Independence Day: మన ఆర్మీ వాడే వాహనాల గురించి తెలుసా? ఇవిగో ఇవే టాప్ ఐదు కార్లు, బైక్‌లు.. 

|

Aug 15, 2024 | 12:47 PM

ఆర్మీ గురించి ఏ విషయమన్నా మనకు ఆసక్తి ఉంటుంది. ఈ నేపథ్యంలో మనం జరుపుకున్న ఈ 78వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆర్మీలో ఉపయోగించే పలు వాహనాల గురించి మన తెలుసుకుందాం. సాధారణంగా భారత సైన్యం కార్యకలాపాలలో వివిధ రకాల వాహనాలను వినియోగిస్తుంటుంది. వాటి పనితీరు, వాటి పరిమాణం, బిల్ట్‌ క్వాలిటీ అన్నీ కూడా సైనిక సామర్థ్యంతో ఉంటాయి.

Independence Day: మన ఆర్మీ వాడే వాహనాల గురించి తెలుసా? ఇవిగో ఇవే టాప్ ఐదు కార్లు, బైక్‌లు.. 
Mahindra Marksman Army Vehicle
Follow us on

ఎందరో వీరుల త్యాగఫలం మన ఈ స్వేచ్ఛా భారతం. మన బలహీనతలను ఆసరాగా చేసుకుని వందల ఏళ్లు ఆంగ్లేయులు మనపై పెత్తనం చేశారు. ఆ బానిసత్వపు చెర నుంచి విముక్తి పొందిన తర్వాత క్రమంగా మన దేశంలో ఆయుధ సంపత్తిని పెంచుకుంది. త్రివిధ దళాలను బలోపేతం చేసుకుంది. ఇప్పుడు ప్రపంచంలో రెండో అతి పెద్ద ఆర్మీని మన దేశం కలిగి ఉంది. ఆర్మీ గురించి ఏ విషయమన్నా మనకు ఆసక్తి ఉంటుంది. ఈ నేపథ్యంలో మనం జరుపుకున్న ఈ 78వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆర్మీలో ఉపయోగించే పలు వాహనాల గురించి మన తెలుసుకుందాం. సాధారణంగా భారత సైన్యం కార్యకలాపాలలో వివిధ రకాల వాహనాలను వినియోగిస్తుంటుంది. వాటి పనితీరు, వాటి పరిమాణం, బిల్ట్‌ క్వాలిటీ అన్నీ కూడా సైనిక సామర్థ్యంతో ఉంటాయి. అలాంటి వాటిల్లో కొన్ని ఈ కథనంలో మీకు పరిచయం చేస్తు‍‍న్నాం. జాబితాలో మహీంద్రా మార్క్స్‌మన్, రెనాల్ట్ షెర్పా, మారుతీ సుజుకి జిప్సీ, రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350, యమహా ఆర్డీ 350 వంటివి ఉన్నాయి. ఇవి సిబ్బంది భద్రతకు కూడా భరోసా ఇస్తాయి.

మహీంద్రా మార్క్స్‌మన్..

భారతదేశ సైనిక వాహన సముదాయంలో ప్రధానమైనది మహీంద్రా మార్క్స్‌మన్. ఇది 105 హార్స్‌ పవర్, 228ఎన్‌ఎం టార్క్‌ని ఉత్పత్తి చేసే ఈఎస్‌3 – కంప్లైంట్ 2.5 లీటర్ డీజిల్ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. ఈ చిన్న సాయుధ వాహనం గరిష్టంగా గంటకు 120 కి.మీ వేగంతో ప్రయాణిస్తుంది. గణనీయమైన గ్రౌండ్ క్లియరెన్స్ 240 మి.మీ ఉంటుంది. టర్నింగ్ వ్యాసార్థం 5.8 మీటర్లు. ఇది మహీంద్రా డిఫెన్స్ సిస్టమ్స్ సామర్థ్యాలను హైలైట్ చేస్తుంది.

రెనాల్ట్ షెర్పా..

నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (ఎన్‌ఎస్‌జీ), సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్‌ఎఫ్‌) దీనిని ఉపయోగిస్తారు. ఇది 4.76ఎల్‌ డీజిల్ ఇంజిన్‌తో నడుస్తుంది. ఇది కఠినమైన వాహనం. పది మంది సిబ్బందిని రవాణా చేయగలగుతుంది. ఇది పూర్తిగా కవచంతో వస్తుంది. తీవ్రవాద నిరోధక కార్యకలాపాలలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.

మారుతీ సుజుకి జిప్సీ..

ఇది భారత సైన్యం ద్వారా అత్యంత గౌరవం పొందింది. బహిరంగంగా నిలిపివేయబడినప్పటికీ, ఈ వాహనం ఇప్పటికీ సైనిక సేవలో ఉంది. 1.3ఎల్‌ జీ13 ఇంజిన్‌తో వస్తుంది. ఆర్మీ-స్పెక్ జిప్సీలు, ఎయిర్ కండిషనింగ్, రియర్ టో బార్లో అమర్చబడి ఉంటాయి.

రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 350..

ఇది భారత సైన్యం మోటార్ బైక్ ఫోర్స్‌లో ముఖ్యమైన భాగం. మొదట్లో దీనిని లండన్‌ నుంచి దిగుమతి చేసుకున్నారు. తర్వాత మద్రాసు కేంద్రంగా తయారవుతోంది. ఫోర్‌ స్ట్రోక్‌ ఇంజిన్‌తో ఉంటుంది. దీనికి చారిత్రక నేపథ్యం ఉంది. రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బ్రాండ్‌ నుంచి వారసత్వంగా ఈ బైక్‌ వస్తోంది.

యమహా ఆర్‌డీ 350..

అసాధారణమైన పనితీరు, నిర్వహణకు ప్రసిద్ధి చెందింది, ఇది భారత సైన్యంలో ప్రసిద్ధ బైక్ గా ఉంది. అధిక ధర, పరిమిత జనాదరణ ఉన్నప్పటికీ, 2-స్ట్రోక్ ఇంజిన్, డైనమిక్ క్వాలిటీలు అనేక సంవత్సరాలపాటు దీనిని ప్రత్యేకమైన ఎంపికగా మార్చాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..