Gold Price Today: మహిళలకు ఉపశమనం.. బంగారం ధరలకు బ్రేకులు!

Gold Price Today: బంగారం ధరలకు మళ్లీ డిమాండ్ పెరిగింది. గత వారం తగ్గిన ఈ రేట్లు, మళ్లీ పుంజుకున్నాయి. అయితే ప్రస్తుతం మాత్రం స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. మరి దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

Gold Price Today: మహిళలకు ఉపశమనం.. బంగారం ధరలకు బ్రేకులు!
Gold Price

Updated on: Nov 25, 2024 | 6:38 AM

పెళ్లిళ్ల సీజన్‌లో బంగారం, వెండి ధరలు నిరంతరం హెచ్చుతగ్గులకు గురవుతున్నాయి. ఈరోజు భారతదేశంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర స్వల్పంగా తగ్గింది. ప్రస్తుతం రూ.72,990. ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు రూ.79,630గా ఉంది. నిన్నటి ధరలు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.73,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.79,640 ఉంది. అంటే నిన్నటికి ఇప్పటికి ధరలను పోలిస్తే అతి స్వల్పంగా తగ్గిందనే చెప్పొచ్చు. ఇక వెండి విషయానికొస్తే కిలో వెండి ధర ఇది కూడా స్వల్పంగానే తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.91,900 వద్ద కొనసాగుంది. నిన్నటికి ఇప్పటికి కిలోపై కేవలం రూ.100 మాత్రమే తగ్గింది. ఈ ధరలు ఉదయం 6 గంటలకు నమోదైనవి మాత్రమే. రోజులో పెరగవచ్చు.. తగ్గవచ్చు.. లేదా స్థిరంగా కొనసాగవచ్చు. ఇక ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు చూద్దాం.

ప్రధాన నగరాల్లో ధరల వివరాలు:

  1. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.72,990 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.79,630 వద్ద ఉంది.
  2. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.73,140 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.79,980 వద్ద ఉంది.
  3. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.72,990 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.79,630 వద్ద ఉంది.
  4. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.72,990 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.79,630 వద్ద ఉంది.
  5. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.72,990 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.79,630 వద్ద ఉంది.
  6. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.72,990 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.79,630 వద్ద ఉంది.
  7. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.72,990 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.79,630 వద్ద ఉంది.

బంగారం ఒక ప్రధాన పెట్టుబడిగా ఉపయోగపడుతుంది. వివాహాలు, పండుగలలో అపారమైన ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. ఆర్థిక పరిస్థితులు, భౌగోళిక రాజకీయ సంఘటనలు, డిమాండ్, సరఫరా వంటి అనేక కారణాల వల్ల ఈ ధరలు మారుతూ ఉంటాయి. ప్రపంచ మార్కెట్‌లో ఒడిదుడుకుల కారణంగా బంగారం ధరలు తగ్గుతున్నాయి. ఇందులో ఫెడరల్ రిజర్వ్ నిర్ణయాలు వంటి పెద్ద కారణాలు ఉన్నాయి. గోల్డ్‌మన్ శాక్స్ ప్రకారం, అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో సెంట్రల్ బ్యాంకుల ద్వారా బంగారం కొనుగోళ్లు పెరుగుతున్నాయి. ఇది రాబోయే కాలంలో బంగారం ధరలు పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..