సంపదను పెంచుకోవడానికి, ఆర్థిక లక్ష్యాలను సాధించడానికి ఉత్తమ పెట్టుబడి మార్గాలను ఎంపిక చేసుకోవడం చాలా అవసరం. అలాంటి వాటిలో మ్యూచువల్ ఫండ్స్ ముందుంటాయి. వీటిలో కొంచెం రిస్క్ ఉన్నప్పటికీ దీర్ఘకాలంలో రాబడిని అందిస్తాయి. మ్యూచువల్ ఫండ్స్ అనే మాట ఇటీవల కాలంలో చాలా బాగా వినిపిస్తోంది. గతంలో పట్టణ ప్రజలే వీటిపై ఆసక్తి చూపేవారు. ఇప్పడు గ్రామీణులు కూడా వీటిలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏమిటో తెలుసుకోవడం చాలా అవసరం. అలాగే వాటిలో పెట్టుబడులు పెట్టేముందు కొన్ని అంశాలపై అవగాహన పెంచుకోవాలి. ఈ కింది తెలిపిన విషయాలను పూర్తిగా అర్థం చేసుకుంటే మ్యూచువల్ ఫండ్స్ పై స్పష్టత వస్తుంది.
ముందుగా మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏమిటో తెలుసుకోవడం చాలా అవసరం. స్టాక్ లు, బాండ్లు, ఇతర సెక్యూరిటీలలో పెట్టుబడి పెట్టడానికి ఆసక్తి కలిగిన వారి నుంచి సేకరించిన డబ్బు అని అర్థం. పెట్టుబడి దారుడు తన ఇన్వెస్ట్ మెంట్ ఆధారంగా మ్యూచువల్ ఫండ్ యూనిట్లను కలిగి ఉంటాడు.
మీ పెట్టుబడి లక్ష్యాలను నిర్దేశించుకోవడం చాలా అవసరం. స్వల్పకాలిక, దీర్ఘకాలిక లక్ష్యాలతో పాటు పదవీ విరమణ, విద్య, సంపద నిర్మాణం కోసం పెట్టుబడి పెడుతున్నారా అనే విషయంపై అవగాహన పెంచుకోవాలి. దాని ఆధారంగానే మీకు సరిపడే మ్యూచువల్ ఫండ్‌లను ఎంపిక చేస్తారు.
డైరెక్ట్ ప్లాన్ లో మీరు నేరుగా మ్యూచువల్ ఫండ్ కంపెనీలో పెట్టుబడి పెడతారు. మధ్యవర్తి లేనందున తక్కువ ఖర్చులు, అధిక రాబడికి అవకాశం ఉంటుంది. రెగ్యులర్ ప్లాన్ లో డిస్ట్రిబ్యూటర్, బ్రోకర్ ద్వారా పెట్టుబడి పెడతారు. లావాదేవీల కోసం వారికి కొంత కమీషన్ చెల్లించాలి. దీని వల్ల రాబడి కొద్దిగా తక్కువగా ఉండే అవకాశం ఉంది.
మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టేవారందరూ కేవైసీ ప్రక్రియను పూర్తి చేయాలి. దీనికోసం ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఇతర గుర్తింపు రుజువులు అవసరం.
మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడానికి రెండు ప్రాథమిక మార్గాలు ఉన్నాయి. మొదటిది ఏఎంసీ వెబ్ సైట్లు. అంటే నేరుగా అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ (ఏఎంసీ) వెబ్‌సైట్ల నుంచి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. రెండో పద్ధతితో జెరోదా కాయిన్ (Zerodha Coin), గ్రో (Groww), ఏంజెల్ వన్ (Angel One), పేటీఎమ్ మనీ (Paytm Money) తదితర థర్డ్ పార్టీ ప్లాట్‌ఫాంలను ఉపయోగించవచ్చు. ఇవి బహుళ ఫండ్‌లను ట్రాక్ చేయడంతో పాటు పెట్టుబడి పెట్టడాన్ని సులభం చేస్తాయి.
ఫండ్స్ ఎంపిక..
మీ ఆర్థిక లక్ష్యాలకు అనుగుణంగా ఫండ్ ఎంపిక చేసుకోవడం చాాలా కీలకం.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..