టెక్నాలజీ మరింతగా పెరిగిపోయింది. ఆటో మోబైల్ రంగంలో కొత్త కొత్త వాహనాలు అందుబాటులోకి వస్తున్నాయి. అత్యాధునిక ఫీచర్స్‌ను జోడిస్తూ ఆవిష్కరిస్తున్నాయి వాహనాల తయారీ కంపెనీలు. ఇక ఆటో ఎక్స్‌పో 2023లో ఆటోమేకర్ టొయోటా తన అత్యంత ఖరీదైన కారు టయోటా ల్యాండ్ క్రూయిజర్ 300 ను ఆవిష్కరించింది. దీని ఇంజిన్ కారణంగా సెలబ్రిటీలు, రాజకీయ నాయకులలో ప్రజాదరణ పొందిన వాహనం ఇది. ఈ SUV కారుకు ఎల్లప్పుడూ అధిక డిమాండ్ ఉంటుంది. దీని కారణంగా ఈ వాహనం కావాలంటే ముందస్తుగా బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది.
కొన్ని దేశాల్లో టయోటా ల్యాండ్ క్రూయిజర్ 300 కోసం కొన్ని సంవత్సరాలు ఆగాల్సి ఉంటుంది. భారత మార్కెట్‌లో టయోటా బ్రాండ్‌కు చెందిన ఈ కారు బుకింగ్ అమౌంట్ ఎంత అనేది మీకు తెలియకపోతే దీని గురించి తెలుసుకోండి. మీడియా నివేదికల ప్రకారం, భారత మార్కెట్లో ఈ టయోటా కారును కొనుగోలు చేయాలనుకునే కస్టమర్లు రూ.10 లక్షల బుకింగ్ మొత్తాన్ని చెల్లించాలి. భారతదేశంలో ఈ కారు ధర రూ. 2 కోట్ల 17 లక్షలు (ఎక్స్-షోరూమ్ ధర). అయితే ఈ SUV తదుపరి బ్యాచ్ కోసం బుకింగ్ ఎప్పుడు ప్రారంభించబడుతుందో కంపెనీ ఇంకా స్పష్టం చేయలేదు.
టయోటా ల్యాండ్ క్రూయిజర్ 300 కస్టమర్లకు సరికొత్త టెక్నాలజీ నుండి క్యాబిన్ సౌకర్యం వరకు ప్రతిదీ అందిస్తుంది. ఈ కారులో కంపెనీ 12.3-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను అందించింది. ఇది ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే రెండింటికి మద్దతు ఇస్తుంది.ఈ కారులో 4 జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, మూన్‌రూఫ్, వెంటిలేటెడ్ సీట్లు, బహుళ యూఎస్‌బీ ఛార్జింగ్ పోర్ట్‌లు, వైర్‌లెస్ ఛార్జింగ్, 14 స్పీకర్ జేబీఎల్ ఆడియో సిస్టమ్‌తో సహా ఇతర గొప్ప ఫీచర్లను ఈ కారులో చూడవచ్చు.
ఈ టయోటా SUVలో, కంపెనీ 3.3-లీటర్ ట్వీట్-టర్బో డీజిల్ ఇంజిన్‌ను అందించింది. ఇది 10-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో వస్తుంది. ఇంజిన్ 305hp శక్తిని, 700Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. టొయోటా ల్యాండ్ క్రూయిజర్ 200, టయోటా ల్యాండ్ క్రూయిజర్ 300 వెనుక భాగం ఒకేలా కనిపిస్తుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి