Twitter: వివాదస్పదమవుతున్న ఎలాన్ మస్క్ నిర్ణయాలు.. ఉద్యోగుల తొలగింపు మొదలు.. బ్లూటిక్ వరకు..

|

Nov 13, 2022 | 1:12 PM

ఎలన్ మస్క్ ట్విట్టర్ యాజమాన్య బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ప్రతి రోజూ ఆ సంస్థ వార్తలో నిలుస్తోంది. ఆయన తీసుకంటున్న పలు నిర్ణయాలు వివాదస్పదం అవుతున్నాయి. తాజాగా ట్విట్టర్ బ్లూటిక్ సబ్‌స్క్రిప్షన్ విషయం వివాదానికి కారణమైంది. దీంతో ట్విట్టర్ వినియోగదారుల..

Twitter: వివాదస్పదమవుతున్న ఎలాన్ మస్క్ నిర్ణయాలు.. ఉద్యోగుల తొలగింపు మొదలు.. బ్లూటిక్ వరకు..
Twitter Blue Tick
Follow us on

ఎలన్ మస్క్ ట్విట్టర్ యాజమాన్య బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ప్రతి రోజూ ఆ సంస్థ వార్తలో నిలుస్తోంది. ఆయన తీసుకంటున్న పలు నిర్ణయాలు వివాదస్పదం అవుతున్నాయి. ట్విట్టర్ కొనుగోలు ప్రక్రియ చివరి దశలో ఆయన ట్విట్టర్ కార్యాలయంలోనికి సింక్ తో ప్రవేశించి.. సంచలనం సృష్టించారు. ఆ తర్వాత ఉద్యోగుల తొలగింపు మొదలు బ్లూటిక్ వరకు ఎలాన్ మస్క్ నిర్ణయాలు అన్ని పలు వివాదాలకు దారితీస్తూనే ఉన్నాయి. ఏకంగా ట్విట్టర్ సీఈవోనే బాధ్యతల నుంచి తొలగించారు. అలాగే అనేక ఉన్నతస్థాయి ఉద్యోగులను ఎలాన్ మస్క్ తొలగించారు.  తాజాగా ట్విట్టర్ బ్లూటిక్ సబ్‌స్క్రిప్షన్ విషయం వివాదానికి కారణమైంది. దీంతో ట్విట్టర్ వినియోగదారుల భద్రతకు విఘాతం కలిగించే అవకాశం ఉందన్న అనుమానాల నేపథ్యంలో ఈ విషయంలో ట్విట్టర్ వెనక్కి తగ్గింది. ట్విటర్‌లో అధికారిక ఖాతాలకు ఇచ్చే ‘బ్లూ టిక్‌’ను ప్రీమియం సర్వీసుగా మార్చారు ఎలాన్‌ మస్క్. ఈ బ్లూ టిక్‌కు నెలవారీ ఛార్జీలు ప్రకటించారు. దీనివల్ల నకిలీ ఖాతాలు ఎక్కువుగా పెరిగిపోవడంతో ఈ సర్వీసును నిలిపివేశారు. ప్రముఖ కంపెనీలు, వ్యక్తుల పేరుతో ట్విట్టర్ ఖాతాలు సృష్టించి సబ్‌స్క్రిప్షన్ తీసుకోవడంతో అసలు, నకిలీ ఖాతాలు గుర్తించడం కష్టంగా మారింది. దీంతో ఈ విషయంలో సంస్థ వెనక్కి తగ్గాల్సి వచ్చింది. ట్విటర్‌ను ఎలాన్ మస్క్‌ కొనుగోలు చేయకముందు.. ప్రభుత్వ విభాగాలు, కార్పొరేట్‌ సంస్థలు, ప్రముఖులు, జర్నలిస్టులు.. ఇలా ప్రముఖుల ఖాతాలను వెరిఫై చేసి ఈ బ్లూ టిక్‌ కేటాయించేవారు. దీంతో ఆయా ఖాతాలు వారివే అనేందుకు కచ్చితమైన ఆధారం ఉండేది.

రెండు వారాల క్రితం ఈ మైక్రోబ్లాగింగ్‌ సైట్‌ను ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌ కొనుగోలు చేసిన తర్వాత.. ఈ బ్లూ టిక్‌ సర్వీసులో మార్పులు చేశారు. నెలవారీ ఛార్జీలతో ప్రీమియం వెర్షన్‌ను తీసుకొచ్చారు. అంటే నెలకు 8 డాలర్లు చెల్లించినవారికి ఎలాంటి వెరిఫికేషన్‌ లేకుండానే బ్లూ టిక్‌ ఇచ్చారు. శుక్రవారం నుంచి భారత్‌లోనూ ఈ సర్వీసు అందుబాటులోకి వచ్చింది. అయితే, దీని తర్వాత నకిలీ ఖాతాలు విపరీతంగా పెరిగాయి. ప్రముఖ బ్రాండ్లు, కంపెనీలు, వ్యక్తుల పేరుతో నకిలీ ఖాతాలను తెరిచి వాటికి సబ్‌స్క్రిప్షన్‌ తీసుకుంటున్నారు. వాటికి కూడా బ్లూ టిక్‌ ఉండటంతో.. ఆ సంస్థల, వ్యక్తుల అసలైన ఖాతా ఏదనే గందరగోళం నెలకొంది. దీనిపై ఆందోనలు వ్యక్తమవడంతో ఈ సర్వీసును ట్విటర్‌ నిలిపివేసినట్లు తెలుస్తోంది.

ఉద్యోగుల తొలగింపు విషయంలో కూడా ఎలాన్ మస్క్ పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. ఇప్పటికే తొలగించిన ఉద్యోగులు కొందరిని మళ్లీ విధుల్లోకి తీసుకోవాలనే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం చూడండి..