Gold Rate: అబ్బబ్బా.. చాలా రోజులుకు బంగారం ధర తగ్గిందండోయ్…

బంగారమంటే భారతీయలకు లోహం కాదు..అదొక సెంటిమెంట్‌. పిసరంత బంగారమైనా ఇంట్లో ఉండాలనేది 140 కోట్ల ఇండియన్ల కామన్ సెంటిమెంట్. దీంతో బంగారానికి డిమాండ్‌ పెరగడమే తప్ప తగ్గిన పరిస్థితులు లేవు. ఏదో అప్పుడప్పుడు కంటి తుడుపు చర్యగా బంగారం రేటు స్వల్పంగా తగ్గుతూ ఉంటుంది. మన దేశంలో బంగారానికి భారీ డిమాండ్ ​ఉన్నా.. మనదగ్గర ఆ స్థాయిలో ఉత్పత్తి లేదు. దీంతో అంతర్జాతీయ దిగుమతులే ఆధారం.

Gold Rate: అబ్బబ్బా.. చాలా రోజులుకు బంగారం ధర తగ్గిందండోయ్...
Gold Silver Price

Updated on: Feb 22, 2025 | 9:11 AM

బంగారం అంటేనే కొందరికి బలమైన సెంటిమెంట్. మరికొందరికి ఇన్వెస్ట్‌మెంట్ ఎలిమెంట్. భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బందులు ఎదురైతే మన దగ్గర ఉన్న బంగారమే మన ఆస్తి. అందుకే.. సంపన్నులకే కాదు.. పేద, మధ్య తరగతి కుటుంబాల్లో సైతం బంగారం ఒక పెట్టుబడి వస్తువుగా మారింది.  ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్‌ కావడంతో బంగారానికి డిమాండ్‌ మరింత పెరిగింది.  దీనికి తోడు అమెరికాలోకి అధ్యక్ష బాధ్యతలు తీసుకున్న  ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు ప్రపంచ వాణిజ్యంపై ప్రభావం చూపి అది కాస్త బంగారం ధరలు పెరిగేలా చేస్తున్నాయి. అయితే నాలుగు రోజులుగా పైకి ఎగబాగిన ధర నేడు స్వల్పంగా తగ్గింది.

హైదరాబాద్‌లో…  22 క్యారెట్ల జ్యూయలరీ బంగారం రేటు 10 గ్రాములపై రూ.450 మేర తగ్గింది. దీంతో తులం రేటు రూ. 80 వేల 250 వద్దకు దిగివచ్చింది. అయితే, 24 క్యారెట్ల స్వచ్చమైన బంగారం ధర తులానికి రూ.60 పెరిగి రూ.88 వేల 100 వద్దకు చేరింది.

విజయవాడలో…  24 క్యారెట్ల మేలిమి గోల్డ్ రేటు 10 గ్రాముల ధర రూ.88,065 గా ఉంది. 22 క్యారెట్ల ఆభరణాల బంగారం రేటు ధర రూ.80,240గా ఉంది.

హైదరాబాద్ మార్కెట్లో వెండి స్వల్పంగా తగ్గింది. కేటీ వెండి రేటు రూ.100 తగ్గింది. దీంతో ప్రస్తుత ధర రూ. 1,07,900గా ఉంది.

ఇవి శనివారం ఉదయం సమయంలో ఉన్న ధరలు. మధ్యాహ్నానికి రేట్లలో హెచ్చుతగ్గులు ఉండే అవకాశం ఉంది. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, మారుతున్న అంతర్జాతీయ పరిణామాలు, సెంట్రల్ బ్యాంక్ గోల్డ్ రిజర్వు, వడ్డీ రేట్లలో హెచ్చుతగ్గులు.. ఇవన్నీ బంగారం ధరల్ని శాసించే అంశాలే. కాగా పది గ్రాముల 24 క్యారెట్ గోల్డ్ రేట్… లక్ష మార్క్‌ను త్వరలో టచ్ చేసే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి