Financial Planning: ఇవే డేంజర్ బెల్స్.. వెంటనే జాగ్రత్త పడండి.. లేకుంటే అప్పుల ఊబిలోనే..

|

Jul 31, 2024 | 2:27 PM

రుణాలు తీసుకునే అవసరం ప్రతి ఒక్కరికీ కలుగుతుంది. అనుకోని అవసరాలు, విలాసాలు, వస్తువుల కొనుగోలు చేసినప్పుడు తప్పనిసరిగా అప్పు చేస్తాం. అయితే వాటిని చెల్లించడానికి మీరు ఇబ్బందులు పడుతుంటే మాత్రం ఆలోచించాలి. ఒక అప్పు వాయిదా కట్టడానికి మరో అప్పు చేయడం, స్నేహితుల దగ్గర చేబదులు పుచ్చుకోవడం, వాటిని తీర్చడానికి మరొకరి వద్ద చేయి చాచడం చేస్తుంటే మీరు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నట్టే.

Financial Planning: ఇవే డేంజర్ బెల్స్.. వెంటనే జాగ్రత్త పడండి.. లేకుంటే అప్పుల ఊబిలోనే..
Debt
Follow us on

ప్రతి ఒక్కరికీ జీవితంలో ఆర్థిక ప్రణాళిక ఎంతో అవసరం. అది సక్రమంగా ఉన్నప్పుడే జీవితం సాఫీగా సాగుతుంది. భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బందులు ఉండవు. ఆర్థిక ప్రణాళిక అంటే మీకు వచ్చే ఆదాయం, ఖర్చులు, మిగిలే పొదుపును లెక్కవేసుకోవడమే. ఆ పొదుపును పెట్టుబడి పెట్టడానికి వివిధ మార్గాలను అన్వేషించడం. మన జీవితంలో వివిధ అవసరాలకు రుణం తీసుకుంటాం. ముఖ్యంగా బ్యాంకుల నుంచి ఇల్లు, స్తిరాస్థి, కారు, వ్యాపారం పెట్టడానికి రుణాలు తీసుకుంటాం. మన ఆర్థికప్రణాళిక సక్రమంగా ఉన్నప్పుడు నెలవారీ వాయిదాలు ఇబ్బందులు లేకుండా చెల్లించవచ్చు. కానీ మీరు నెలవారీ వాయిదాలు చెల్లించడానికి కూడా ఇబ్బందులు పడుతూ ఉంటే మాత్రం అప్పులలో కూరుకుపోతున్నట్టే. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోవపోతే అనేక అనర్థాలు జరుగుతాయి.

అప్పు ఎక్కువైతే ముప్పే..

రుణాలు తీసుకునే అవసరం ప్రతి ఒక్కరికీ కలుగుతుంది. అనుకోని అవసరాలు, విలాసాలు, వస్తువుల కొనుగోలు చేసినప్పుడు తప్పనిసరిగా అప్పు చేస్తాం. అయితే వాటిని చెల్లించడానికి మీరు ఇబ్బందులు పడుతుంటే మాత్రం ఆలోచించాలి. ఒక అప్పు వాయిదా కట్టడానికి మరో అప్పు చేయడం, స్నేహితుల దగ్గర చేబదులు పుచ్చుకోవడం, వాటిని తీర్చడానికి మరొకరి వద్ద చేయి చాచడం చేస్తుంటే మీరు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నట్టే. ఇవి ప్రారంభంలో పెద్దగా ఇబ్బందులు పెట్టనప్పటికీ కొంతకాలంగా భారీ నష్టాలను దారి తీస్తాయి. మిమ్మల్ని ఉచ్చులో బిగించేస్తాయి. ముఖ్యంగా అప్పుల ఊబిలో చిక్కుకోవడానికి ప్రధాన అంశాలను తెలుసుకుందాం.

  • విలాసవంతమైన జీవితానికి చాలా మంది అలవాటు పడుతున్నారు. పక్కవారితో సమానంగా ఉంటాలని కోరుకుంటున్నారు. ఇలాంటి వారికి నో కాస్ట్ ఈఎంఐ, రాయితీలు, ఆఫర్లు అంటూ అనేక సంస్థలు వివిధ వస్తువులను అందజేస్తున్నాయి. వాటికి తీసుకున్న తర్వాత నెలవారీ ఈఎమ్ఐలు చెల్లించాలి. మీకు ఆదాయం బాగా ఉంటే ఇబ్బంది లేదు. లేకపోతే అప్పులు చేసి చాలా ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. ముఖ్యంగా మీ జీతంలో సగం ఈఎమ్ఐలకు చెల్లిస్తుంటే మీరు అప్పుల ఊబిలో పడటానికి సిద్ధంగా ఉన్నారని గుర్తించుకోండి.
  • ప్రతి నెలా మనకు కొన్ని ఖర్చులు స్థిరంగా ఉంటాయి. ఉదాహరణకు ఇంటి అద్దె, నిత్యావసరాలు, పిల్లల చదువులు, బీమా పాలసీలకు తప్పనిసరిగా ఖర్చు చేయాలి. వీటిని ఆపడం కుదరదు. ఇవి కూడా మన ఆదాయంలో యాభై శాతానికి మించకుండా ఉండాలి. కానీ ఈ ఖర్చులు 70 శాతం ఉన్నాయంటే అప్పుల పాలవ్వక తప్పదు. ఎందుకంటే అనుకోకుండా ఆస్పత్రి ఖర్చులు ఎదురైతే అప్పులు చేయాల్సి ఉంటుంది. వాటిని తీర్చడానికి మరిన్ని ఇబ్బందులు పడాలి. వీటితో తోడు మీకు ఈఎమ్ఐలు ఉంటే మనుగడ కష్టమే.
  • మనకు వచ్చే ఆదాయాన్ని ముందుగా స్థిర ఖర్చులకు కేటాయించాలి. ఆ తర్వాత మిగిలిన వాటిని ప్లాన్ చేసుకోవాలి. అయితే స్థిర ఖర్చులకు కూడా మీరు అప్పు చేస్తున్నారంటే మీ ఆర్థిక పరిస్థితి అస్సలు బాగాలేదని అర్థం. మీరు అప్పుల ఉచ్చులో చిక్కుకుంటున్నారడానికి సంకేతం.
  • ప్రస్తుతం ప్రతి ఒక్కరికీ క్రెడిట్ కార్డు ఉంది. దీనిని అత్యవసర సమయంలో ఉపయోగించుకోవాలి. అంతేగానీ విలాసాలకు వాడితే అప్పులపాలవుతాం. రోజువారీ ఖర్చులు, రుణ చెల్లింపులకు వాడడం మంచిది కాదు. మీరు అలా ఉపయోగిస్తుంటే జాగ్రత్త పడాలి.
  • బ్యాంకులకు రుణం కోసం చేసుకున్న దరఖాస్తులను తిరస్కరిస్తుంటే మీరు ఆలోచించాలి. దరఖాస్తుదారుడి ఆర్థిక స్తోమతను పరిశీలించ తర్వాతే బ్యాంకులు రుణం మంజూరు చేస్తాయి. అతడి పాన్, ఆధార్ వివరాలను ఆధారంగా ఇతర రుణాలు, క్రెడిట్ స్కోర్ తదితర వాటిని పరిశీలిస్తాయి.
  • రాబోయే రోజుల్లో ఆదాయం పెరుగుతుందని చాలామంది ఇప్పుడే రుణాలు చేస్తారు. ఈ పరిస్థితి మీ ఆర్థిక ఇబ్బందులను అద్దం పడుతుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..