TVS Raider I Go: సూపర్ స్టైలిష్ లుక్‌తో నయా బైక్ రిలీజ్ చేసిన టీవీఎస్.. వారే అసలు టార్గెట్..!

|

Oct 26, 2024 | 7:14 PM

ఇటీవల కాలంలో భారతదేశంలో యువత అధికంగా బైక్ వాడుతున్నారు. ముఖ్యంగా అన్ని కంపెనీలు యువతను ఆకట్టుకునేందుకు మంచి సూపర్ బైక్స్‌ను రిలీజ్ చేస్తున్నాయి. అయితే భారతదేశంలో అధికంగా ఉన్న మధ్య తరగతి ప్రజలు ఈ సూపర్ బైక్స్ రేట్లను చూసి కొనుగోలుకు వెనుకంజ వేస్తున్నారు. సరిగ్గా ఇలాంటి వారిని టార్గెట్ చేస్తూ టీవీఎస్ కంపెనీ రైడర్ ఐగో పేరుతో నయా బైక్‌ను లాంచ్ చేసింది. ఆ బైక్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

TVS Raider I Go: సూపర్ స్టైలిష్ లుక్‌తో నయా బైక్ రిలీజ్ చేసిన టీవీఎస్.. వారే అసలు టార్గెట్..!
Tvs Raider I Go
Follow us on

టీవీఎస్ మోటార్ ఇటీవలే భారత మార్కెట్‌లో అత్యంత సరసమైన ధరలో రైడర్ నయా వేరియంట్‌ను లాంచ్ చేసింది. రైడర్ ఐగో పేరుతో లాంచ్ చేసిన ఈ బైక్ ధర కేవలం రూ. 98,389 (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో పరిచయం చేసింది. ముఖ్యంగా టీవీఎస్ రైడర్ బైక్ సేల్స్ ఓ మిలియన్ దాటినందుకు గుర్తుగా ఈ వేరియంట్‌ను లాంచ్ చేశామని టీవీఎస్ ప్రతినిధులు చెబుతున్నారు.సరికొత్త ఫీచర్లతో లాంచ్ చేసిన టీవీఎస్ రైడర్ ఐగో వేరియంట్ కచ్చితంగా యువతను ఆకర్షిస్తుందని పేర్కొంటున్నారు. లుక్స్‌పరంగా సాధారణ టీవీఎస్ రైడర్ బైక్‌లా ఉన్నప్పటికీ ఈ బైక్ నయా నార్డో గ్రే పెయింట్ స్కీమ్‌తో వస్తుంది. ముఖ్యంగా 17 అంగుళాల ఎరుపు రంగు అల్లాయ్ వీల్స్ ఈ బైక్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. 

టీవీఎస్ రైడర్ ఐగో బైక్ రివర్స్ ఎల్‌సీడీ కనెక్టెడ్ కస్టర్‌తో వస్తుంది. టర్న్-బై-టర్న్ నావిగేషన్, కాల్ హ్యాండ్లింగ్, నోటిఫికేషన్ అలర్ట్లు వంటి మరిన్ని ఫీచర్లతో వస్తుంది. ఈ బైక్ బ్రాండ్ ఐగో అసిస్ట్ టెక్నాలజీని ఉపయోగించి పనిచేసే ‘బూస్ట్ మోడ్’తో వస్తుంది. ఈ బైక్ బెస్ట్-ఇన్-క్లాస్ యాక్సిలరేషన్‌తో పాటు బెస్ట్-ఇన్-క్లాస్ టార్న్‌ను అందిస్తుంది. అదనంగా ఈ బైక్ ఇంధన సామర్థ్యాన్ని 10 శాతం మెరుగుపరుస్తుంది. టీవీఎస్ రైడర్ ఐగో బైక్ 124.8 సీసీ ఎయిర్, ఆయిల్-కూల్డ్ 3వీ ఇంజన్‌తో వస్తుంది. ఈ బైక్ 6,000 ఆర్‌పీఎం వద్ద 11.2 హెచ్‌పీ, 11.75 ఎన్ఎం టార్క్ ఉత్పత్తి చేస్తుంది. అయితే ఈ బైక్ పనితీరు గరిష్టంగా 6000 ఆర్‌పీఎం వద్ద మెరుగ్గా ఉంటుంది. ఈ ఫైవ్ స్పీడ్ ట్రాన్స్‌మిషన్‌తో వస్తుంది. 

టీవీఎస్ రైడర్ ఐగో బైక్ ముందు టెలిస్కోపిక్ సస్పెన్షన్‌తో వస్తుంది. బ్యాక్‌సైడ్ ఐదు దశల్లో సర్దుబాటు చేసేలా గ్యాస్-ఛార్జ్ మోనోషాక్‌తో వస్తుంది. ముందువైపు డిస్క్ బ్రేకింగ్ సిస్టమ్, అలాగే వెనుక భాగంలో డ్రమ్ బ్రేక్ ఉంటుంది. టీవీఎస్ రైడర్ ఐగో హీరో ఎక్స్‌ట్రీమ్ 125 ఆర్, హోండా ఎస్‌పీ 125 వంటి బైక్‌లకు గట్టి పోటీనివ్వనుంది. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి