తెలుగు రాష్ట్రాల్లో ఇంకా ఎండలు దంచికొడుతున్నాయ్. మండే మాడును చల్లబరిచేందుకు జనాలు ఏసీలు, కూలర్లను ఆశ్రయిస్తున్నారు. అయితే ఇవి కొనాలంటే సామాన్యులకు పెద్ద ఖర్చుతో కూడుకున్న పని. మరి వారికి బడ్జెట్‌లో ఇల్లంతటికి కూలింగ్ నింపేందుకు ఓ స్టాండింగ్ ఫ్యాన్ చాలు. అవునండీ.! స్ప్రింక్లర్ ఫ్యాన్‌లు ఇటీవల మార్కెట్‌లో అందుబాటులోకి వచ్చాయి. ఏసీ, కూలర్లు కొనే బడ్జెట్ లేనివారు.. ఈ ఫ్యాన్‌లపై ఆధారపడుతున్నారు.
ఈ వాటర్ స్ప్రింక్లర్ ఫ్యాన్‌లు ఆన్‌లైన్‌లో అమ్మకానికి ఉన్నాయి. వీటి ధర కొంచెం ఎక్కువే. ఒకవేళ మీరు కొనుక్కునే బడ్జెట్ లేకపోతే.. వాటర్ స్ప్రింక్లర్ ఫ్యాన్ సెటప్ ద్వారా మీ స్టాండ్ ఫ్యాన్‌కే అమర్చవచ్చు. దీనికి ఖర్చు తక్కువే అవుతుంది. ఈ-కామర్స్ వెబ్‌సైట్ అమెజాన్‌లో ఈ సెటప్ అందుబాటులో ఉంది. వెయ్యికే కొనుగోలు చేయవచ్చు. స్ప్రింక్లర్ పైపులు, వాటర్ పంప్ సెటప్ ద్వారా మాములు స్టాండ్ ఫ్యాన్‌ను స్ప్రింక్లర్ ఫ్యాన్‌గా మార్చుకోవచ్చు. ఈ ఫ్యాన్ ఆన్ చేసే ముందుగా.. ఓ బకెట్ నీళ్లను పంప్ సెటప్‌లో నింపితే.. ఆ నీటిని స్ప్రింక్లర్ పైప్ లోపలికి పీల్చుకుని.. ఆ తర్వాత ఫ్యాన్ రెక్కల నుంచి చల్లుతుంది. తద్వారా మనకు చల్లటి గాలి వీస్తుంది.(Source)