Telugu News Business These are the differences between Ather Rizta Z and Ola S1 Pro, check details in telugu
Electric Scooters: మార్కెట్లో బెస్ట్ ఈ-స్కూటర్లు ఇవే.. ఆ రెండు స్కూటర్లలో ప్రత్యేకతలు ఇవిగో..
Ather Rizta Z vs Ola S1 Pro: ప్రజల ఆదరణకు అనుగుణంగా వివిధ కంపెనీలు ద్విచక్ర ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేసి మార్కెట్‌లోకి విడుదల చేస్తున్నాయి. వీటిలో ఫీచర్ల కూడా అత్యద్భుతంగా ఉంటున్నాయి. ఈ వాహనాలలో ఏది ఎంపిక చేసుకోవాలో కొనుగోలుదారులకు కొంచెం కష్టమే. అయితే ఫీచర్ల ను ఒకదానితో ఒకటి పోల్చి చూసినప్పుడు మనకు కొంత అవగాహన కలుగుతుంది. ఇప్పుడు ఏథర్ రిజ్టా జెడ్, ఓలా ఎస్ 1 ప్రో వాహనాల ప్రత్యేకతలు, ధరలు, ఫీచర్లను తెలుసుకుందాం.
దేశంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల సేల్స్ ఫుల్ స్పీడ్ లో సాగుతున్నాయి. ఈ విభాగంలో వాహనాలకు ప్రజల ఆదరణ పెరిగింది. పెట్రోలు, డీజిల్ వాహనాలతో పోల్చితే వీటిలో అనేక సౌకర్యాలున్నాయి. వాతావరణ కాలుష్యాన్ని తగ్గించి, పర్యావరణ పరిరక్షణకు కూడా ఇవి ఉపయోగపడతాయి. వీటికి తోడు ప్రభుత్వ ప్రోత్సాహం కూడా ఉండడంతో ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాలు బాగా ఎక్కువయ్యాయి.
ప్రజల ఆదరణ..
ప్రజల ఆదరణకు అనుగుణంగా వివిధ కంపెనీలు ద్విచక్ర ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేసి మార్కెట్‌లోకి విడుదల చేస్తున్నాయి. వీటిలో ఫీచర్ల కూడా అత్యద్భుతంగా ఉంటున్నాయి. ఈ వాహనాలలో ఏది ఎంపిక చేసుకోవాలో కొనుగోలుదారులకు కొంచెం కష్టమే. అయితే ఫీచర్ల ను ఒకదానితో ఒకటి పోల్చి చూసినప్పుడు మనకు కొంత అవగాహన కలుగుతుంది. ఇప్పుడు ఏథర్ రిజ్టా జెడ్, ఓలా ఎస్ 1 ప్రో వాహనాల ప్రత్యేకతలు, ధరలు, ఫీచర్లను తెలుసుకుందాం.
బెస్ట్ మోడల్స్ ఇవే..
ఎలక్ట్రిక్ టూ వీలర్ మార్కెట్ లో ఏథర్ రిజ్టా జెడ్ ఒక సంచలనం అని చెప్పవచ్చు. అయితే మార్కెట్‌లో దీనికి పోటీగా మరికొన్ని ఎలక్ట్రిక్ వాహనాలు ఉన్నాయి. వాటిలో ఓలా ఎస్ 1 ప్రో ఒకటి. ఈ రెండు వాహనాలలో ఏది మంచిదో చెప్పడం చాలా కష్టం. కానీ ఫీచర్లను తెలుసుకోవడం ద్వారా ఒక అంచనాకు రావొచ్చు.
డిజైన్..
ముందుగా ఈ రెండు స్కూటర్ల డిజైన్ ను పరిశీలిద్దాం. ఒకదానికి ఒకటి భిన్నంగా ఉంటాయి. ముఖ్యంగా ఏథర్ రిజ్టా జెడ్ వాహనం బాక్స్ బాడీ వర్క్ తో ఉంది. అలాగే ఆకారంలో పెద్దదిగా కనిపిస్తుంది.
మరోవైపు ఓలా ఎస్ 1 ప్రో వాహనానికి కర్వీ బాడీ వర్క్ చేశారు. ఆకారం కొంచెం భిన్నంగా ఉంటుంది. అయితే ఈ రెండు ఈవీల డిజైన్లు కచ్చితంగా కొనుగోలుదారులను ఆకట్టుకుంటాయి.
ఫీచర్లు..
ఏథర్ రిజ్టా జెడ్ లో అనేక ఫీచర్లు ఉన్నాయి. స్మార్ట్, ఎకో, జిప్, ట్రాక్షన్ కంట్రోల్, మొబైల్ చార్జింగ్, ఆటో హోల్డ్, రివర్స్ మోడ్‌తో సహా అనేక ఫీచర్లతో అందుబాటులో ఉంది. స్కూటర్ లోని డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్ ద్వారా వీటని టోగుల్ చేయవచ్చు. నియంత్రించవచ్చు. గూగుల్ మ్యాప్స్ కోసం స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీని సౌలభ్యం ఉంది. లైవ్ ట్రాఫిక్ డేటా, కాల్స్ కు ఆటో రిప్లయ్, వాట్సాప్ ప్రివ్యూ కు అనుమతి ఉంది.
ఓలా ఎస్ 1 ప్రో విషయానికి వస్తే ఎకో, నార్మల్, స్పోర్ట్, హైపర్ అనే నాలుగు మోడ్ లు ఉన్నాయి. స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, రైడ్ మూడ్స్, సంగీతం, కాల్స్, ఎస్ఎమ్ఎస్ నోటిఫికేషన్లు, వైఫై కనెక్టివిటీ, రిమోట్ బూట్ యాక్సెస్, రిమోట్ లాక్/అన్‌లాక్, హిల్ హోల్డ్, మూడు స్థాయిల బ్రేకింగ్ వ్యవస్థ తదితర ఇతర ఫీచర్లు ఉన్నాయి. ఏథర్ రిజ్టా జెడ్, ఓలా ఎస్ 1 ప్రో వాహనాల ఫీచర్లు దాదాపు ఒకేలా ఉంటాయి.
హార్డ్ వేర్..
రెండు ఎలక్ట్రిక్ వాహనాల హార్డ్ వేర్ వ్యవస్థ ఒకేలా ఉంటుంది. టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్ , సింగిల్ రియర్ షోక్ ఉంటాయి. సింగిల్ ఫ్రంట్ డిస్క్, రియర్ డ్రమ్ సెటప్ పై బ్రేకింగ్ వ్యవస్థను రూపొందించారు. అయితే ఓలా కంటే ఏథర్ స్కూటర్‌లో ఎక్కువ స్టోరేజ్ స్పేస్ ఉంది.
మోటార్, బ్యాటరీ..
రిజ్టా జెడ్‌లో 4.3కేడబ్ల్యూ మోటార్, 3.7 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ఉంది. ఇది సుమారు 160 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. గంటకు 80 కిలోమీటర్ల వేగంగా ప్రయాణం చేయవచ్చు.
ఓలా ఎస్ 1 ప్రో స్కూటర్ లో 11కేడబ్ల్యూ (పీక్ పవర్) మోటార్, 4 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ఉన్నాయి. దీని రేంజ్ 180 కిలోమీటర్లు, గంటకు 120 కిలోమీటర్ల గరిష్ట వేగంతో దూసుకుపోవచ్చు. అంటే ఏథర్ రిజ్టా జెడ్ కంటే ఓలా ఎస్ 1 ప్రోలో బ్యాటరీ కెపాసిటీ ఎక్కువగా ఉంది.
ధర..
ఏథర్ రిజ్టా జెడ్ ధర రూ. 1.45 లక్షలు, మీరు ప్రో ప్యాక్‌ని ఎంచుకుంటే 1.65 లక్షలకు అందుబాటులో ఉంది. ఓలా ఎస్ 1 ప్రో ధర రూ.1.30 లక్షలు. ఇవి బెంగళూరులో ఎక్స్ షోరూమ్ ధరలు.
ఈ రెండు స్కూటర్లలో ఫీచర్లు, డిజైన్ దాదాపు ఒకేలా ఉన్నప్పటికీ ధరలో మాత్రం వ్యత్యాసం ఉంది. అందుబాటు ధరలో ఉన్న ఓలా ఎస్ 1 ప్రో మంచి డీల్ గా అనిపిస్తుంది. ఏది ఏమైనా మీ అవసరాలు, మీకు నచ్చిన ఫీచర్ల ఆధారంగా స్కూటర్ ను ఎంచుకుంటే మంచిది.