TRAI New Guidelines: ప్రస్తుతం టెలికం కంపెనీలు మొబైల్ (Mobiel Recharge) రీచార్జ్‌లను భారీగా పెంచేశాయి. ఇక వ్యాలిడిటీ విషయానికొస్తే నెల రోజుల పాటు ప్యాకేజీ వేసుకుంటే కేవలం 28 రోజులే వ్యాలిడిటీ (Validity) ఉంటుంది. ఈ నేపథ్యంలో టెలికం రెగ్యులేటర్ ట్రాయ్ (TRAI) టెలికం కంపెనీలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. మొబైల్ ఫోన్ వినియోగదారులకు ఊరట కలిగించే విషయాన్ని వెల్లడించింది. తాజాగా ట్రాయ్ (TRAI)కొత్తమార్గ దర్శకాల (Guidelines) ప్రకారం.. టెలికం కంపెనీలు (Telecom Companies) తప్పకుండా కస్టమర్లకు కొన్ని ప్లాన్స్‌ను అందుబాటులో ఉంచాల్సిన ఉంటుంది. 30 రోజుల వ్యాలిడిటీ ప్లాన్స్‌తో అందించాల్సి ఉంటుందని తెలిపింది. అంటే 30 రోజుల వ్యాలిడిటీ ఉండే ఒక ప్లాన్‌ను అందించాల్సి ఉంటుంది. ఒక స్పెషల టారిప్ వోచర్ (Special Tariff Voucher), ఒక కాంబో వోచర్‌ను వినియోగదారులకు అందించాలి. ట్రాయ్ తీసుకున్న ఈ నిర్ణయంతో వినియోగదారులకు ఊరట కలగనుంది.
ప్రస్తుతం టెలికం కంపెనీలు 28 రోజుల వ్యాలిడిటీతో ప్లాన్స్ ఆఫర్స్ అందిస్తున్నాయి. మరికొన్ని కంపెనీలు కేవలం 24 రోజులపాటు మాత్రమే వ్యాలిడిటీ అందిస్తున్నాయి. 30 రోజుల పాటు అందించే ఎలాంటి ప్లాన్స్ అందుబాటులో లేవు. ఇలాంటి పరిస్థితుల్లో 30 రోజుల వ్యాలిడిటీ ఉండే ఒక ప్లాన్ తప్పకుండా ఉంచాలని ట్రాయ్ టెలికం కంపెనీలకు ఆదేశాలు జారీ చేసింది.
ట్రాయ్‌కు ఫిర్యాదులు..
టెలికం కంపెనీలు 30 రోజుల వ్యాలిడిటీ కాకుండా కేవలం 28 రోజుల వ్యాలిడిటీ అందిస్తున్నాయని ట్రాయ్‌కు ఫిర్యాదులు అందాయి. ఇక స్పందించిన టెలికం రెగ్యులేటర్ ట్రాయ్ (TRAI) 30 రోజుల కాలపరిమితి ఉండే ఓ రీచార్జ్ ఉండేలా చూడాలని సూచించింది.
Press Release No. 07/2022 regarding Telecom Tariff (66th Amendment) Order, 2022’https://t.co/M67neUCnkX
— TRAI (@TRAI) January 27, 2022
ఇవి కూడా చదవండి: