Innova HyCross: డిమాండ్‪ను క్యాష్ చేసుకోవడం అంటే ఇదే! అమాంతం పెరిగిన ఇన్నోవా హైక్రాస్ ధరలు.. మరో వేరియంట్ కూడా లాంచ్..

|

Mar 04, 2023 | 7:30 PM

అత్యాధునిక ఫీచర్స్​తో గతేడాది డిసెంబర్​లో ఇండియాలో అడుగుపెట్టిన ఇన్నోవా హైక్రాస్​కు విశేష ఆదరణ లభిస్తోంది. అయితే దీని ధరను టయోట భారీగా పెంచేసింది.

Innova HyCross: డిమాండ్‪ను క్యాష్ చేసుకోవడం అంటే ఇదే! అమాంతం పెరిగిన ఇన్నోవా హైక్రాస్ ధరలు.. మరో వేరియంట్ కూడా లాంచ్..
Innova Hycross
Follow us on

టయోటా ఇన్నోవా.. అత్యంత ప్రజాదరణ పొందిన వారు. ఇన్నోవా, ఇన్నోవా క్రిస్టా లతో పాటు ఇన్నోవా హైక్రాస్ ను కంపెనీ లాంచ్ చేసింది. వీటన్నంటికీ మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది. ముఖ్యంగా అత్యాధునిక ఫీచర్స్​తో గతేడాది డిసెంబర్​లో ఇండియాలో అడుగుపెట్టిన ఇన్నోవా హైక్రాస్​కు విశేష ఆదరణ లభిస్తోంది. అయితే దీని ధరను టయోట భారీగా పెంచేసింది. వేరియంట్​ బట్టి రూ. 25వేల నుంచి దాదాపు రూ. 75వేల వరకు ధరను పెంచింది. ఫలితంగా ఈ టయోటా ఇన్నోవా హైక్రాస్​ ప్రారంభ ఎక్స్​షోరూం ధర రూ. 18.30లక్షలకు చేరింది. మరోవైపు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాం..

ధరల పెంపు ఇలా..

టయోటా ఇన్నోవా హైక్రాస్ పెట్రోల్, హైబ్రిడ్ పవర్ ట్రెయిన్ తో అందుబాటులో ఉన్నాయి. ఇందులోని 2.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్ 172 బీహెచ్పీ పవర్, 197 ఎన్ఎం టర్క్ ను అందిస్తుంది. మైల్డ్ హైబ్రిడ్ వెర్షన్ 2.0 లీటర్, 4 సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ తో 183 బీహెచ్పీ పవర్ అందిస్తుంది. 23.24కేఎంపీఎల్​ మైలేజ్​ ఇస్తుంది. ధరలు పరిశీలిస్తే.. జీ 7 సీటర్​ పెట్రోల్​ ఓన్లీ వేరియంట్​ ఎక్స్​షోరూం ధర రూ. 18.30లక్షల నుంచి రూ. 18.55లక్షలకు చేరింది. అదే సమయంలో జీ 8 సీటర్​ పెట్రోల్​ ఓన్లీ వేరియంట్​ ధర రూ. 18.35లక్షల నుంచి రూ. 18.60లక్షలకు పెరిగింది. ఇక జీఎక్స్​ 7 సీటర్​ పెట్రోల్​ ఓన్లీ వేరియంట్​ ధర రూ. 19.15లక్షల నుంచి రూ. 19.40లక్షలకు చేరింది. అలాగే జీఎక్స్​ 8 సీటర్​ పెట్రోల్​ ఓన్లీ వేరియంట్​ ధర రూ. 19.20లక్షల నుంచి రూ. 19.45లక్షలకు పెరిగింది. వీఎక్స్​ 7 సీటర్​ స్ట్రాంగ్​ హైబ్రీడ్​ వేరియంట్​ ఎక్స్​షోరూం ధర రూ. 24.01లక్షల నుంచి రూ. 24.76లక్షలకు పెరగడం గమనార్హం. అదే సమయంలో వీఎక్స్​ 8 సీటర్​ స్ట్రాంగ్​ హైబ్రీడ్​ ధర రూ. 24.06లక్షల నుంచి రూ. 24.81లక్షలకు చేరింది. మరోవైపు జెడ్​ఎక్స్​ స్ట్రాంగ్​ హైబ్రీడ్​ ధర రూ. 28.33లక్షల నుంచి రూ. 29.08లక్షలకు పెరిగింది. జెడ్​ఎక్స్​ఓ స్ట్రాంగ్​ హైబ్రీడ్​ ధర రూ. 28.97లక్షల నుంచి రూ. 29.72లక్షలకు పెరగడం గమనార్హం.

మరిన్ని కొత్త మోడళ్లు..

టయోటా కంపెనీ తన ఇన్నోవా హైక్రాస్ వీక్స్(ఓ) వేరియంట్ ను అధికారికంగా విడుదల చేసింది. ఈ వేరియంట్ 7సీటర్, 8సీటర్ కాన్ఫిగరేషన్లలో లభిస్తుంది. వీటి ధరలు వరుసగా రూ. 26.73 లక్షలు, రూ. 26.78 లక్షలు(ఎక్స్ షోరూం) ఉన్నాయి. కొత్త ఇన్నోవా హైక్రాస్ వీఎక్స్(ఓ) వేరియంట్ ఇప్పటికే అందుబాటులో ఉన్న వీఎక్స్, జెడ్ఎక్స్ మధ్య శ్రేణిలో ఉంటుంది. ఇది మూడ్ లైటింగ్ తో కూడిన పనోరమిక్ సన్ రూఫ్, ఎల్ఈడీ ఫాగ్ ల్యాంప్స్, వైర్ లెస్ యాపిల్ కార్ప్లే కనెక్టివిటీతో కూడిన 10 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, 6 ఎయిర్ బ్యాగ్స్ వంటివి ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..