CNG Cars: రూ. 7 లక్షల లోపు అద్భుతమైన సీఎన్‌జీ కార్లు.. 34 కి.మీ మైలేజీ..!

CNG Cars: గత కొన్ని సంవత్సరాలుగా ఎలక్ట్రిక్ వాహనాల డిమాండ్ వేగంగా పెరిగింది. కానీ దాని ధర కారణంగా ఇది ఇప్పటికీ చాలా మందికి అందుబాటులో లేదు. పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరల కారణంగా CNG మంచి ఆప్షన్‌ కావచ్చు. 7 లక్షల లోపు అద్భుతమైన మైలేజీతో కూడిన CNG కారు కావాలనుకుంటే, మీరు ఈ కార్లు మంచి ఆప్షన్‌ కావచ్చు..

CNG Cars: రూ. 7 లక్షల లోపు అద్భుతమైన సీఎన్‌జీ కార్లు.. 34 కి.మీ మైలేజీ..!

Updated on: Feb 22, 2025 | 3:08 PM

దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల పట్ల క్రేజ్ పెరుగుతోంది. కానీ అవి ఇప్పటికీ సామాన్యుల మొదటి ఎంపికగా మారేంత పొదుపుగా లేవు. రోజూ 50 కి.మీ లేదా అంతకంటే ఎక్కువ ప్రయాణించే వారికి CNG కారు మంచి ఎంపిక. ప్రస్తుతం భారత మార్కెట్లో అనేక CNG కార్ల ఎంపికలు అందుబాటులో ఉన్నాయి. మీ అవసరానికి అనుగుణంగా మీరు బడ్జెట్ సెగ్మెంట్ నుండి ప్రీమియం సెగ్మెంట్ వరకు కారును ఎంచుకోవచ్చు. ఈ రోజు మనం మీకు అలాంటి మూడు సీఎన్‌జీ కార్ల గురించి తెలుసుకుందాం. ఇవి గొప్ప మైలేజీని ఇస్తాయి. బడ్జెట్‌కు అనుకూలమైనవి కూడా.

  1. టాటా టియాగో CNG: టాటా టియాగో CNG ఒక గొప్ప ఎంపిక కావచ్చు. ఇది 1.2-లీటర్ ఇంజిన్‌ను కలిగి ఉందిజ ఇది సీఎన్‌జీ మోడ్‌లో 73 HP పవర్, 95 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్‌తో 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ గేర్‌బాక్స్ అందించింది కంపెనీ. ఈ కారు కిలోగ్రాముకు 27 కి.మీ మైలేజీని ఇస్తుంది. దీని ప్రారంభ ధర రూ.5.65 లక్షలు (ఎక్స్-షోరూమ్).
  2. మారుతి సెలెరియో CNG: మారుతి సెలెరియో CNG ఒక గొప్ప కారు. ఇది 1.0-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది జీఎస్‌జీ మోడ్‌లో 34.43 కిమీ/కిలో మైలేజీని అందిస్తుంది. కారులో 5 మంది సులభంగా కూర్చోవచ్చు. భద్రత పరంగా ఈ కారులో EBD, ఎయిర్‌బ్యాగ్‌లతో కూడిన యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అమర్చబడి ఉంది. సెలెరియో సీఎన్‌జీ ఎక్స్-షోరూమ్ ధర రూ.5.64 లక్షల నుండి ప్రారంభమవుతుంది.
  3. మారుతి వాగన్ఆర్ సిఎన్‌జి: మారుతి వాగన్ఆర్ సీఎన్‌జీ ప్రతి ఇంటి ఎంపిక. ఈ శ్రేణిలో మరే కారు కూడా వాగన్ఆర్ లో ఉన్నంత స్థలాన్ని అందించదు. దీనిలో ఐదుగురు మంది హాయిగా కూర్చోవచ్చు. వ్యాగన్ఆర్ 1.0-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది సీఎన్‌జీ మోడ్‌లో 34 కి.మీ/కి.గ్రా మైలేజీని అందిస్తుంది. భద్రత కోసం దీనికి EBD, ఎయిర్‌బ్యాగులు, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అందించింది. ఇది రోజువారీ ఉపయోగం కోసం ఒక గొప్ప ఎంపిక. దీని ప్రారంభ ధర రూ. 6.54 లక్షలు (ఎక్స్-షోరూమ్).

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి