Petrol Price Today: కొన్ని రోజుల క్రితం ఆకాశమే హద్దుగా పెరుగుతూ పోయిన పెట్రోల్, డీజిల్ ధరలకు కొంతకాలంగా బ్రేక్ పడిన విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో కొంతమేర తగ్గిన ఇంధన ధరలు ప్రస్తుతం స్థిరంగా కొనసాగుతున్నాయి. ఇదిలా ఉంటే ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరుగుతున్నాయి. రష్యా, ఉక్రెయిన్ మధ్య నెలకొన్ని అస్థిర పరిస్థితులు ఇందుకు కారణంగా చెబుతున్నారు.
ఇదిలా ఉంటే ఈ నేపథ్యంలోనే ఒపెక్ దేశాలు ఫిబ్రవరి 2న కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఇందులో తీసుకునే నిర్ణయం ఆధారంగా పెట్రోల్, డీజిల్ ధరలపై ప్రభావం ఉండనుందని నిపుణులు చెబుతున్నారు. దీంతో వచ్చే నెలలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరగనున్నాయన్న చర్చ జరుగుతోంది. అయితే భారత ప్రభుత్వం ఈ ధరల పెంపును వినియోగదారులపై మోపుతుందో లేదో చూడాలి. ఇక శనివారం (జనవరి 29) దేశ వ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో ఇంధన ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
* దేశ రాజధాని న్యూఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.95.41 వద్ద ఉండగా, డీజిల్ రూ. 86.67 గా ఉంది.
* దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో శనివారం లీటర్ పెట్రోల్ ధర రూ. 109.98 వద్ద కొనసాగుతుండగా, డీజిల్ రూ. 94.14 గా ఉంది.
* తమిళనాడు రాజధని చెన్నైలో లీటర్ పెట్రోల్ రూ. 101.40 గా ఉండగా, డీజిల్ రూ. 91.43వద్ద కొనసాగుతోంది.
* కర్ణాటక రాజధాని బెంగళూరులో శనివారం లీటర్ పెట్రోల్ రూ. 100.58 గా నమోదుకాగా, డీజిల్ రూ. 85.01 గా ఉంది.
* హైదరాబాద్‌లో శనివారం లీటర్ పెట్రోల్ రూ. 108.20 గా ఉండగా, డీజిల్ రూ. 94.62 గా నమోదైంది.
* విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ. 110.51 కాగా, డీజిల్ రూ. 96.59 గా ఉంది.
* సాగరతీరం విశాఖ పట్నంలో లీటర్ పెట్రోల్ ధర రూ. 109.05 గా ఉండగా, డీజిల్ రూ. 95.18 వద్ద కొనసాగుతోంది.
Also Read: NeoCov Virus Live Updates: దేశంలో మరో కొత్త వేరియంట్.. ముగ్గురిలో ఒకరు డెడ్..? (వీడియో)
Sleep Tips: నిద్రలేమితో ఇబ్బందులకు గురవుతున్నారా..? మంచి నిద్ర కోసం బెస్ట్ టిప్స్..!