Electric Bike Buying Guide: ఎలక్ట్రిక్ బైక్ కొనేముందు వీటి గురించి తెలుసుకోండి.. లేకుంటే నష్టపోతారు..

|

Jun 10, 2023 | 5:15 PM

దేశీయ ఆటో రంగం ‘ఎలక్ట్రిఫై’ అవుతోంది. పర్యావరణ హితమైన విద్యుత్ శ్రేణి వైపు మళ్లుతోంది. అందరూ ఈ ఎలక్ట్రిక్ వాహనాలనే కొనుగోలు చేయాలని భావిస్తున్నారు. అయితే ఈ ఎలక్ట్రిక్ బైక్ లు లేదా స్కూటర్లను కొనుగోలు చేసే ముందు కొన్ని విషయాలపై అవగాహన కలిగి ఉండటం ముఖ్యం.

Electric Bike Buying Guide: ఎలక్ట్రిక్ బైక్ కొనేముందు వీటి గురించి తెలుసుకోండి.. లేకుంటే నష్టపోతారు..
Electric Scooters
Follow us on

దేశీయ ఆటో రంగం ‘ఎలక్ట్రిఫై’ అవుతోంది. పర్యావరణ హితమైన విద్యుత్ శ్రేణి వైపు మళ్లుతోంది. అందరూ ఈ ఎలక్ట్రిక్ వాహనాలనే కొనుగోలు చేయాలని భావిస్తున్నారు. ముఖ్యంగా అర్బన్ ప్రజలు ఎలక్ట్రిక్ స్కూటర్లను ఇష్టపడుతున్నారు. అయితే ఈ ఎలక్ట్రిక్ బైక్ లను కొనుగోలు చేసే ముందు కొన్ని విషయాలపై అవగాహన కలిగి ఉండటం ముఖ్యం. లేకుంటే ఇబ్బంది పడే అవకాశం ఉంది. అందుకే మీకు ఆ అంశాలను తెలియజేస్తున్నాం. మీరు ఒక వేళ మొదటి సారి ఎలక్ట్రిక్ బైక్ కొనాలనుకొంటున్నట్లు అయితే ఈ కథనం మిస్ అవ్వొద్దు..

చార్జింగ్ సదుపాయం..

ఎలక్ట్రిక్ బైక్ లలో ప్రధాన సమస్య చార్జింగ్. బ్యాటరీ చార్జింగ్ కి ఎక్కువ సమయం పడుతుంది. అలాగే పెట్రోల్, డిజీల్ లాగా ఎక్కడపడితే అక్కడ చార్జింగ్ స్టేషన్లు అందుబాటులో లేవు. ఇటువంటి పరిస్థితుల్లో మీ వాహనం చార్జింగ్ కు పెట్టుకొనేందుకు అనువైన పరిస్థితులు మీ వద్ద కలిగి ఉండాలి. ముఖ్యంగా అపార్ట్ మెంట్లలో ఉండే వారు చార్జింగ్ పెట్టుకోవాలంటే పార్కింగ్ ప్రదేశాల్లో చార్జింగ్ పోర్టులు పెట్టుకోవాల్సి ఉంటుంది. ఆ ఏర్పాట్లు తప్పనిసరి. మరోవైపు ఏథర్, ఓలా వంటి కంపెనీలు పబ్లిక్ ఫాస్ట్ చార్జింగ్ స్టేషన్లు అక్కడక్కడా ఏర్పాటు చేశాయి. వాటి గురించి కూడా తెలుసుకోవాలి. అలాగే కొన్ని ఎలక్ట్రిక్ స్కూటర్లలో మార్చుకోదగని బ్యాటరీలు అందిస్తున్నాయి. స్వాపబుల్ బ్యాటరీలు అన్న మాట. ఇవి లాంగ్ ప్రయాణాలప్పుడు చాలా ఉపయుక్తంగా ఉంటాయి.

ప్రయోజనాలు ఏంటి..

పర్యావరణ హితమైన వాహనాలు కాబట్టి ఎలక్ట్రిక్ వాహనాల వైపు మళ్లుతున్నాం. అయితే వీటి వల్ల కలిగే ఇతర ప్రయోజనాల గురించి కూడా తెలుసుకోవాలి. అందులోని ఫీచర్లు ఏమిటి? వాటి వల్ల మనకు ప్రయోజనం ఏమిటి అవగాహనకు రావాలి. వాస్తవానికి సాధారణ ఇంధన వాహనాలతో పొల్చితే ఇవి చాలా వెయిట్ లెస్ గా ఉంటాయి. అస్సలు సౌండ్ చేయవు. అలాగే సిటీ పరిధిలో ట్రాఫిక్ లో చాలా ఉపయుక్తంగా ఉంటాయి.

ఇవి కూడా చదవండి

రేంజ్ ఎంత ఇస్తుంది..

పెట్రోల్ వాహనాలు మైలేజీ తక్కువ ఇచ్చినా.. వెంటనే రీ ఫ్యూయలింగ్ చేసుకొనే వెసులు బాటు ఉంటుంది కాబట్టి ఇబ్బంది ఉండదు. అదే ఎలక్ట్రిక్ వాహనాల విషయంలో మాత్రం ఇది కాస్త ఇబ్బంది కరం. బ్యాటరీ చార్జింగ్ అయిపోతే అది మళ్లీ రీచార్జ్ చేసుకోవడానికి చాలా సమయం పడుతుంది. అందుకనే ఎలక్ట్రిక్ స్కూటర్లు, బైక్ రేంజ్ ఎంత అనే విషయంలో పూర్తి అవగాహన కలిగి ఉండాలి.

ఎంత లాభం చేకూరుతుంది..

ఎలక్ట్రిక్ వాహనం కొనుగోలు చేస్తున్నారంటే మీ ప్రాథమికంగా ఖర్చు తగ్గించుకునే ఆలోచన. ఎందుకంటే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ల రన్నింగ్ కాస్ట్ సున్నా. అయితే ప్రారంభ ధర మాత్రం కాస్త అధికంగా ఉంటుంది. మీ అవసరాలకు అనుగుణంగా ఎంత మొత్తంలో పెట్టుబడి పెట్టి స్కూటర్ లేదా బైక్ కొనుగోలు చేయాలో బేరీజు వేసుకోవాలి. సాధారణంగా మంచి ఫీచర్లు, రేంజ్ ఉన్న స్కూటర్లు రూ. లక్ష నుంచి ప్రారంభమవుతున్నాయి. ఇప్పటి వరకూ ఫేమ్ 2 నిబంధనల కింద ప్రభుత్వం ఈ వాహనాలపై సబ్సిడీ ఇచ్చింది. ఇకపై ఆ సబ్సిడీ కూడా ప్రభుత్వం తగ్గించడంతో వీటి ధరలు కాస్త పెరిగే అవకాశం ఉంది.

కంపెనీ బ్రాండ్ ఇమేజ్..

మీరు ఎలక్ట్రిక్ వాహనం కొనుగోలు చేసే ముందు ఆ కంపెనీ బ్రాండ్ ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకోవాలి. కంపెనీకి పాత వినియోగదారులు ఇచ్చిన రివ్యూలు, రేటింగ్స్ ను చూడాలి. తమ శక్తి సామర్థ్యాలు నిరూపించుకున్న వాహనాలను కొనుగోలు చేయాలి. వాటి ధర కాస్త ఎక్కువైన మీకు మంచి పనితీరుతో పాటు ఎక్కువ లైఫ్ ఇస్తాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..