Bank Deposits: కోట్లాది మంది కస్టమర్లకు ఆ బ్యాంకు గుడ్‌న్యూస్‌.. కీలక నిర్ణయం

|

Jun 01, 2024 | 9:17 PM

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ. 2 కోట్ల కంటే తక్కువ ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల (ఎఫ్‌డీ)పై వడ్డీ రేట్లను సవరించింది. యూనియన్ బ్యాంక్ వెబ్‌సైట్ ప్రకారం, కొత్త వడ్డీ రేట్లు జూన్ 1, 2024 నుండి అమలులోకి వచ్చాయి. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 7 నుండి 45 రోజుల మధ్య కాలపరిమితి కలిగిన ఎఫ్‌డిలపై సాధారణ ప్రజలకు 3.5 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. ఇప్పుడు 46 రోజుల నుండి 90 రోజుల మధ్య FDపై 4.50 శాతం వడ్డీ రేటు అందుబాటులో..

Bank Deposits: కోట్లాది మంది కస్టమర్లకు ఆ బ్యాంకు గుడ్‌న్యూస్‌.. కీలక నిర్ణయం
Bank
Follow us on

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ. 2 కోట్ల కంటే తక్కువ ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల (ఎఫ్‌డీ)పై వడ్డీ రేట్లను సవరించింది. యూనియన్ బ్యాంక్ వెబ్‌సైట్ ప్రకారం, కొత్త వడ్డీ రేట్లు జూన్ 1, 2024 నుండి అమలులోకి వచ్చాయి. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 7 నుండి 45 రోజుల మధ్య కాలపరిమితి కలిగిన ఎఫ్‌డిలపై సాధారణ ప్రజలకు 3.5 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. ఇప్పుడు 46 రోజుల నుండి 90 రోజుల మధ్య FDపై 4.50 శాతం వడ్డీ రేటు అందుబాటులో ఉంది. ఇది 91 రోజుల నుండి 180 రోజుల మధ్య మెచ్యూర్ అయ్యే ఎఫ్‌డీలపైలపై 4.80 శాతం వడ్డీని అందిస్తోంది. 181 రోజుల నుండి 1 సంవత్సరం కంటే తక్కువ ఎఫ్‌డీకి 6.25 శాతం వడ్డీ లభిస్తుంది.

సీనియర్ సిటిజన్లకు ఎఫ్‌డీ రేట్లు:

సీనియర్ సిటిజన్లు సాధారణ రేట్లు కాకుండా 0.50% అదనపు వడ్డీని పొందుతున్నారు. సీనియర్ సిటిజన్లకు 399 రోజులకు గరిష్టంగా 7.75 శాతం వడ్డీ రేటును అందిస్తారు.

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ. 2 కోట్ల కంటే తక్కువ ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల (ఎఫ్‌డీ)పై వడ్డీ రేట్లను సవరించింది. యూనియన్ బ్యాంక్ వెబ్‌సైట్ ప్రకారం, కొత్త వడ్డీ రేట్లు జూన్ 1, 2024 నుండి అమలులోకి వచ్చాయి. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 7 నుండి 45 రోజుల మధ్య కాలపరిమితి కలిగిన ఎఫ్‌డిలపై సాధారణ ప్రజలకు 3.5 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. ఇప్పుడు 46 రోజుల నుండి 90 రోజుల మధ్య FDపై 4.50 శాతం వడ్డీ రేటు అందుబాటులో

సూపర్ సీనియర్ సిటిజన్లకు బ్యాంక్ 0.75 శాతం ఎక్కువ వడ్డీని అందిస్తోంది. 399 రోజుల ఎఫ్‌డీపై గరిష్ట వడ్డీ రేటు 8 శాతం.

సాధారణ ప్రజలు, సీనియర్‌ సీటిజన్స్‌కు ఇచ్చే వడ్డీ రేట్లు ఇలా..

  1. 7 నుంచి 14 రోజులకు సాధారణ ప్రజలకు 3.50 శాతం, సీనియర్‌ సీటిజన్స్‌కు 4 శాతం
  2. 15 నుంచి 30 రోజులు – సాధారణ ప్రజలకు 3.50 శాతం, సీనియర్‌ సీటిజన్స్‌కు 4 శాతం
  3. 31 నుంచి 45 రోజులకు సాధారణ ప్రజలకు 3.50 శాతం, సీనియర్‌ సీటిజన్స్‌కు 4 శాతం
  4. 46 నుంచి 90 రోజులకు సాధారణ ప్రజలకు 4.50 శాతం, సీనియర్‌ సీటిజన్స్‌కు 5 శాతం
  5. 91 రోజుల నుంచి 120 రోజులకు సాధారణ ప్రజలకు 4.80 శాతం, సీనియర్‌ సీటిజన్స్‌కు 5.30 శాతం.
  6. 121 రోజుల నుంచి 180 రోజులకు సాధారణ ప్రజలకు 4.90 శాతం, సీనియర్‌ సీటిజన్స్‌కు 5.40 శాతం.
  7. 181 రోజుల నుంచి 1 సంవత్సరం వరకు సాధారణ ప్రజలకు 6.25 శాతం, సీనియర్‌ సీటిజన్స్‌కు 6.75 శాతం.
  8. 1 సంవత్సరం నుంచి 398 రోజులకు సాధారణ ప్రజలకు 6.75 శాతం, సీనియర్‌ సీటిజన్స్‌కు 7.25 శాతం.
  9. 399 రోజులకు సాధారణ ప్రజలకు 7.00 శాతం, సీనియర్‌ సీటిజన్స్‌కు 7.50 శాతం.
  10. 400 రోజుల నుంచి 2 సంవత్సరాలకు సాధారణ ప్రజలకు 7.25 శాతం, సీనియర్‌ సీటిజన్స్‌కు 7.75 శాతం.
  11. 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల వరకు సాధారణ ప్రజలకు 6.50 శాతం, సీనియర్‌ సీటిజన్స్‌కు 7 శాతం.
  12. 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల వరకు సాధారణ ప్రజలకు 6.50 శాతం, సీనియర్‌ సీటిజన్స్‌కు 7 శాతం.
  13. 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వరకు సాధారణ ప్రజలకు 6.50 శాతం, సీనియర్‌ సీటిజన్స్‌కు 7 శాతం.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి