FD Rates: ఎఫ్డీ రేట్లు మారాయి.. ఆ బ్యాంకులో ఏకంగా 9శాతం.. పూర్తి వివరాలు ఇవి..

|

Aug 11, 2024 | 4:22 PM

ముఖ్యంగా స్టాక్‌లు లేదా మ్యూచువల్ ఫండ్స్ వంటి అస్థిరమైన పెట్టుబడి ఎంపికలతో పోలిస్తే.. ఇవి పెట్టుబడిదారులకు భద్రతను భరోసాను అందిస్తాయి. అయితే అన్ని బ్యాంకులు, ఆర్థిక సంస్థల్లో వడ్డీ రేటు ఒకేలా ఉండదు. ఒక్కో బ్యాంకులో ఒక్కో రకంగా ఉంటాయి. ఆగస్టులో పలు బ్యాంకులు తమ ఫిక్స్‌డ్ డిపాజిట్ (ఎఫ్‌డి) వడ్డీ రేట్లను సవరించాయి.

FD Rates: ఎఫ్డీ రేట్లు మారాయి.. ఆ బ్యాంకులో ఏకంగా 9శాతం.. పూర్తి వివరాలు ఇవి..
Fixed Deposit
Follow us on

సురక్షితమైన పెట్టుబడి మార్గాల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్లు మొదటి స్థానంలో ఉంటాయి. నిర్ణీత వ్యవధిలో హామీతో కూడిన రాబడిని ఇవి అందిస్తాయి. ముఖ్యంగా స్టాక్‌లు లేదా మ్యూచువల్ ఫండ్స్ వంటి అస్థిరమైన పెట్టుబడి ఎంపికలతో పోలిస్తే.. ఇవి పెట్టుబడిదారులకు భద్రతను భరోసాను అందిస్తాయి. అయితే అన్ని బ్యాంకులు, ఆర్థిక సంస్థల్లో వడ్డీ రేటు ఒకేలా ఉండదు. ఒక్కో బ్యాంకులో ఒక్కో రకంగా ఉంటాయి. ఆగస్టులో పలు బ్యాంకులు తమ ఫిక్స్‌డ్ డిపాజిట్ (ఎఫ్‌డి) వడ్డీ రేట్లను సవరించాయి. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు 333 రోజుల కాలవ్యవధికి 7.4% అందిస్తుంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ రేట్లు 60 ఏళ్లలోపు వారికి 3.5% నుండి 7.25% వరకు ఉంటాయి. ఫెడరల్ బ్యాంక్ రేట్లు 3% నుండి ప్రారంభమై 7.4% వరకు ఉంటాయి. కర్ణాటక బ్యాంక్ 7.25% వరకు ఆఫర్ చేస్తుంది. బ్యాంక్ ఆఫ్ ఇండియా రేట్లు 3% నుండి 7.3% వరకు ఉంటాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 55 నెలల కాలానికి 7.4% రేటును అందిస్తుంది. ఈ నేపథ్యంలో 60 ఏళ్లలోపు వారికి పలు ప్రైవేట్, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు తమ ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్‌లపై ఆఫర్ చేస్తున్న వడ్డీ రేట్ల గురించి తెలుసుకుందాం..

స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు..

ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్.. ఈ బ్యాంక్ లో అత్యధికంగా 8శాతం వడ్డీ 18 నెలల కాల వ్యవధితో కూడిన ఎఫ్డీపై అందిస్తుంది. కాగా మిగిలిన కాల వ్యవధులపై వడ్డీ రేట్లు ఇలా ఉంటాయి..

1-సంవత్సరం పదవీకాలం: 7.25%

3 సంవత్సరాల పదవీకాలం: 7.5%

5 సంవత్సరాల పదవీకాలం: 7.25%

ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్.. ఈ బ్యాంక్ లో అత్యధికంగా 8.5% వడ్డీ 444 రోజుల కాల వ్యవధితో కూడిన ఎఫ్డీపై లభిస్తుంది. మిగిలిన కాల వ్యవధుల్లో వడ్డీ రేట్లు ఇలా ఉంటాయి.

1-సంవత్సరం పదవీకాలం: 8.2%

3 సంవత్సరాల పదవీకాలం: 8%

5 సంవత్సరాల పదవీకాలం: 7.25%

ఈఎస్ఏఎఫ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్.. ఈ బ్యాంక్ లో అత్యధికంగా 8.25% వడ్డీ రేటు 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల కంటే తక్కువ వ్యవధి ఉన్న ఎఫ్డీపై అందిస్తోంది. మిగిలిన కాల వ్యవధులకు సంబంధించిన వడ్డీ రేట్లు ఇవి..

1-సంవత్సరం పదవీకాలం: 6%

3 సంవత్సరాల పదవీకాలం: 6.75%

5 సంవత్సరాల పదవీకాలం: 6.25%

జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్.. ఈ బ్యాంక్ లో అత్యధికంగా 8.25% వడ్డీ రేటు 365 రోజుల నుంచి 1095 రోజుల మధ్య కాల వ్యవధితో కూడిన ఎఫ్డీపై ఈ వడ్డీ రేటు ఉంటుంది. మిగిలిన కాల వ్యవధులకు సంబంధించిన వడ్డీ రేట్లు ఇవి..

1-సంవత్సరం పదవీకాలం: 8.25%

3 సంవత్సరాల పదవీకాలం: 8.25%

5 సంవత్సరాల పదవీకాలం: 7.25%

నార్త్ ఈస్ట్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్.. ఈ బ్యాంక్ లో అత్యధికంగా 9% వడ్డీ రేటు 546 రోజుల నుంచి 1111 రోజుల మధ్య ఉన్న ఎఫ్డీపై అందిస్తోంది. మిగిలిన కాల వ్యవధులకు సంబంధించిన వడ్డీ రేట్లు ఇవి..

1-సంవత్సరం పదవీకాలం: 7%

3 సంవత్సరాల పదవీకాలం: 9%

5 సంవత్సరాల పదవీకాలం: 6.25%

ప్రైవేట్ రంగ బ్యాంకులు..

యాక్సిస్ బ్యాంక్.. ఈ బ్యాంక్ లో అత్యధికంగా 7.2% వడ్డీ రేటు 17 నెలల నుంచి 18 నెలల కంటే తక్కువ కాల వ్యవధితో కూడిన ఎఫ్డీపై అందిస్తోంది. మిగిలిన కాల వ్యవధులకు సంబంధించిన వడ్డీ రేట్లు ఇవి..

1-సంవత్సరం పదవీకాలం: 6.7%

3 సంవత్సరాల పదవీకాలం: 7.1%

5 సంవత్సరాల పదవీకాలం: 7%

బంధన్ బ్యాంక్.. ఈ బ్యాంక్ లో అత్యధికంగా 8% వడ్డీ రేటు 1 సంవత్సరం 9 నెలల ఎఫ్డీపై అందిస్తోంది. మిగిలిన కాల వ్యవధులకు సంబంధించిన వడ్డీ రేట్లు ఇవి..

1-సంవత్సరం పదవీకాలం: 7.25%

3 సంవత్సరాల పదవీకాలం: 7.25%

5 సంవత్సరాల పదవీకాలం: 5.85%

సిటీ యూనియన్ బ్యాంక్.. ఈ బ్యాంక్ లో అత్యధికంగా 7.25% వడ్డీ రేటు 400 రోజుల కాల వ్యవధితో కూడిన ఎఫ్డీపై లభిస్తోంది. మిగిలిన కాల వ్యవధులకు సంబంధించిన వడ్డీ రేట్లు ఇవి..

1-సంవత్సరం పదవీకాలం: 7%

3 సంవత్సరాల పదవీకాలం: 6.5%

5 సంవత్సరాల పదవీకాలం: 6.25%

సీఎస్బీ బ్యాంక్.. ఈ బ్యాంక్ లో అత్యధికంగా 7.75% వడ్డీ రేటు 401 రోజుల ఎఫ్డీపై లభిస్తోంది. మిగిలిన కాల వ్యవధులకు సంబంధించిన వడ్డీ రేట్లు ఇవి..

1-సంవత్సరం పదవీకాలం: 5%

3 సంవత్సరాల పదవీకాలం: 5.75%

5 సంవత్సరాల పదవీకాలం: 5.75%

డీబీఎస్ బ్యాంక్.. ఈ బ్యాంక్ లో అత్యధికంగా 7.5% వడ్డీ రేటు 376 రోజుల నుంచి 540 రోజులు కాల వ్యవధికి అందిస్తోంది. మిగిలిన కాల వ్యవధులకు సంబంధించిన వడ్డీ రేట్లు ఇవి..

1-సంవత్సరం పదవీకాలం: 7%

3 సంవత్సరాల పదవీకాలం: 6.5%

5 సంవత్సరాల పదవీకాలం: 6.5%

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..