Mutual Funds: ఐదేళ్లలో అద్భుతాలు చేసిన ఫండ్స్ ఇవే.. ఊహించని రాబడి

|

Jul 16, 2024 | 3:56 PM

మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టిన పెట్టుబడులకు రాబడి అధికంగా ఉంటుంది. వాటిలో కొంత రిస్క్ ఉన్నప్పటికీ ధీర్ఘకాలంలో అధిక ఆదాయాన్ని ఇస్తాయి. ముఖ్యంగా పెట్టుబడి ఎలా పెట్టామనే విషయంపై రాబడి ఆధారపడి ఉంటుంది. ఈ నేపథ్యంలో మల్టీక్యాప్ మ్యూచువల్ ఫండ్స్ చాలా ఉపయోగంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఇలా ఐదేళ్లలో అధిక రాబడి అందించిన మల్టీక్యాప్ మ్యూచువల్ ఫండ్స్ వివరాలు తెలుసుకుందాం.

Mutual Funds: ఐదేళ్లలో అద్భుతాలు చేసిన ఫండ్స్ ఇవే.. ఊహించని రాబడి
Money
Follow us on

మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టిన పెట్టుబడులకు రాబడి అధికంగా ఉంటుంది. వాటిలో కొంత రిస్క్ ఉన్నప్పటికీ ధీర్ఘకాలంలో అధిక ఆదాయాన్ని ఇస్తాయి. ముఖ్యంగా పెట్టుబడి ఎలా పెట్టామనే విషయంపై రాబడి ఆధారపడి ఉంటుంది. ఈ నేపథ్యంలో మల్టీక్యాప్ మ్యూచువల్ ఫండ్స్ చాలా ఉపయోగంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఇలా ఐదేళ్లలో అధిక రాబడి అందించిన మల్టీక్యాప్ మ్యూచువల్ ఫండ్స్ వివరాలు తెలుసుకుందాం.

అధిక రాబడి..

సాధారణంగా లార్జ్ క్యాప్ ఫండ్‌లలో పెట్టుబడి స్థిరత్వాన్ని అందిస్తుందని, స్మాల్ క్యాప్స్‌లో పెట్టుబడి అధిక రాబడిని ఇస్తుందని, మిడ్ క్యాప్‌లలో పెట్టుబడి వల్ల రెండింటినీ పొందవచ్చని మార్కెట్ నిపుణులు భావిస్తారు. ఈ మూడింటి కలయికనే మల్టీ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ అంటారు. అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా (ఏఎమ్ఎఫ్ఐ) నివేదిక ప్రకారం మల్టీ-క్యాప్ కేటగిరీ మ్యూచువల్ ఫండ్.. ఈక్విటీ, ఈక్విటీ సంబంధిత సాధనాల్లో కనీసం 75 శాతం పెట్టుబడులను కలిగి ఉండాలి. తన ఆస్తులలో కనీసం 25 శాతాన్ని లార్జ్, మిడ్, స్మాల్ క్యాప్ స్టాక్‌లకు కేటాయించాలి.

క్వాంట్ యాక్టివ్ ఫండ్..

ఈ ఫండ్ ఐదేళ్లలో 33.51 శాతం వార్షిక రాబడులతో అగ్రస్థానంలో ఉంది. దీని నిర్వహణలో ఉన్న ఫండ్ ఆస్తులు (ఏయూఎం) రూ. 10,758 కోట్లు, నికర ఆస్తి విలువ (ఎన్ఏవీ) విలువ 778.9542. గా ఉంది. ఈ ఫండ్‌లో కనీస లంప్ సమ్, ఎస్ఐపీ పెట్టుబడులు రూ. 5 వేలు, రూ.1,000గా ఉన్నాయి. దీని పెట్టుబడులో 89.65 శాతం ఈక్విటీలో, 27.56 శాతం లార్జ్ క్యాప్ స్టాక్‌లలో, 22.6 శాతం మిడ్ క్యాప్ స్టాక్‌లలో, 23.66 శాతం స్మాల్ క్యాప్ స్టాక్‌లలో ఉన్నాయి. దీని పోర్ట్‌ఫోలియోలో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, అదానీ పవర్, అరబిందో ఫార్మా, జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ తదితర 57 స్టాక్‌లు ఉన్నాయి. ఈ ఫండ్‌లోని రూ.20 వేల నెలవారీ ఎస్ఐపీ ఐదేళ్ల కాలంలో రూ.29,21,674గా మారింది.

నిప్పాన్ ఇండియా మల్టీ క్యాప్ ఫండ్..

ఈ ఫండ్ ఐదేళ్ల కాలపరిమితిలో 35.56 శాతం వార్షిక రాబడిని ఇచ్చింది. దీని ఏయూఎమ్ 34,943 కోట్లు, ఎన్ఏవీ విలువ రూ. 319.6448గా ఉంది. దేశీయ ఈక్విటీలలో 98.59 శాతం పెట్టుబడులు పెట్టింది. వీటిలో 33.32 శాతం పెద్ద క్యాప్ స్టాక్‌లలో, 22.99 శాతం మిడ్ క్యాప్ స్టాక్‌లలో, 24.03 శాతం స్మాల్ క్యాప్ స్టాక్‌లలో ఉన్నాయి. ఈ ఫండ్ లోని 107 స్టాక్‌ల పోర్ట్‌ఫోలియోలో హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్, లిండే ఇండియా బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఈఐహెచ్ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్ బ్యాంక్ ప్రముఖంగా కనిపిస్తాయి. ఈ ఫండ్ లో రూ. 20 వేల నెలవారీ ఎస్ఐపీ ఇప్పటికి రూ. 28,55,112 అయ్యింది.

మహీంద్రా మాన్యులైఫ్ మల్టీ క్యాప్ ఫండ్..

ఈ ఫండ్ మూడో స్థానంలో కొనసాగుతోంది. ఐదేళ్లలో 32.59 శాతం వార్షిక రాబడిని అందించింది. దీని ఆస్తి రూ. 4,091 కోట్లు, ఎన్ఏవీ ధర రూ.39.9380గా ఉన్నాయి. ఈ ఫండ్ లో కనీస ఎస్ఐపీ పెట్టుబడి 500, లంప్ సమ్ కు రూ.1000గా ఉంది. 2017లో ప్రారంభమైన ఈ ఫండ్ దేశీయ ఈక్విటీలలో 97.65 శాతం పెట్టుబడులను కలిగి ఉంది. వీటిలో 35.41 శాతం పెద్ద క్యాప్ స్టాక్‌లలో, 19.38 శాతం మిడ్ క్యాప్ స్టాక్‌లలో, 19.56 శాతం స్మాల్ క్యాప్ స్టాక్‌లలో ఉన్నాయి. దీని పోర్ట్ పోలియోలోని 66 స్టాక్ లలో కెనరా బ్యాంక్, భారతీ ఎయిర్‌టెల్, హెచ్ పీసీఎల్, టీసీఎస్, ఆర్ఐఎల్ ప్రధానమైనవి. దీనిలో రూ.20వేల నెలవారీ ఎస్ఐపీ ఐదేళ్లలో రూ.26,63,838 ఇచ్చింది.

బరోడా బీఎన్పీ పారిబాస్ మల్టీ క్యాప్ ఫండ్..

నాలుగో స్థానంలో నిలిచిన ఈ ఫండ్ ఐదేళ్లలో 29.5 శాతం వార్షిక రాబడి అందించింది. దీని ఆస్తి రూ.2,459 కోట్లు, ఎన్ఏవీ రూ. 314.6084గా ఉంది. 2013లో ప్రారంభమైన ఈ ఫండ్‌లో కనీస లంప్ సమ్ పెట్టుబడి రూ.5 వేలు, ఎస్ఐపీ పెట్టుబడి రూ. 500. దేశీయ ఈక్విటీలలో 97.13 శాతం పెట్టుబడులను కలిగి ఉంది, వీటిలో 28.22 శాతం పెద్ద క్యాప్ స్టాక్‌లలో, 19.23 శాతం మిడ్ క్యాప్ స్టాక్‌లలో, 22.16 శాతం స్మాల్ క్యాప్ స్టాక్‌లలో ఇన్వెస్ట్ చేశారు. మొత్తం 62 స్టాక్ పోర్ట్ పోలియోలో ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్, ఆర్ఐఎల్, ఏబీబీ పవర్ ప్రొడక్ట్స్ అండ్ సిస్టమ్స్, జ్యోతి సీఎన్ సీ ఆటోమేషన్ ముఖ్యమైనవి. ఐదేళ్ల క్రితం రూ. 20 వేల నెలవారీ ఎస్ఐపీ ఇప్పుడు రూ. 24,76,833గా ఉంది.

ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మల్టీక్యాప్ ఫండ్..

ఈ ఫండ్ ఎస్ఐపీ రాబడి ఐదేళ్ల కాలంలో 29.35 శాతం వచ్చింది. దీని ఏయూఎమ్ రూ.13,025 కోట్లు, ఎన్ఏవీ రూ.852.9400గా ఉంది. 2013 జనవరిలో ప్రారంభమైన ఈ ఫండ్ లో కనీస లంప్ సమ్ పెట్టుబడి రూ. 5వేలు, ఎస్ఐపీ పెట్టుబడి రూ.100గా ఉన్నాయి. ఈ ఫండ్ దేశీయ ఈక్విటీలలో 89.7 శాతం పెట్టుబడిని కలిగి ఉంది, వీటిలో 40 శాతం పెద్ద క్యాప్ స్టాక్‌లలో, 21.31 శాతం మిడ్ క్యాప్ స్టాక్‌లలో, 13.88 శాతం స్మాల్ క్యాప్ స్టాక్‌లలో ఉన్నాయి. ఐసీఐసీఐ బ్యాంక్, సన్ ఫార్మా, ఇన్ఫోసిస్, ఆర్‌ఐఎల్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తదితర ప్రధాన స్టాక్ లతో పాటు 114 దీని పోర్ట్‌ఫోలియోలో ఉన్నాయి. ఈ ఫండ్ లో రూ. 20 వేల నెలవారీ ఎస్ఐపీ ఐదేళ్లలో రూ. 24,68,079గా మారింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..