
ప్రస్తుతం మనం సెలవుల సీజన్లో ఉన్నాం. చాలా మంది కుటుంబాలతో టూర్లకు వెళ్లడానికి ఇష్టపడతారు. ఏదైనా హిల్ స్టేషన్ లేదా మంచి టూరిస్ట్ స్పాట్ కు వెళ్లేందుకు మొగ్గుచూపుతారు. అయితే ఇటీవల కాలంలో మొదలైన ట్రెండ్ ఏమిటంటే సొంత కారులోనే టూర్లకు వెళ్లేందుకు ఇష్టపడుతున్నారు. అయితే కొండ ప్రాంతాల్లో కారు డ్రైవింగ్ అంటే అంత తేలిక కాదు. ఘాట్ రోడ్లలో సురక్షితంగా డ్రైవ్ చేయాలంటే దానికి చాలా నేర్పు కావాలి. డ్రైవింగ్ స్కిల్స్ అవసరం అవుతాయి. కొండపైకి ఘాట్ రోడ్లో వెళ్లాలన్నా.. కొండ దిగువకు కారును అదే ఘాట్ రోడ్లో దింపాలన్నా చాలా కష్టం. ఏమాత్రం అశ్రద్ధగా ఉన్నా.. భారీ మూల్యం తప్పదు. పైగా ఎండలు ఎక్కువగా ఉన్న సమయంలో కొండలు, లోయల్లో కారులో ప్రయాణం కూడా ప్రమాదకరమైనదే. కారు ఇంజిన్ పై భారం పడటంతో పాటు బయట వేడి వాతావరణం కూడా దానిపై ప్రభావం చూపుతుంది. అదే సమయంలో వర్షం కురుస్తున్న సమయంలోకూడా ఘాట్ రోడ్డులో ప్రయాణం ప్రమాదకరమే. ఈ నేపథ్యంలో కారులో కొండ ప్రాంతాల్లో ప్రయాణిస్తున్న సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఇప్పుడు తెలుసుకుందాం..
హైవేల పై లేదా పట్టణ వీధుల్లో ఓవర్ టేక్ చేయడం మంచిదే. కానీ కొండలు లేదా పర్వతాల పై ఉన్నప్పుడు, మరొక వాహనాన్ని ఓవర్ టేక్ చేయడానికి ఎప్పుడూ ప్రయత్నించవద్దు. అలా చేయడం వల్ల విపత్తు సంభవించవచ్చు. కొండ ఘాట్ రోడ్లు ఇరుకైనవి, హెయిర్ పిన్ వంకలతో నిండి ఉంటాయి. అటువంటి రోడ్ల పై ఓవర్ టేక్ చేయడానికి ప్రయత్నించడం వల్ల మీకు, ఇతర వాహన డ్రైవర్లకు కూడా ప్రాణాపాయ ప్రమాదం ఏర్పడుతుంది.
కొండ రహదారుల పై తక్కువ వేగంతో డ్రైవింగ్ చేయడం ఉత్తమం. ఇది మీ వాహన నియంత్రణ మీ చేతిలో ఉండేలా చేస్తుంది. ఏదైనా ప్రమాదకరమైన పరిస్థితి ఏర్పడినప్పుడు, అధిక వేగంతో డ్రైవింగ్ ను నియంత్రించడం కంటే తక్కువ వేగంతో వాహనం నడపడం చాలా సులభం. రెండవది, నెమ్మదిగా డ్రైవింగ్ చేయడం వల్ల మీరు రోడ్లు, పరిసరాలను కొంచెం ఆస్వాదించవచ్చు.
కొండల పై డ్రైవింగ్ చేస్తున్నప్పుడు అనుసరించాల్సిన ముఖ్యమైన చిట్కాలలో ఒకటి గేరింగ్. కారు పైకి ఎక్కేటప్పుడు సరైన గేర్లో డ్రైవింగ్ చేయడం అలాగే కిందకు వస్తున్నప్పుడు గేర్ చాలా ముఖ్యం. పైకి ఎక్కేటప్పుడు, వాహనం నెమ్మదిగా వెళ్లేలా చేయడం ద్వారా గురుత్వాకర్షణ శక్తి దానికి వ్యతిరేకంగా పనిచేస్తుంది. అందువల్ల, టార్క్ అవుట్పుట్ గరిష్టంగా ఉండే తక్కువ గేర్లో డ్రైవ్ చేయడం మంచిది. దిగువకు వస్తున్నప్పుడు, మొదటి లేదా రెండవ గేర్లో డ్రైవ్ చేయండి. ఎందుకంటే తక్కువ గేర్లో డ్రైవింగ్ చేయడం వలన వాహనం వేగం పెరగకుండా నియంత్రణ కోల్పోకుండా ఉంటుంది.
కొండల పై డ్రైవింగ్ చేసేటప్పుడు సంప్రదాయ ఫుట్ పెడల్లను ఉపయోగించడం కంటే ఇంజిన్ బ్రేకింగ్ బ్రేకింగ్ అత్యంత ప్రభావవంతమైన పద్ధతి. దిగువకు వస్తున్నప్పుడు, నెమ్మదిగా డ్రైవ్ చేస్తూ, బ్రేక్ ప్యాడ్లు కాలిపోకుండా. విఫలం కాకుండా చూసుకోవడానికి ఈ టెక్నిన్ని ఉపయోగించడం మేలు.
చాలా మంది డ్రైవర్లు దిగువకు వస్తున్నప్పుడు గేర్ ను న్యూట్రల్ చేసి నడుపుతారు. అయితే, అలా చేయడం వల్ల ఇంజిన్ నుంచి గేర్ ను విడదీస్తుంది. ఇది వాహన వేగం పెరిగేలా చేస్తుంది. దీని ఫలితంగా ప్రాణాంతకమైన ప్రమాదం సంభవించవచ్చు. అందువల్ల, ఎల్లప్పుడూ న్యూట్రల్ డ్రైవింగ్ చేయకూడదు. వాహనంపై నియంత్రణ మీ చేతిలో ఉండటానికి మొదటి లేదా రెండవ గేర్లో డ్రైవ్ చేయండి.
చాలా మంది డ్రైవర్లలో మరొక సాధారణ దురభిప్రాయం ఏమిటంటే, క్లచ్లు సగం నొక్కినప్పుడు నడపడం సరైందని భావిస్తారు. ఇలా చేయడం వల్ల క్లచ్ పూర్తిగా విడదీయదు. అలాగే, ఈ ప్రక్రియలో, క్లచ్ ప్లేట్ కాలిపోతుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..