Toshiba CEO: తొషిబా సీఈవో రాజీనామా.. 20 బిలియన్‌ డాలర్ల బిడ్‌ వివాదమే కారణమా..?

| Edited By: Shaik Madar Saheb

Apr 15, 2021 | 10:23 AM

Toshiba CEO Nobuaki Kurumatani: పారిశ్రామిక దిగ్గజం తొషిబా సీఈవో నబౌకి కురుమాతని తన పదవికి రాజీనామా చేశారు. సీవీసీ క్యాపిటల్‌ పార్టనర్స్‌ 20 బిలియన్‌ డాలర్ల బిడ్‌ వివాదం వ్య....

Toshiba CEO: తొషిబా సీఈవో రాజీనామా.. 20 బిలియన్‌ డాలర్ల బిడ్‌ వివాదమే కారణమా..?
Toshiba Ceo
Follow us on

Toshiba CEO Nobuaki Kurumatani: పారిశ్రామిక దిగ్గజం తొషిబా సీఈవో నబౌకి కురుమాతని తన పదవికి రాజీనామా చేశారు. సీవీసీ క్యాపిటల్‌ పార్టనర్స్‌ 20 బిలియన్‌ డాలర్ల బిడ్‌ వివాదం వ్యవహారంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. నేడు కంపెనీ షేర్లు భారీగా పెరిగాయి… దీంతో కంపెనీ ఛైర్మన్‌ సతోషి త్సునకవ సీఈవో బాధ్యతలు చేపట్టినట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. అయితే నబౌకి రాజీనామాకు కారణాలను మాత్రం ప్రకటనలో వెల్లడించలేదు.

గత వారం సీవీసీ సంస్థ తొషిబా సంస్థ ప్రైవేటును చేజిక్కించుకునేందుకు దాఖలు చేసిన బిడ్‌తో ఆయన రాజీనామా వేగవంతం అయినట్లు తెలుస్తోంది. ప్రైవేటు ఈక్వికీ సంస్థ కేకేఆర్‌ అండ్‌కో కూడా దీని కొనుగోలుకు సీవీసీ కంటే ఆకర్షణీయమైన బిడ్‌ను దాఖలు చేసే అంశాన్ని పరిశీలిస్తోందని ఫైనాన్షియల్‌ టైమ్స్‌ పేర్కొంది. మరో పక్క కెనడాకు చెందిన బ్రూక్‌ఫీల్డ్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థ ఆఫర్‌ కూడా ప్రాథమిక స్థాయిలో ఉందని బ్లూమ్‌బెర్గ్‌ పేర్కొంది. ఈ వార్తలపై అటు కేకేఆర్‌ కానీ, ఇటు బ్రూక్‌ ఫీల్డ్‌ కానీ స్పందించేందుకు నిరాకరించాయి.

ఇవీ చదవండి: LPG Gas Cylinder: మీ ఇంట్లో గ్యాస్‌ సిలిండర్‌ ఉందా..? రూ.50 లక్షల వరకు బెనిఫిట్‌.. ఎలాగంటే..!

Sony Smart Tv: స్మార్ట్‌ టీవీలు, ఆడియో ఉత్పత్తులపై సోనీ భారీ ఆఫర్లు.. మార్కెట్లోకి కొత్త స్మార్ట్‌ టీవీల విడుదల