UPI Payments: దేశంలో ఎక్కువమంది వాడుతున్న యూపీఐ యాప్ ఇదే.. ఆశ్చర్యపర్చే లెక్కలు ఇవే..

ప్రస్తుతం ప్రతీఒక్కరి చేతుల్లో స్మార్ట్ ఫోన్ ఉండటంతో యూపీఐ ద్వారా సెకన్లలోనే నిధులు బదిలీ చేయడం, బ్యాలెన్స్ చెక్ చేసుకోవడం, డబ్బులు అందుకోవడం లాంటివి జరుగుతున్నాయి. దీంతో యూపీఐ యాప్స్ వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. గ్రామీణ ప్రాంతాల్లో కూడా యూపీఐ వాడుతున్నారు.

UPI Payments: దేశంలో ఎక్కువమంది వాడుతున్న యూపీఐ యాప్ ఇదే.. ఆశ్చర్యపర్చే లెక్కలు ఇవే..
Upi

Updated on: Jun 30, 2026 | 5:19 PM

దేశంలో యూపీఐ లావాదేవీలు రికార్డ్ స్థాయిలో జరుగుతున్నాయి. దీంతో అనేక కొత్త యాప్స్ పుట్టుకొస్తూనే ఉన్నాయి. దీనికి ఉన్న డిమాండ్ కారణంగా అనేక యాప్స్ మార్కెట్లోకి కొత్తగా వస్తూనే ఉన్నాయి. యాప్స్ మధ్య పోటీ కూడా భారీ స్థాయిలోనే ఉంది. కస్టమర్లను ఆకట్టుకునేందుకు యూపీఐ యాప్స్ రకరకరాల ఆఫర్లు, డిస్కౌంట్లను ప్రకటిస్తున్నాయి. ప్రస్తుతం అనేక యాప్స్ అందుబాటులో ఉండగా.. వీటిల్లో కొన్ని యాప్స్ ఎక్కువ ప్రజాదరణను సొంతం చేసుకున్నాయి. మే 2026 నాటి NPCI లావాదేవీల పరిమాణ డేటా ప్రకారం టాప్ యాప్స్ ఏంటి అనేది చూద్దాం.

తొలి స్థానంలో ఏ యాప్ ఉందంటే..?

ఫోన్‌పే మార్కెట్లో 46.20 శాతం వాటాతో అగ్రగామి యూపీఐ యాప్‌గా ఉంది. అత్యంత వేగవంతమైన బదిలీలు, మర్చంట్ క్యూఆర్ చెల్లింపులతో పాటు యుటిలిటీ బిల్లుల చెల్లింపులు, బీమా కొనుగోళ్లు, మ్యూచువల్ ఫండ్‌లు, డిజిటల్ గోల్డ్ వంటి సేవలతో నెంబర్ వన్ స్థానంలో ఉంది. గూగుల్ పే 32.70 శాతంతో రెండో స్థానంలో ఉంది. స్పష్టమైన, గందరగోళం లేని యూజర్ ఇంటర్‌ఫేస్, నమ్మకమైన పనితీరుతో బాగా ప్రాచుర్యం పొందింది. వాలెట్‌పై ఆధారపడకుండా నేరుగా బ్యాంకు నుండి బ్యాంకుకు బదిలీలను సురక్షితంగా చేయడతో పాటు స్థానిక స్క్రాచ్ కార్డ్ రివార్డులు, క్యాష్‌బ్యాక్‌ల ద్వారా వినియోగదారులను ఆకర్షిస్తోంది. ఇకపేటీఎం 7.90 శాతం వాటాతో మూడో స్థానంలో ఉంది. మర్చంట్ ఆన్‌బోర్డింగ్‌లో మార్గదర్శిగా, పేటీఎం ఆఫ్‌లైన్ రిటైలర్లు, చిన్న వ్యాపారాలకు ఒక కీలకమైన సాధనంగా నిలుస్తోంది. యూపీఐ చెల్లింపులు, ప్రత్యేక డిజిటల్ వాలెట్, తక్కువ విలువ గల ఆఫ్‌లైన్ లావాదేవీల కోసం యూపీఐ లైట్, ఫాస్టాగ్ రీఛార్జ్‌లు, ప్రయాణ టికెటింగ్ వంటివి వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి.

ఈ యాప్స్ ద్వారా రివార్డులు

ఇక నావి 3.60 శాతం వాటాతో నాల్గో స్థానంలో ఉంది. డిజిటల్ చెల్లింపులను వినియోగదారుల ఫైనాన్స్‌తో అనుసంధానించడం ద్వారా వేగంగా సేవలను విస్తరిస్తోంది. ఈ ప్లాట్‌ఫారమ్ వినియోగదారులకు రోజువారీ చెల్లింపులను సజావుగా చేయడానికి వీలు కల్పిస్తూనే.. పర్సనల్ లోన్స్, హెల్త్ ఇన్స్యూరెన్స్, మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు వంటి సేవలను అందిస్తోంది. ఇక ప్లిఫ్ కార్ట్ ఆధ్వర్యంలో నడుస్తున్న సూపర్ మనీ 1.80 శాతం మార్కె్ట్ వాటాతో ఐదో స్థానంలో ఉంది. ఇది వినియోగదారుడికి అనుసంధానించబడిన బ్యాంక్ ఖాతాలోకి నేరుగా తక్షణ, పారదర్శక క్యాష్‌బ్యాక్ రివార్డులను అందించడం ద్వారా క్రమమైన లావాదేవీలు, మర్చంట్ స్కాన్‌లు, యుటిలిటీ బిల్లుల చెల్లింపులను ప్రోత్సహిస్తుంది.  ఇక క్రెడ్ 0.68 శాతం మార్కెట్ వాటాతో తర్వాతి స్థానంలో ఉంది. అధిక విలువ కలిగిన యూపీఐ చెల్లింపులకు ఇంటర్‌ఫేస్‌ను అందించడంతో పాటు, క్రెడిట్ కార్డ్ స్టేట్‌మెంట్‌లు, యుటిలిటీ బిల్లులు చెల్లించినందుకు వినియోగదారులకు ప్రత్యేకమైన బ్రాండ్ ప్రయోజనాలు, క్యాష్‌బ్యాక్ కాయిన్‌లను బహుమతిగా ఇస్తుంది

 

Follow Us