Raksha Bandhan: మీ సోదరికి ఎలాంటి బహుమతి ఇవ్వాలో అర్థం కావడం లేదా? ఇవి ట్రై చేయండి..

|

Aug 17, 2024 | 2:56 PM

ఎంతో ప్రేమగా రాఖీ కట్టిన సోదరికి బహుమతులు ఇవ్వడం ఆనవాయితీ. ఈ నేపథ్యంలో అన్నదమ్ములు అనేక రకాల బహుమతులు తమ సోదరీమణులకు ఇస్తుంటారు. చాలామంది డబ్బులు రూపంలో అందిస్తారు. అలా కాకుండా వారికి ఇష్టమైన, అవసరమైన వస్తువులను ఇవ్వడం ప్రత్యేకంగా ఉంటుంది.

Raksha Bandhan: మీ సోదరికి ఎలాంటి బహుమతి ఇవ్వాలో అర్థం కావడం లేదా? ఇవి ట్రై చేయండి..
Raksha Bandhan
Follow us on

సోదర ప్రేమకు చిహ్నంగా భావించే రక్షాబంధన్ పండగ వచ్చేస్తోంది. తోబుట్టువుల మధ్య ఐక్యతకు, ప్రేమానురాగాలకు రాఖీ పండగ ఉదాహరణగా నిలుస్తుంది. సోదరులకు రాఖీలు కట్టడం ద్వారా సోదరీమణులు తమ రక్త సంబంధాన్ని గుర్తుకు తెచ్చుకుంటారు. పెళ్లి అయిపోయి వేరే ప్రాంతానికి వెళ్లిన మహిళలందరూ రాఖీ పండగ రోజు తమ పుట్టింటికి వచ్చి అన్నదమ్ములకు రాఖీలు కడతారు. సుదూర ప్రాంతాల ఉంచి రావడానికి వీలు లేని వారు పోస్టులోనైనా తమ సోదరులకు రాఖీలు పంపిస్తారు. రాఖీలోని దారం సోదరుల మధ్య అనుబంధాన్ని విడిపోకుండా కట్టి ఉంచుతుందని భావిస్తారు.

అనుబంధానికి నిదర్శనం..

ఎంతో ప్రేమగా రాఖీ కట్టిన సోదరికి బహుమతులు ఇవ్వడం ఆనవాయితీ. ఈ నేపథ్యంలో అన్నదమ్ములు అనేక రకాల బహుమతులు తమ సోదరీమణులకు ఇస్తుంటారు. చాలామంది డబ్బులు రూపంలో అందిస్తారు. అలా కాకుండా వారికి ఇష్టమైన, అవసరమైన వస్తువులను ఇవ్వడం ప్రత్యేకంగా ఉంటుంది. చెల్లెలికి అవసరమైన వస్తువులను వెతికి, కొనుగోలు చేసి బహుమతిగా ఇవ్వడం వారిపై మీ ప్రేమను తెలియజేస్తుంది. రాఖీ పండగ రోజు తోబుట్టువులకు ఇవ్వడానికి ఉపయోగపడే వస్తువుల గురించి తెలుసుకుందాం.

బాడీ కేర్ ప్రొడక్ట్స్..

మహిళల కోసం అనేక బాడీ కేర్ ప్రొడక్ట్స్ మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి. నేడు మహిళలందరూ ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తూ కుటుంబానికి అండగా ఉంటున్నారు. నగరాల్లో ఉండేవారు కాలుష్యం కారణంగా బాడీ కేర్ వస్తువులు తప్పకుండా వాడతారు.  అలాంటి వారికి లగ్జరీ బాత్ సాల్ట్స్, ఫేస్ మాస్క్‌లు, సుగంధ నూనెలను బహుమతిగా ఇవ్వవచ్చు.  ఇదే సమయంలో సేంద్రియ, పర్యావరణ అనుకూల ఉత్పత్తులను కొనుగోలు చేయడం వల్ల మరింత ప్రయోజనం ఉంటుంది.

ఇ-గిఫ్ట్ కార్డ్..

రాఖీ కట్టిన సోదరికి ఇ-గిఫ్ట్ కార్డు ఇవ్వడం చాలా మంచి ఆలోచన. ఈ కార్డును ఉపయోగించి వివిధ మాల్స్, షాపులలో నచ్చిన వస్తువులను కొనుగోలు చేసుకునే అవకాశం ఉంటుంది. సోదరికి ఏ బహుమతి ఇవ్వలో నిర్ణయించుకోలేనప్పుడు, గిఫ్ట్ కొనడానికి సమయంలో లేనప్పుడు ఇ-గిఫ్ట్ కార్డు అందజేయవచ్చు.

ఫ్లైట్ పిల్లో, ఐ మాస్క్..

మీ సోదరి ప్రయాణాలు ఎక్కువగా చేస్తూ ఉన్నట్లయితే ఆమెకు ఫ్లైట్ పిల్లో, ఐ మాస్క్ సెట్ బహుమతిగా ఇవ్వండి. ప్రయాణంలో అలసట ఎక్కువగా ఉంటుంది. ఆ సమయంలో ఇవి మంచి విశ్రాంతిని కలిస్తాయి. మెమొరీ ఫోమ్‌తో కూడిన దిండు, శ్వాసక్రియకు అనువుగా ఉండే ఐ మాస్క్‌ను ఎంచుకోండి. సోదరి సౌలభ్యం, శ్రేయస్సు కోసం మీరు తీసుకునే శ్రద్ధకు ఇవి నిదర్శనంగా నిలుస్తాయి.

అలంకార పాట్‌పూరీ..

మీ సోదరి తన ఇంటిని బాగా అలంకరించుకుంటారా, ఇంటి వాతావరణం ఎంతో స్వచ్ఛంగా ఉండాలని కోరుకుంటారా.. అయితే ఆమెకు అలకార పాట్ పూరీ బహుమతి ఇవ్వవచ్చు. సువాసనలు వెదజల్లే ఎండిన మొక్కలు, పువ్వుల మిశ్రమాన్నే పాట్ పూరీ అంటారు. దీనికి ఇంటి గదులలో, హోటళ్లలో సువాసనలు రావడానికి ఉపయోగిస్తారు.

ఆధునిక ఆభరణాలు..

ఆభరణలు అంటే మహిళలు ఎంతో ఇష్టపడతారు. వాటిలోనూ ఆధునిక ఆభరణాలపై వారికి ఎంతో ఆసక్తి ఉంటుంది. రాఖీ పండగ సందర్భంగా ఆధునిక డిజైన్ లో తయారు చేసిన ఆభరణాలను కొనుగోలు చేసి సోదరికి ఇవ్వడం చాలా బాగుంటుంది. బ్రాస్‌లెట్, నెక్లెస్, చెవిపోగులు ఇలాంటి వాటిని ఎంపిక చేసుకోవచ్చు.

ట్రావెల్ కిట్..

సాహసాలు, ప్రయాణాలను ఇష్టపడే సోదరికి ట్రావెల్ కిట్ ను బహుమతిగా అందజేస్తే చాలా బాగుంటుంది. ట్రావెల్ సైజ్డ్ టాయిలెల్ట్రీస్,  కాంపాక్ట్ మిర్రర్, పోర్టబుల్ ఛార్జర్, కొన్ని స్నాక్స్‌తో కలిపి చేసిన ప్యాక్ ను అందజేయండి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..