
భారత ఆర్థిక వ్యవస్థ “చనిపోయింది” అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటన, భారత దిగుమతులపై 25 శాతం సుంకం విధించడం తీవ్ర చర్చకు దారి తీసింది. అయితే ట్రంప్ చెప్పనట్లు నిజంగానే భారత్‌ది డెడ్ ఎకానమీనా అని అమెరికా సృష్టించిన ఏఐ చాట్‌బాట్లను అడిగితే.. ట్రంప్‌కు దిమ్మతిరిగిపోయే సమాధానాలు వచ్చాయి. “భారత ఆర్థిక వ్యవస్థ చనిపోయిందా?” అనే ప్రశ్నకు ఐదు ప్రధాన అమెరికన్ AI ప్లాట్‌ఫామ్‌లు సమాధానం ఇచ్చాయి.
ట్రంప్ భారతదేశంపై తన విమర్శలను తీవ్రతరం చేస్తూ.. భారత్, రష్యా వాణిజ్య సంబంధాన్ని లక్ష్యంగా చేసుకుని ఆ రెండు దేశాల ఆర్థిక వ్యవస్థలు చనిపోయాయి అని విమర్శించారు. భారత వస్తువులపై సుంకాల పెంపు, భారతదేశం రష్యా ముడి చమురు, రక్షణ పరికరాల కొనుగోలుకు సంబంధించి పేర్కొనబడని జరిమానాను ప్రకటిస్తూ, ట్రంప్ ట్రూత్ సోషల్‌లో ఇలా పోస్ట్ చేశారు. “భారతదేశం రష్యాతో ఏమి చేస్తుందో నాకు పట్టింపు లేదు. వారివి డెడ్ ఎకానమీలు. మేం భారతదేశంతో చాలా తక్కువ వ్యాపారం చేసాం, వారి సుంకాలు చాలా ఎక్కువగా ఉన్నాయి, ప్రపంచంలోనే అత్యధికం.” అని పేర్కొన్నారు.
అయితే ట్రంప్ వాదనను కేంద్ర మంత్రి పియూష్ గోయల్ తోసిపుచ్చారు. భారతదేశం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థ అని, కొన్ని సంవత్సరాలలో “మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ”గా అవతరిస్తుందని అని అన్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి