UIDAI: తెలంగాణలో ఆధార్‌ అప్‌డేట్‌ చేసుకోలేని వారు కోటి మంది ఉంటారట.. మరి వారికి ఇబ్బందులు తప్పవా?

|

Mar 04, 2023 | 9:37 PM

ప్రతి ఒక్కరికి ముఖ్యమైన డాక్యుమెంట్లలో ఆధార్‌ ఒకటి. ఇది లేనిది ఏ పని జరగదు. సిమ్‌ కార్డు తీసుకోవడం నుంచి బ్యాంకు ఖాతా వరకు ఏ చిన్నపాటి పనికి కూడా ఆధార్‌ తప్పనిసరి చేసింది కేంద్రం..

UIDAI: తెలంగాణలో ఆధార్‌ అప్‌డేట్‌ చేసుకోలేని వారు కోటి మంది ఉంటారట.. మరి వారికి ఇబ్బందులు తప్పవా?
Aadhaar Update
Follow us on

ప్రతి ఒక్కరికి ముఖ్యమైన డాక్యుమెంట్లలో ఆధార్‌ ఒకటి. ఇది లేనిది ఏ పని జరగదు. సిమ్‌ కార్డు తీసుకోవడం నుంచి బ్యాంకు ఖాతా వరకు ఏ చిన్నపాటి పనికి కూడా ఆధార్‌ తప్పనిసరి చేసింది కేంద్రం. అందుకే ఆధార్‌లో ఏవైనా పొరపాట్లు ఉంటే వెంటనే అప్‌డేట్‌ చేసుకోవడం ముఖ్యం. అలాగే ఆధార్‌ కార్డు కలిగిన ప్రతి వ్యక్తి పదేళ్లకోసారి అప్‌డేట్‌ చేసుకోవాలని గత ఏడాది ఆధార్‌ సంస్థ యూఐడీఏఐ సూచించింది. ఇక తెలంగాణ రాష్ట్రంలో కోటి మంది వరకు ఆధార్‌కార్డుదారులు ఒక్కసారి కూడా తమ సమాచారాన్ని అప్‌డేట్‌ చేసుకోలేదని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇందులో భాగంగా అప్‌డేట్‌ చేసుకోవాలంటే ఆధార్‌కార్డులోని పేరు, ఇంటి చిరునామా, వ్యక్తిగత గుర్తింపు పత్రాలను అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. రాష్ట్రంలో ఇప్పటివరకు ఒక్కసారి కూడా వివరాలను అప్‌డేట్‌ చేసుకోని వారిపై ఆధార్‌ అధికారులు దృష్టి సారించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం.. ఇలా అప్‌డేట్‌ చేసుకోని వారు సుమారు కోటి మంది వరకు ఉంటారని అధికారులు అంచనా వేశారు. రాష్ట్రంలో 2022 డిసెంబర్‌ వరకు 3,79,07,000 జనాభా ఉంటే అందులో 3,84,47,793 మంది ఆధార్‌కార్డులను పొందారు. అయితే రాష్ట్ర జనాభా కన్న ఆధార్‌ కార్డులు ఉండడానికి గల కారణం ఉద్యోగాలు, వ్యాపారాల కోసం ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారే ఆధార్‌ను తీసుకుని ఉంటారని అధికారులు చెబుతున్నారు.

గత పదేళ్లలో ఎంత మంది తమ ఆధార్‌ను అప్‌డేట్‌ చేసుకున్నారో పరిశీలించుకోవాలని కేంద్ర ఎలక్ట్రానిక్స్‌, ఐటీ మంత్రిత్వశాఖ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖ రాసింది. ఈ నేపథ్యంలో తెలంగాణలో వివిధ సంక్షేమ పథకాల కింద లబ్దిపొందుతున్నవారి జాబితాలను జిల్లాల వారీగా యూఐడీఏఐ అధికారులను పంపించాలని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.

కొందరు ఒక ప్రాంతంలో ఆధార్‌ నమోదు చేసుకుని ఉద్యోగ, వ్యాపారరీత్యా ఇతర ప్రాంతాలకు వెళ్తుంటారు. మరి కొందరు విదేశాలకు వెళ్లి స్థిరపడిన వారున్నారని అధికారులు చెబుతున్నారు. ఇలాంటి వారు కార్డులోని వివరాలు అప్‌డేట్‌ చేసుకుంటే ప్రభుత్వం వద్ద సరైనా సమాచారం ఉంటుందని యూఐడీఏఐ అభిప్రాయం వ్యక్తం చేసింది.

ఆధార్‌లో సమాచారాన్ని అప్‌డేట్‌ చేసుకోవడం ఎలా..?

☛ ఆధార్‌, ఈ-సేవ, మీ-సేవ కేంద్రాలకు వెళ్లి కూడా అప్‌డేట్‌ చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లోనూ ఈ సదుపాయం అందుబాటులో ఉంది.

☛ ముందుగా  అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి మైఆధార్‌ ఆప్షన్‌ను ఎంచుకోవాలి.

☛ తర్వాత ‘అప్‌డేట్‌ డెమోగ్రాఫిక్స్‌ డేటా అండ్‌ చెక్‌ స్టేటస్‌’పై క్లిక్‌ చేయగానే మైఆధార్‌.యూఐడీఏఐకి ఆటోమేటిక్‌గా రీడైరెక్ట్‌ అవుతుంది.

☛ తర్వాత అక్కడ లాగిన్‌ అయి అప్‌డేట్‌ ఆధార్‌ ఆన్‌లైన్‌ను ఎంచుకుని పూర్తి సమాచారంతో పాటు డాక్యుమెంట్లను అప్‌లోడ్‌ చేయాలి.

☛ తర్వాత రూ.50 రుసుము చెల్లించేందుకు పేమెంట్‌ మోడ్‌ ఓపెన్‌ అవుతుంది. అక్కడ చెల్లింపులు చేసిన తర్వాత మీ కార్డు అప్‌డేట్‌ ప్రక్రియ పూర్తవుతుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి