Telugu News Business This is the post office scheme that gives good income every month, check details in telugu
Post Office Scheme: మీ పెట్టుబడికి గ్యారంటీ రాబడి.. ప్రతినెలా స్థిరమైన ఆదాయం.. పూర్తి వివరాలు..
ప్రతి నెలా స్థిరమైన ఆదాయం పొందాలనుకునే వారికి పోస్ట్ ఆఫీస్ నెలవారీ ఆదాయ పథకం (పీవోఎమ్ఐఎస్) చాలా ఉపయోగంగా ఉంటుంది. ప్రభుత్వ పథకం కావడంతో ఆకర్షణీయమైన వడ్డీ రేట్లు దీని ప్రత్యేకత. ఈ పథకం ద్వారా మీ పొదుపును నెలవారీ ఆదాయ వనరుగా మార్చుకోవచ్చు. స్థిరమైన వడ్డీరేటుతో పాటు నెలవారీ ఆదాయాన్ని అందిస్తుంది.
జీవితంలో ఆర్థిక స్థిరత్వం, భవిష్యత్తు అవసరాల కోసం ప్రతి ఒక్కరూ పొదుపు చేయడం చాాలా అవసరం. ప్రతి నెలా చిన్నగా చేసిన పొదుపు కొంత కాలానికి పెద్ద మొత్తంగా మారి మీకు ఆర్థిక భరోసా కల్పిస్తుంది. ప్రభుత్వ, ప్రైవేటు సెక్టారులో ఇలాంటి పొదుపు పథకాలు చాలా ఉన్నాయి. అయితే నమ్మకమైన, రిస్క్ లేని పథకాలను ఎంచుకుని పెట్టుబడి పెట్టాలి. దేశంలో ప్రజలు పోస్టాఫీసు పథకాలను ఎక్కువగా నమ్ముతారు. వీటిలో డబ్బులు పెట్టడానికి ఇష్ట పడతారు.
మంచి ఆదాయం..
ప్రతి నెలా స్థిరమైన ఆదాయం పొందాలనుకునే వారికి పోస్ట్ ఆఫీస్ నెలవారీ ఆదాయ పథకం (పీవోఎమ్ఐఎస్) చాలా ఉపయోగంగా ఉంటుంది. ప్రభుత్వ పథకం కావడంతో ఆకర్షణీయమైన వడ్డీ రేట్లు దీని ప్రత్యేకత. ఈ పథకం ద్వారా మీ పొదుపును నెలవారీ ఆదాయ వనరుగా మార్చుకోవచ్చు. స్థిరమైన వడ్డీరేటుతో పాటు నెలవారీ ఆదాయాన్ని అందిస్తుంది.
పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్..
ఈ పథకాన్ని కనీసం రూ.వెయ్యితో ప్రారంభించవచ్చు. ఒక ఖాతాలో గరిష్టంగా రూ.9 లక్షలు, జాయింట్ ఖాతాలో అయితే రూ.15 లక్షలు డిపాజిట్ చేయవచ్చు. ఐదేళ్లలో ఖాతా మెచ్యూర్ అవుతుంది.
నిబంధనలను అనుసరించి ఒక వ్యక్తి ఈ పథకంలో ఒకటి లేదా ఇంకా ఎక్కువ ఖాతాలను నిర్వహించవచ్చు.
ఖాతాను తెరిచిన ఏడాది తర్వాత నుంచి మూడేళ్ల లోపు మూసివేయాలనుకుంటే డిపాజిట్ లో రెండు శాతం మినహాయిస్తారు. మూడేళ్ల తర్వాత మూసివేస్తే ఒక శాతం తగ్గిస్తారు.
పోస్టాఫీసు నెలవారీ ఆదాయ పథకానికి 7.4 శాతం వడ్డీ అందిస్తున్నారు.
వివరాలు ఇవే..
ఇండియా పోస్ట్ అధికారిక వెబ్ పోర్టల్‌లో తెలిపిన వివరాల ప్రకారం ఈ కింది తెలిపిన విధంగా ఖాతాలను ప్రారంభించవచ్చు.
మేజర్లందరూ తెరవొచ్చు.
ముగ్గురు పెద్దల వరకూ జాయింట్ ఖాతా తెరిచే అవకాశం ఉంది.
మైనర్లు, మతిస్థిమితం సరిగ్గా లేనివారి తరఫున వారి సంరక్షకులు ఖాతా నిర్వహించవచ్చు.
పదేళ్ల వయసు దాటిన మైనర్లకూ ఖాతా తెరిచే అవకాశం ఉంది.
డిపాజిట్లు..
కనీసం వెయ్యి రూపాయలతో ఖాతాను ప్రారంభించవచ్చు.
వ్యక్తిగతం ఖాతాలో రూ.9 లక్షలు, జాయింట్ ఖాతాలో రూ.15 లక్షల వరకూ జమ చేయవచ్చు.
ఉమ్మడి ఖాతాలో అందరికీ పెట్టుబడిలో సమాన వాటా ఉంటుంది.
ఒక వ్యక్తి ఒకటి కంటే ఎక్కువ ఖాతాలను నిర్వహించవచ్చు. అయితే వాటిలో డిపాజిట్ రూ.9 లక్షలకు మించకూడదు.
మైనర్ తరఫున సంరక్షకుడు తెరిచిన ఖాతాల పరిమితి వేరుగా ఉంటుంది.
వడ్డీరేటు..
ఖాతా తెరిచి నెల పూర్తయిన నుంచి మెచ్యూరిటీ వరకు వడ్డీ చెల్లిస్తారు.
ప్రతి నెలా వచ్చే వడ్డీని ఖాతాదారుడు క్లెయిమ్ చేసుకోవాలి. లేకపోయినా వడ్డీ మొత్తం మీద ఎటువంటి అదనపు ఆదాయం రాదు.
వడ్డీని అదే పోస్టాఫీసు లేదా ఈసీఎస్ లోని పొదుపు ఖాతాలలోకి ఆటో క్రెడిట్ మళ్లించవచ్చు.
డిపాజిటర్ చేతిలో వడ్డీకి ఆదాయపు పన్ను విధిస్తారు. ఎటువంటి మినహాయింపులు ఉండవు.
ముందస్తుగా ఖాతా మూసివేస్తే..
డిపాజిట్ తేదీ నుంచి ఏడాది లోపు ఎటువంటి డిపాజిట్ విత్‌డ్రా చేయబడదు.
ఖాతా తెరిచిన ఏడాది తర్వాత నుంచి మూడేళ్ల లోపు మూసివేస్తే, డిపాజిట్ నుంచి రెండుశాతం మినహాయిస్తారు. మిగిలిన మొత్తం అందజేస్తారు.
మూడేళ్ల నుంచి ఐదేళ్ల లోపు ఖాతా మూసివేస్తే ఒక శాతం మినహాయింపు ఉంటుంది.
సంబంధిత పోస్టాఫీసులో పాస్‌బుక్‌తో సూచించిన దరఖాస్తు ఫారం అందజేసి, ఖాతాను ముందుగానే మూసివేయవచ్చు.
మెచ్యూరిటీ..
ఖాతా తెరిచిన తేదీ నుంచి ఐదేళ్ల తర్వాత మెచ్యూరిటీ అవుతుంది.
మెచ్యూరిటీకి ముందే ఖాతాదారు చనిపోతే మూసివేయవచ్చు. అతడి నామినీ / చట్టపరమైన వారసులకు మొత్తం చెల్లిస్తారు.