Personal loan tips: పర్సనల్ లోన్ సులభంగా, అతి తక్కువ వడ్డీకే కావాలంటే ఈ టిప్స్ ఫాలో అవ్వండి..

ఈ పర్సనల్ లోన్లలో ఉన్న ప్రధాన సమస్య అధిక వడ్డీ రేటు. సాధారణంగా పర్సనల్ లోన్లలో అధిక వడ్డీ రేటు విధిస్తారు. అలాగే ఎక్కువ ప్రాసెసింగ్ ఫీజు కూడా ఉంటుంది. అయితే కొన్ని టిప్స్ పాటించడం ద్వారా వడ్డీ రేటును తగ్గించుకోవడంతో పాటు ప్రాసెసింగ్ ఫీజును కూడా చాలా తక్కువ చేసుకోవచ్చు.

Personal loan tips: పర్సనల్ లోన్ సులభంగా, అతి తక్కువ వడ్డీకే కావాలంటే ఈ టిప్స్ ఫాలో అవ్వండి..
Personal Loan Tips

Edited By: Ravi Kiran

Updated on: May 29, 2023 | 9:00 AM

ఇటీవల కాలంలో పర్సనల్ లోన్ తీసుకొనే వారి సంఖ్య బాగా పెరిగింది. ఆర్థిక అత్యవసరాలు, పిల్లల చదువులు, పెళ్లిళ్లు, ఇతర కుటుంబ కార్యక్రమాలు, మెడికల్ బిల్లులు, ఇంటి మరమ్మతులు వంటివి చేయించుకునేందుకు అందరూ పర్సనల్ లోన్లపై ఆధారపడుతున్నారు. హోమ్ లోన్లు, గోల్డ్ లోన్లు వంటివి వాటి కన్నా పర్సనల్ లోన్లను బ్యాంకులు సులభంగా అందిస్తాయి. ఎటువంటి పత్రాలు, హామీలు లేకుండా బ్యాంకులు పర్సనల్ లోన్లను మంజూరు చేస్తున్నాయి. దీంతో వినియోగదారులు వాటిని ఎక్కువగా తీసుకుంటున్నారు. అయితే ఈ పర్సనల్ లోన్లలో ఉన్న ప్రధాన సమస్య అధిక వడ్డీ రేటు. సాధారణంగా పర్సనల్ లోన్లలో అధిక వడ్డీ రేటు విధిస్తారు. అలాగే ఎక్కువ ప్రాసెసింగ్ ఫీజు కూడా ఉంటుంది. అయితే కొన్ని టిప్స్ పాటించడం ద్వారా వడ్డీ రేటును తగ్గించుకోవడంతో పాటు ప్రాసెసింగ్ ఫీజును కూడా చాలా తక్కువ చేసుకోవచ్చు. ఆ టిప్స్ ఏంటో చూద్దాం రండి..

క్రెడిట్ స్కోర్..

ఏ బ్యాంకులో పర్సనల్ లోన్ తీసుకోవాలంటే దానికి ప్రధాన అర్హత మీ క్రెడిట్ స్కోర్. మొదటి బ్యాంకులు చూసేది ఇదే. మీకు మంచి ఆరోగ్యకరమైన క్రెడిట్ స్కోర్ ఉంటే తక్కువ వడ్డీకే మీకు పర్సనల్ లోన్ వస్తుంది. ఈ క్రెడిట్ స్కోర్ బాగా ఉంచుకోడానికి మీరు చేయాల్సింది ఏమిటంటే సమయానికి క్రెడిట్ కార్డు బిల్లులు కట్టాలి. ఒక రోజు కూడా లేట్ చేయకుండా క్రెడిట్ కార్డు బిల్లులు కట్టాలి. అలాగే మీ అకౌంట్ పై ఉన్న లోన్లకు సంబంధించిన ఈఎంఐలు కూడా క్రమం తప్పకుండా చెల్లించాలి. అప్పుడు మంచి క్రెడిట్ స్కోర్ ఏర్పడుతుంది. తద్వారా పర్సనల్ లోన్లు బ్యాంకులు సులభంగా, తక్కువ వడ్డీకి మంజూరు చేస్తాయి.

శాలరీ అకౌంట్ ప్రాధాన్యం..

మీరు ఒకవేళ ఉద్యోగి అయితే మీ శాలరీ అకౌంట్ లో జరుగుతున్న లావాదేవీలు కూడా బ్యాంకర్లు గమనిస్తారు. మీకు లోన్ తిరిగి చెల్లించగలిగే శక్తిసామర్థ్యాలు అకౌంట్ హోల్డర్ కు ఉందా లేదా అన్న విషయాన్ని శాలరీ అకౌంట్ లో జరుగుతున్న లావాదేవీలు, దానిలో ఉంటున్న సగటు బ్యాలెన్స్ వంటివి ప్రభావితం చేస్తాయి. అలాగే క్రెడిట్ హిస్టరీ మెరుగ్గా ఉండేందుకు ఇది దోహదం చేస్తుంది.

బ్యాంకు ఆఫర్లు చూసుకోవాలి..

మీరు పర్సనల్ లోన్ తీసుకోవాలని అనుకొన్నప్పుడు పలు బ్యాంకులను సంప్రదించాలి. అయితే దరఖాస్తు చేయకూడదు. అక్కడి వడ్డీ రేటు, ప్రాసెసింగ్ ఫీజు వంటివి తనిఖీ చేసుకోవాలి. అలాగే బ్యాంకు ఆఫర్లు ఏమైనా ఉన్నాయేమో చూసుకోవాలి. ఏ బ్యాంకులో తక్కువ వడ్డీ రేటు, తక్కువ ప్రాసెసింగ్ ఫీజు ఉందో చూసుకొని దానిలో పర్సనల్ లోన్ కి దరఖాస్తు చేసుకోవాలి.

అదనపు చార్జీలపై ఓ కన్నేయండి..

పర్సనల్ లోన్ తీసుకునే ముందు ప్రాసెసింగ్ ఫీజుతో గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ తో పాటు పలు రకాల చార్జీలు బ్యాంకులు అదనంగా వేస్తుంటాయి. వీటిని తప్పనిసరిగా తనిఖీ చేయాలి. బ్యాంకర్లను అడిగి తెలుసుకోవాలి. లేకుంటే నష్టపోతారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..