
Aadhaar Card

Updated on: Apr 13, 2026 | 1:38 PM

ఫ్రూఫ్ లేకుండానే ఆధార్ కార్డులో అడ్రస్ మార్చుకోవచ్చు. ఈ మేరకు యూఐడీఏఐ తీసుకొచ్చిన ఆధార్ యాప్‌లో కొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. దీని ద్వారా మీ కుటుంబసభ్యుడి ఆధార్ ఉపయోగించి అడ్రస్ అప్డేట్ చేసుకోవచ్చు. దీని వల్ల మీ ఆధార్‌లో కుటుంబసభ్యుడి ఆధార్‌లో ఉన్నట్లుగానే అడ్రస్ ఆటోమేటిక్‌గా అప్డేట్ అవుతుంది. సాధరణంగా ఆధార్‌లో అడ్రస్ మార్చుకోవాలంటే కరెంట్ బిల్లు, అద్దె ఒప్పందం, గ్యాస్ బుక్ లాంటి అందించాల్సి ఉంటుంది.  కానీ అవేమీ లేకుండా మార్చుకోవచ్చు.  ఎలాంటి ఫ్రూప్ లేకపోవడం వల్ల చాలామంది అడ్రస్ మార్చుకోవడంలో ఇబ్బందులు పడుతున్నారు. దీనిని గమనించి యూఐడీఏఐ ఈ ఆప్షన్ ప్రవేశపెట్టింది. ఈ ఫీచర్ ఆధార్ వినియోగదారులకు ఎంతో ఉపయోగపడుతుంది. ఈ ప్రాసెస్ ఎలా అనేది స్టెప్ బై స్టెప్ ఇప్పుడు చూద్దాం.

ప్రాసెస్ ఇదే..

-కొత్త ఆధార్ యాప్‌ను డౌన్ లోడ్ చేసుకోండి

-ఆ తర్వాత మీ ఆధార్ బయోమెట్రిక్ వివరాలతో యాప్‌లోకి లాగిన్ అవ్వండి

-హోమ్ పేజీలో సర్వీసెస్‌పై క్లిక్ చేయండి

-అడ్రస్ అప్డేట్ బటన్ ఎంచుకోండి

-హెడ్ ఆఫ్ ఫ్యామిలీ ఆధారిత అడ్రస్ అప్డేట్ ఆప్షన్‌పై క్లిక్ చేయండి

-మీరు ఎవరి ద్వారా అడ్రస్ అప్డేట్ చేయాలనుకుంటున్నారో వారి ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి

-కుటుంబసభ్యుడితో మీకు ఉన్న సంబంధాన్ని ఎంచుకోండి

-రేషన్ కార్డు లేదా వివాహ ధృవీకరణ పత్రం లాంటివి అప్ లోడ్ చేయండి

-మీ దగ్గర ఏ డాక్యుమెంట్ అందుబాటులో లేకపోతే సెల్ప్ డిక్లరేషన్ పత్రాన్ని డౌన్ లోడ్ చేసి దానిని పూర్తి చేసి అప్ లోడ్ చేయండి

-ఫీజు చెల్లిస్తే మీకు సర్వీస్ రిక్వెస్ట్ నెంబర్ జనరేట్ అవుతుంది.

కుటుంబసభ్యుడి ఆమోదం

-అయితే మీరు కుటుంబసభ్యుడి ద్వారా అడ్రస్ అప్డేట్ చేయాలనుకుంటున్నారో వారి నుంచి అనుమతి తీసుకోవాలి

-మై ఆధార్ పోర్టల్‌లోకి లాగిన్ అవ్వండి

-ఆధార్ నెంబర్‌తో లాగిన్ అవ్వండి

-మై హెడ్ ఆఫ్ ఫ్యామిలీ రిక్వెస్ట్ ఆప్షన్ ఎంచుకోండి

-మీ అభ్యర్థనను ఆమోదించండి

-ఆమోదం తర్వాత మీ రిక్వెస్ట్ నమోదు చేస్తారు

-అయితే 30 రోజుల్లోగా కుటుంబసభ్యుడు పోర్టల్‌లోకి లాగిన్ అయ్యి యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది

-30 రోజుల్లోగా చేయకపోతే మీ రిక్వెస్ట్‌ను సిస్టమ్ ఆటోమేటిక్‌గా రిజెక్ట్ చేస్తుంది

-ఇక యాక్సెప్ట్ చేశాక కొద్ది రోజుల్లో మీ ఆధార్‌లో అడ్రస్ అప్డేట్ అవుతుంది

-అప్డేట్ అయ్యాక మీరు కొత్త ఆధార్‌ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు

-ఒకవేళ మీరు రిక్వెస్ట్ రిజెక్ట్ అయితే మీరు చెల్లించిన ఫీజు రీఫండ్ రాదు

Follow Us