
ప్రస్తుత రోజుల్లో బైక్ నడిపే వారికి హెల్మెట్ అనేది తప్పనిసరి అవసరంగా మారింది. చాలా మంది తమ వాహనాలను హెల్మెట్ లేకుండా నడుపుతున్నప్పటికీ నిబంధనల ప్రకారం దానిని ధరించడం తప్పనిసరి. అయితే హెల్మెట్ కొనుగోలు చేసే సమయంలో కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. మీకు సరిగ్గా సరిపోయే హెల్మెట్‌ను ధరిస్తే మీ రైడ్‌ను మీరు అంత ఆశ్వాదించగలరు. మీరు ధరించే హెల్మెట్ సౌకర్యంగా లేకపోతే బైక్ రైడ్ అంటేనే చిరాకు వచ్చే పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలో హెల్మెట్ కొనుగోలు చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తపై ఓ లుక్కేద్దాం.
భారతదేశం లాంటి దేశంలో తీవ్రమైన ఉష్ణోగ్రతలు ఉండడం పరిపాటి. ఈ నేపథ్యంలో సరైన వెంటిలేషన్‌కు మద్దతు ఇచ్చే హెల్మెట్ కొనడం చాలా అవసరం. ముఖ్యంగా వేసవి కాలంలో హెల్మెట్ వెంటిలేషన్ లేకపోతే అది మరింత చిరాకు తెప్పిస్తుంది. అలాగే ముదురు రంగులు ఎక్కువ వేడిని గ్రహిస్తాయి కాబట్టి ప్రజలు నల్లటి హెల్మెట్ కొనకుండా ఉండాలని నిపుణులు సలహా ఇస్తున్నారు.
ప్రతి వ్యక్తికి ప్రత్యేకమైన తల ఆకారం, పరిమాణం ఉంటుంది. ఒకరి శరీర నిర్మాణాన్ని అర్థం చేసుకుని దానికి సరిపోయే హెల్మెట్ కొనడం చాలా ముఖ్యం. హెల్మెట్ వదులుగా ఉంటే అది డ్రైవర్‌కు అసౌకర్యంగా అనిపిస్తుంది. అలాగే వారి దృష్టికి కూడా ఆటంకం కలిగిస్తుంది. అలాే హెల్మెట్ మరీ టైట్‌గా ఉంటే అది ఊపిరాడకుండా చేస్తుంది. అలాగే తల కదలికకు కూడా ఆటంకం కలిగిస్తుంది. సరిగ్గా అమర్చి ఉండే హెల్మెట్ ఎల్లప్పుడూ పెద్ద కదలికలను నిరోధిస్తుంది. అలాగే వారి చర్మం లేదా జుట్టును లాగినట్లు అనిపించదు.
హెల్మెట్లకు సంబంధించిన ముఖ్య ఉద్దేశ్యం డ్రైవర్ తలకు గాయాల నుంచి రక్షించడం. ఫలితంగా తల ఆకారం, పరిమాణానికి అనుగుణంగా హెల్మెట్‌ను బిగించడం చాలా ముఖ్యం. హెల్మెట్ బయటకు దొర్లుతుంటే అది వదులుగా ఉందని, డ్రైవర్‌కు అసౌకర్యాన్ని కలిగిస్తుందని అర్థం.
హెల్మెట్ అతి ముఖ్యమైన భాగాలలో ఒకటి దాని విజర్. చాలా మంది దీనిని విస్మరించి స్టైలిష్ వైజర్ల కోసం వెళతారు. ఇది డ్రైవర్ దృష్టిని ప్రభావితం చేస్తుంది. విజర్ అనేది మీకు స్పష్టమైన దృష్టిని అందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
అన్ని హెల్మెట్లు డ్రైవర్లకు గాయాల నుంచి భద్రత కల్పిస్తాయని చెప్పినప్పటికీ వాటి ఐఎస్ఐ గుర్తును కూడా తనిఖీ చేయడం ముఖ్యం. ఐఎస్ఐ గుర్తు ఉంటే, ఆ హెల్మెట్ సంస్థ నిర్వచించిన సంబంధిత నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఉందని నిర్ధారిస్తుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి