TVS Apache RTX: టీవీఎస్ నుంచి కొత్త అడ్వెంచర్ బైక్! తక్కువ ధరలో సూపర్ ఫీచర్స్!

ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ టీవీఎస్ తమ తొలి అడ్వెంచర్‌ బైక్‌ను మార్కెట్లో విడుదల చేసింది. రాయల్ ఎన్‌ఫీల్డ్, కెటీయం బైక్స్ కు పోటీగా ఈ బైక్ ను లాంచ్ చేసినట్టు తెలుస్తోంది. ఈ అడ్వెంచర్ బైక్ పెద్ద ఇంజిన్ తో పాటు గతుకుల్లో దూసుకెళ్లేవిధంగా అడ్వాన్స్‌డ్ సస్పెన్షన్ ఫీచర్లతో వస్తుంది. ఈ బైక్ గురించిన మరిన్ని వివరాల్లోకి వెళ్తే..

TVS Apache RTX: టీవీఎస్ నుంచి కొత్త అడ్వెంచర్ బైక్! తక్కువ ధరలో సూపర్ ఫీచర్స్!
Tvs Apache Rtx

Updated on: Oct 22, 2025 | 3:33 PM

టీవీఎస్ అపాచీ ఆర్‌టీఎక్స్‌ 300 (TVS Apache RTX 300) పేరుతో లాంచ్ అయిన ఈ బైక్.. టీవీఎస్ నుంచి వస్తున్న తొలి అడ్వెంచర్ మోటర్ సైకిల్. ఇది KTM 250 అడ్వెంచర్‌, Yezdi అడ్వెంచర్‌, రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ Himalayan వంటి బైక్‌లకు పోటీగా నిలువనుంది. ఇప్పటికే అపాచీ సిరీస్ కు మార్కెట్లో మంచి పేరు ఉంది. ఇప్పుడు అడ్వెంచర్ మార్కెట్లోకి అడుగుపెట్టనుండడంతో ఈ బైక్ కు మంచి క్రేజ్ లభించే అవకాశం ఉంది. ఈ బైక్ లేటెస్ట్ ఫీచర్లు, శక్తివంతమైన ఇంజిన్ తోపాటు డిజైన్ కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంది. అడ్వెంచర్ ప్రేమికులకు ఈ బైక్ బాగా నచ్చుతుందని కంపెనీ అభిప్రాయపడుతోంది.

స్పెసిఫికేషన్లు

ఇక ఈ బైక్ ఫీచర్ల విషయానికొస్తే.. ఇందులో 299 సీసీ లిక్విడ్‌-ఆయిల్ కూల్డ్‌ సింగిల్‌ సిలిండర్‌ RT-XD4 ఇంజిన్‌ ఉంది. ఇది 35.5 హెచ్‌పీ పవర్‌, 28.5 ఎంఎన్‌ టార్క్‌ను జనరేట్ చేస్తుంది. ఇందులో 6-స్పీడ్‌ గేర్‌ బాక్స్‌తో పని చేస్తుంది. బై-డైరెక్షనల్ క్విక్‌షిఫ్టర్‌, స్లిప్పర్ క్లచ్‌ వంటి ఫీచర్స్ తో వస్తోంది. ఇందులో మోనోట్యూబ్ రియర్ సస్పెన్షన్ ఉంటుంది. అడ్వెంచర్ రైడ్స్ కు వీలుగా హై గ్రౌండ్ క్లియరెన్స్ కలిగి ఉంటుంది. ఫ్రంట్ 19 ఇంచ్ ట్యూబ్ లెస్ టైర్స్, బ్యాక్ 17 ఇంచ్ ట్యూబ్ లెస్ టైర్స్ ఉంటాయి.

ధరలు..

ఇకపోతే ఈ బైక్ వెయిట్ 180 కేజీలు ఉంటుంది. సీట్ హైట్ 835 ఎంఎం, గ్రౌండ్ క్లియరెన్స్ 200 ఎంఎం ఉంటాయి.  ABS బ్రేకింగ్ సిస్టమ్, ట్రాక్షన్ కంట్రోల్ వంటి ఫీచర్స్ ఉంటాయి. వీటితోపాటు మ్యాప్‌ మిర్రరింగ్, GoPro కంట్రోల్‌, కాల్‌-ఎస్సెమ్మెస్ అలర్ట్స్ వంటి కనెక్టివిటీ ఫీచర్స్ ఉంటాయి.  టూర్‌, ర్యాలీ, అర్బన్‌, రైన్‌ వంటి నాలుగు రైడ్ మోడ్‌లు ఉంటాయి. ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ 12.5 లీటర్లు ఉంటుంది. మైలేజ్ లీటర్ కు సుమారు 30 కిలోమీటర్లు ఇస్తుంది. ధరలు సుమారు రూ.2 లక్షల నుంచి ప్రారంభమవుతాయి.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి