
వినియోగదారులు బ్రాండ్ పేరుకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. కొనే వస్తువు ఏదైనా బ్రాండెడేనా కాదా అనే విషయాన్ని తప్పనిసరిగా చూస్తారు. అయితే మన దేశంలో ఏది టాప్ బ్రాండ్ అంటే అది కొనే వస్తువును బట్టి మారుతుంటుంది. కాని దేశంలో అందుబాటులో ఉన్న వస్తువుల్లోని బ్రాండ్లతో పోల్చి.. అత్యంత విలువైన బ్రాండ్ ఏది అడిగితే చెప్పడం కష్టమే. అయితే దీనిపైనే బ్రాండ్ ఫైనాన్స్ అనే బ్రాండ్ వ్యాల్యూయేషన్, స్ట్రాటజీ కన్సల్టెన్సీ సంస్థ ఓ రిపోర్టును ప్రచురించింది. ఇండియా 100 2024 పేరిట ఆ నివేదికను వెల్లడించింది. తన లెక్కల ప్రకారం మన దేశంలో అత్యంత విలువైన బ్రాండ్ టాటా అని తేల్చింది. టాటా గ్రూప్ బ్రాండ్ వాల్యూ 28.6 బిలియన్ డాలర్లుగా పేర్కొంది. డిజిటలైజేషన్, ఈ-కామర్స్ ఈవీ, ఎలక్ట్రానిక్స్ పై దృష్టి సారిస్తూ దాదాపు 9శాతం తన విలువను పెంచుకున్నట్లు వివరించింది. ఈ నేపథ్యంలో ఈ బ్రాండ్ నివేదికలోని ప్రధాన అంశాలు ఏమిటి? తెలుసుకుందాం రండి..
అభివృద్ధి, స్వావలంబన, స్వయంప్రతిపత్తి విధానాల్లో కొత్త ట్రెండ్ సెట్ చేయడం ద్వారా భారతదేశం గ్లోబల్ సౌత్ లో విభిన్న నాయకుడిగా తనను తాను ప్రదర్శించుకుంటుందని బ్రాండ్ ఫైనాన్స్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ అజిమోన్ ఫ్రాన్సిస్ అన్నారు. భారతదేశం నేడు ప్రపంచ భౌగోళిక రాజకీయాలలో ఒక కీలకమైన శక్తిగా ఉందన్నారు. బ్రాండ్ భారత్ అభివృద్ధి చెందుతోందన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఐటీ సేవలకు ఫ్లాగ్ బేరర్‌గా ఉండటానికి భారతదేశం ప్రయత్నిస్తోందని ఫ్రాన్సిస్ చెప్పారు. గత సంవత్సరం నుంచి భారతదేశం తయారీ, ఇంజినీరింగ్ సేవలు, ఆర్ అండ్ డీ లలో నాలెడ్జ్ హబ్ కొనసాగుతోంది. టెలికాం రంగం బ్రాండ్ విలువలో 61 శాతం వృద్ధిని సాధించిందని. ఆ తర్వాత బ్యాంకింగ్ (26 శాతం), మైనింగ్, ఇనుము, ఉక్కు రంగాలు (ఒక్కొక్కటి కూడా దాదాపు 16 శాతం వృద్ధిని నమోదు చేసుకుంటుంది) అని రంగాల విశ్లేషణ వివరించింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..