Best Investment Schemes: ప్రతి రోజూ రూ. 170 పొదుపు చేస్తే.. రూ. కోటి అవుతుంది. అదెలా?

మీ వయసు తక్కువగా ఉన్న సమయంలోనే మీరు ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌(ఎఫ్‌డీ) లేదా మ్యూచువల్‌ ఫండ్స్‌ లేదా పీపీఎఫ్‌లలో పెట్టుబడి పెట్టడం ప్రారంభిస్తే మీకు పెద్ద మొత్తంలో లబ్ధి చేకూరుతుంది. ఉదాహరణకు 20ఏళ్ల వయసులో నెలకు రూ. 5,000 పెట్టుబడి పెడితే, మీరు గరిష్టంగా కోటి రూపాయల వరకు ఫండ్‌ను సృష్టించవచ్చు. అదెలాగో తెలియాలంటే ఇది చదవండి..

Best Investment Schemes: ప్రతి రోజూ రూ. 170 పొదుపు చేస్తే.. రూ. కోటి అవుతుంది. అదెలా?
Money

Updated on: Jan 23, 2024 | 9:12 AM

కొత్త సంవత్సరంలో ఒక నెల అప్పుడే గడిచిపోయింది. జనవరి 23వ తేదీ వచ్చేసింది. సాధారణంగా కొత్త సంవత్సరం ప్రారంభంలో తీసుకున్న నిర్ణయాలు, తీర్మానాలు కొనసాగించడం కష్టమవుతుంది. ముఖ్యంగా ఆర్థిక సంబంధిత విషయాలలో ఇది మరింత ఇబ్బందిగా మారొచ్చు. అందుకే దీనికి తగిన ప్రణాళిక తప్పనిసరి. ముఖ్యంగా ఏదైనా పెట్టుబడి పథకంలో నగదు ఇన్వెస్ట్‌ చేయాలనుకునేవారు మరింత అప్రమత్తంగా ఉండాలి. మీ రాబడి ఎంత? ఖర్చులు ఎంత? పొదుపు ఎంత? అనే విషయాలపై కచ్చితమైన అవగాహన ఉండాలి. అదే సమయంలో మీరు ప్రారంభించే పెట్టుబడి పథకాలు కూడా స్థిరమైన రాబడి ఇచ్చే వాటితో పాటు అధిక ఆదాయం ఇచ్చేవి అయి ఉండాలి. అందుకే మెరుగైన రాబడి కోసం ఎక్కడ పెట్టుబడి పెట్టాలో ముందు తెలుసుకోవాలి. వ్యూహాత్మకంగా ప్రణాళిక చేసుకోవాలి. సాధారణంగా పీపీఎఫ్‌, మ్యూచువల్‌ ఫండ్స్‌, ఫిక్స్‌డ్‌ డిపాజిట్లలో మంచి రాబడి వస్తుంది. ఈ విషయంలో మీకు సహాయ పడే టాప్‌ స్కీమ్‌లను మీకు పరిచయం చేస్తున్నాం. వాటిల్లో మీరు నెలకు రూ. 5000 పెట్టుబడి పెడితే మెచ్యూరిటీ సమయానికి దాదాపు రూ. కోటి ఫండ్‌ ను సంపాదించొచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం..

ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ లేదా మ్యూచువల్‌ ఫండ్స్‌..

మీ వయసు తక్కువగా ఉన్న సమయంలోనే మీరు ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌(ఎఫ్‌డీ) లేదా మ్యూచువల్‌ ఫండ్స్‌ లేదా పీపీఎఫ్‌లలో పెట్టుబడి పెట్టడం ప్రారంభిస్తే మీకు పెద్ద మొత్తంలో లబ్ధి చేకూరుతుంది. ఉదాహరణకు 20ఏళ్ల వయసులో నెలకు రూ. 5,000 పెట్టుబడి పెడితే, మీరు గరిష్టంగా కోటి రూపాయల వరకు ఫండ్‌ను సృష్టించవచ్చు. ఫిక్స్‌డ్‌ డిపాజిట్లో రాబడి గమనిస్తే.. 6.5 శాతం వడ్డీ రేటుతో 10 సంవత్సరాల పాటు నెలకు రూ. 5,000 పెట్టుబడి పెడితే సుమారు రూ. 11,26,282 వస్తుంది. ఈ పెట్టుబడిని మరో పదేళ్లకు పొడిగించాలి. అలా ప్రతి పదేళ్లకు పెట్టుబడిని రీ ఇన్వెస్ట్‌ చేసుకుంటే వెళ్తే 40 ఏళ్లలో అంటే మీ వయసు 60 ఏళ్లు వచ్చే సరికి రూ. 1 కోటికి పైగానే సంపాదన ఉంటుంది.

ఎస్‌ఐపీలో పెట్టుబడి పెడితే..

సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్‌లు (ఎస్‌ఐపీలు) చాలా తక్కువ పెట్టుబడిని గణనీయమైన ఫండ్‌గా మార్చగలవు. వీటి ద్వారా నెలవారీ రూ. 5,000 పెట్టుబడి పెట్టడం ద్వారా, మీరు గణనీయమైన ఫండ్‌ను సృష్టించవచ్చు. ఉదాహరణకు పదేళ్లపాటు నెలకు రూ.5,000 పెట్టుబడి పెడితే దాదాపు రూ.6 లక్షల వరకు జమ అవుతుంది. బలమైన రాబడికి అవకాశం ఉన్నందున.. మరో పదేళ్లపాటు పొడిగించడం వల్ల రూ. 13.9 లక్షల ఫండ్ లభిస్తుంది.ఇలా 40 ఏళ్ల పెట్టుబడి రూ. 24 లక్షల ప్రారంభ పెట్టుబడిపై రూ. 15.5 కోట్ల వరకు రాబడిని పొందవచ్చు.

ఇవి కూడా చదవండి

వీటిని గుర్తుంచుకోండి..

మీరు పెట్టుబడులు ప్రారంభించే ముందు వాటిలోని లాభ నష్టాలను బేరీజు వసుకోవాలి. ముఖ్యంగా మ్యూచువల్‌ ఫండ్స్‌లో రిస్క్‌ ఎక్కువగా ఉంటుంది. అలాగే తక్కువ కాలానికి పెట్టే పెట్టుబడులు నష్టాలను కలిగి ఉంటాయి. అవకాశం ఉన్నంత వరకూ దీర్ఘకాల పెట్టుబడుల వైపు మొగ్గుచూపాలి. అలాగే మీ డబ్బు మొత్తాన్ని ఒకే రకమైన పెట్టుబడి పథకంలో పెట్టడం కంటే వివిధ ప్లాట్‌ఫారమ్‌లలో వైవిధ్యపరచండి. అలాగే తక్కువ వయసులోనే పెట్టుబడులు పెట్టడం వల్ల లాంగ్‌ రన్‌లో మంచి రాబడి వస్తుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..