Best Electric Cycles: బైక్‌లకు ఏమాత్రం తీసుపోని బెస్ట్ ఈ-సైకిళ్లు.. భారీ తగ్గింపు ధరకే..

|

Sep 03, 2024 | 2:54 PM

ఆరోగ్యం కోసం ప్రతి రోజూ సైక్లింగ్ చేసుకోవచ్చు. మనకు ఇష్టమైన ప్రాంతాలలో విహరించవచ్చు. ఓపిక ఉన్నంత వరకూ వీటిని తొక్కుకుంటూ వెళ్లవచ్చు. ఆ తర్వాత చార్జింగ్ ను ఉపయోగించి బైక్ మాదిరిగా ప్రయాణం సాగించవచ్చు. నేటి కాలంలో సైక్లింగ్ చేయడానికి ప్రతి ఒక్కరూ ప్రాధాన్యం ఇస్తున్నారు.

Best Electric Cycles: బైక్‌లకు ఏమాత్రం తీసుపోని బెస్ట్ ఈ-సైకిళ్లు.. భారీ తగ్గింపు ధరకే..
Urban Terrain Bolton
Follow us on

ఎలక్ట్రిక్ సైకిళ్ల వినియోగం ఇటీవల బాాగా పెరిగింది. ప్రతి ఒక్కరూ వీటిపై ఆసక్తి చూపుతున్నారు. మినీ బైక్ ల మాదిరిగా ఉపయోగే ఈ సైకిళ్లతో అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఆరోగ్యం కోసం ప్రతి రోజూ సైక్లింగ్ చేసుకోవచ్చు. మనకు ఇష్టమైన ప్రాంతాలలో విహరించవచ్చు. ఓపిక ఉన్నంత వరకూ వీటిని తొక్కుకుంటూ వెళ్లవచ్చు. ఆ తర్వాత చార్జింగ్ ను ఉపయోగించి బైక్ మాదిరిగా ప్రయాణం సాగించవచ్చు. నేటి కాలంలో సైక్లింగ్ చేయడానికి ప్రతి ఒక్కరూ ప్రాధాన్యం ఇస్తున్నారు. వైద్యులు కూడా అదే మంచి వ్యాయామం అని సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆరోగ్యానికి, ఆనందానికి ఉపయోగపడే ఎలక్ట్రిక్ సైకిళ్లు (ఈ సైకిళ్లు) అమెజాన్ లో భారీ డిస్కౌంట్ పై అందుబాటులో ఉన్నాయి. మామూలు ధర మీద దాదాపు 66 శాతం తగ్గింపుపై విక్రయాలు జరుపుతున్నారు. అమెజాన్ లో అందుబాటులో ఉన్న సైకిళ్ల వివరాలు, వాటి ప్రత్యేకతలు, ధరలను తెలుసుకుందాం.

హీరో లెక్ట్రో కింజా-ఐ..

సౌకర్యం కోరుకునే వారికి ఈ మోడల్ బాగా నప్పుతుంది. ఈ ఎలక్ట్రిక్ సైకిల్ లో ఐపీ 67 రక్షణతో 36V, 5.8Ah Li-ion బ్యాటరీ, 250 డబ్ల్యూ బీఎల్ డీసీ వెనుక హబ్ మోటారు ఏర్పాటు చేశారు. దీనివల్ల నీరు, ధూళి నుంచి ర్షణ లభిస్తుంది. ఈ -బైక్ ను 95 శాతం అసెంబుల్ చేశారు. ఆర్ఎఫ్ఐడీ కీ లాక్‌, ఎల్ ఈడీ డిస్‌ప్లే , ఆండ్రాయిడ్ ఆధారిత మొబైల్ యాప్‌ ఉన్నాయి. 18 అంగుళాల అల్లాయ్ ఫ్రేమ్, ఫ్రంట్ సస్పెన్షన్, సౌరశక్తితో నడిచే వెనుక లైట్ అదనపు ప్రత్యేకతలు

అర్బన్ టెర్రైన్ బోల్టన్..

నగరంలో తిరగడానికి, వివిధ ప్రాంతాలలో పర్యటించడానికి చాలా ఉపయోగంగా ఉంటుంది. దీనిలో 250 డబ్ల్యూ బీఎల్ డీసీ మోటార్, 36వీ, 7.8 ఏహెచ్ ఇంటిగ్రేటెడ్ బ్యాటరీ ఉన్నాయి. పెడల్ అసిస్ట్‌తో 35 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది. కేవలం నాలుగు గంటల్లో పూర్తిగా రీఛార్జ్ చేయవచ్చు. అధిక నాణ్యత డ్యూయల్ డిస్క్ బ్రేక్‌ల కారణంలో భద్రత పరంగా చాలా బాగుంటుంది. దీని స్టీల్ ఫ్రేమ్ మంచి స్టైలిష్ లుక్ ఇస్తుంది. స్లైల్ మరియు మన్నిక కోరుకునేవారికి మంచి ఎంపిక. దీన్ని అమెజాన్ లో డిస్కౌంట్ పై రూ.21,999కి అందజేస్తున్నారు.

సినర్జీ బీ1 ఎలక్ట్రిక్ సైకిల్..

డ్యూయల్ డిస్క్ బ్రేక్ లు, ఆకర్షణయమైన పసుపు రంగులో లభిస్తున్న సిజెర్జీ బీ1 ఈ-సైకిల్ మెరుగైన భద్రతను అందించడంతో పాటు సౌకర్యవంతమైన ప్రయాణానికి ఎంతో వీలుగా ఉంటుంది. దీనిలో 250 డబ్ల్యూ బీఎల్ డీసీ మోటార్, 5.8ఏహెచ్ Li-Ion బ్యాటరీని ఉన్నాయి. మెరుగైన భద్రత కోసం డ్యూయల్ డిస్క్ బ్రేక్‌లు, బ్యాటరీ స్థాయిని ఎప్పటికప్పుడు చూసుకోవడానికి థొరెటల్ ఎల్ఈడీ డిస్‌ప్లే ఏర్పాటు చేశారు. ఈ బైక్ 95 శాతం ముందే అసెంబుల్ చేయబడింది. ముఖ్యంగా పెద్దవారికి చాలా ఉపయోగంగా ఉంటుంది. రూ.22,425కు ఈ సైకిల్ అందుబాటులో ఉంది.

గీకే హ్యాష్‌ట్యాగ్..

నగరంలో ప్రయాణానికి గీకే హ్యాష్‌ట్యాగ్ ఈ-సైకిల్ ఎంతో సౌకర్యంగా ఉంటుంది. దీనిలో 250 డబ్ల్యూ బీఎల్డీసీ మోటార్, 7.5ఏహెచ్ Li-ion బ్యాటరీ ఏర్పాటు చేశారు. టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఫోర్క్ 100 ఎమ్ఎమ్ ట్రావెల్, డ్యూయల్ డిస్క్ బ్రేక్‌లు అదనపు ప్రత్యేకతలు. సైకిల్ ను నియంత్రణ చేయడానికి, మెరుగైన భద్రత కల్పించడానికి చాలా ఉపయోగపడతాయి. ఇంటిగ్రేటెడ్ హార్న్, మెరుగైన హెడ్‌లైట్, ధృడమైన కార్బన్ స్టీల్ ఫ్రేమ్, మంచి డిజైన్ తో ఆకట్టుకుంటోంది. అమెజాన్ లో రూ.23,999 ధరకు దీన్ని సొంతం చేసుకోవచ్చు.

గీకే ఈటీఎక్స్..

ఎలక్ట్రిక్ సైకిల్ కొనుగోలు చేయాలనుకునే వారికి . గీకే ఈటీఎక్స్ మరో ఉత్తమ ఎంపిక. దీనిలో 250 డబ్ల్యూ బీఎల్ డీసీ మోటార్, 7.8 ఏహెచ్ నాన్-రిమూవబుల్ బ్యాటరీ తో ప్రయాణానికి చాలా వీలుగా ఉంటుంది. డ్యూయల్ డిస్క్ బ్రేక్‌ లతో వాహనాన్ని చక్కగా నియంత్రించవచ్చు. ప్రయాణం సాఫీగా, సమర్థంగా జరిగేలా దృఢమైన ఫోర్క్‌ను ఏర్పాటు చేశారు. ఇంటిగ్రేటెడ్ ఎల్ఈడీ లైట్, హార్న్ మన ప్రయాణంతో చాలా ఉపయోగడపతాయి. సూర్యుడి వెలుగు తగ్గిపోయిందని కంగారు పడనవసరం లేదు. పెడల్ అసిస్ట్‌పై 40 కిమీల పరిధి ఈజీగా తిరొగొచ్చు. ఈ సైకిల్ రూ.21,999కు అమెజాన్ లో అందుబాటులో ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..