Personal Loan: పర్సనల్ లోన్‌ కోసం చూస్తున్నారా.? ఏ బ్యాంకు ఎంత వడ్డీ..

వ్యక్తిగత అవరాల కోసం రుణాలు తీసుకోవడం సర్వసాధారణమైన విషయం. ముఖ్యంగా ఉద్యోగం చేసే వారు వెంటనే పర్సనల్ లోన్‌ వైపు మొగ్గు చూపుతారు. ఎలాంటి ష్యూరిటీ లేకుండా, ఎలాంటి డాక్యుమెంట్స్‌ అవసరం లేకుండా క్షణాల్లో రుణాలు లభించే రోజులు వచ్చేశాయ్. మొబైల్ బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఒక్క క్లిక్‌తో...

Personal Loan: పర్సనల్ లోన్‌ కోసం చూస్తున్నారా.? ఏ బ్యాంకు ఎంత వడ్డీ..
Personal Loan

Updated on: Mar 14, 2024 | 7:06 PM

వ్యక్తిగత అవరాల కోసం రుణాలు తీసుకోవడం సర్వసాధారణమైన విషయం. ముఖ్యంగా ఉద్యోగం చేసే వారు వెంటనే పర్సనల్ లోన్‌ వైపు మొగ్గు చూపుతారు. ఎలాంటి ష్యూరిటీ లేకుండా, ఎలాంటి డాక్యుమెంట్స్‌ అవసరం లేకుండా క్షణాల్లో రుణాలు లభించే రోజులు వచ్చేశాయ్. మొబైల్ బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఒక్క క్లిక్‌తో రుణం పొందే అవకాశం లభించింది. అయితే రుణం తీసుకునే ముందు ఏ బ్యాంక్‌ ఎంత వడ్డీ వసూలు చేస్తుంది అన్న విషయం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి ప్రస్తుతం దేశంలో ఈ బ్యాంక్‌లు ఎంత వడ్డీ వసూలు చేస్తున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..

* ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంక్‌ ఐసీఐసీఐ పర్సనల్‌ లోన్స్‌పై 10.65 శాతం వడ్డీలు వసూలు చేస్తోంది. లోన్‌ తీసుకునే యూజర్ల నుంచి ప్రాసెసింగ్ ఫీజు రూపంలో 2.5 శాతం చెల్లించాల్సి ఉంటుంది.

* దేశంలో ఉన్న మరో ప్రైవేట్ రంగ సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ పర్సనల్ లోన్స్‌పై 10.75 శాతం నుంచి 24 శాతం వరకు వడ్డీ వసూలు చేస్తోంది. ఈ వడ్డీ రేటు అనేది సిబిల్‌ స్కోర్‌పై ఆధారపడి ఉంటుంది. ప్రాసెసింగ్ ఫీజు రూ. 4999గా నిర్ణయించారు. ఈ బ్యాంక్‌ రూ. 40 లక్షల వరకు రుణాన్ని అందిస్తుంది.

* ఇక భారతదేశానికి చెందిన ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ స్టేట్ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా యూజర్ల సిబిల్ స్కోర్ ఆధారంగా రూ. 20 లక్షల వరకు రుణాన్ని అందిస్తోంది. దీనికి 11.15 శాతం వడ్డీని వసూలు చేస్తారు.

* కోటక్ మహీంద్రా పర్సనల్‌ లోన్‌ను యూజర్ల క్రెడిట్ స్కోర్‌ ఆధారంగా రూ. 50 వేల నుంచి రూ. 40 లక్షల వరకు రుణాన్ని అందిస్తున్నారు. ప్రాసెసింగ్ ఫీజు తీసుకున్న రుణంలో 3 శాతం ఉంటుంది. 10.99 శాతం వడ్డీని అందిస్తుంది.

* దేశంలో మరో పెద్ద బ్యాంక్‌ పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ 12.75 శాతం నుంచి 17.25 శాతం వరకు వడ్డీతో రుణాన్ని అందిస్తుంది. ఈ వడ్డీ రేటు సదరు ఖాతాదారుడి సిబిల్ స్కోర్‌పై ఆధారపడి ఉంటుంది.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

Follow Us