
పెట్టుబడిదారులకు సురక్షితమైన పెట్టుబడి పథకాలలో ఫిక్స్‌డ్ డిపాజిట్ బెస్ట్ ఆప్షన్ గా ఉంటుంది. స్థిరమైన వడ్డీ రేటుతో కచ్చితమైన రాబడిని అందిస్తాయి. అయితే ఒక్కో బ్యాంకులో ఒక్కో రకమైన వడ్డీ రేటు ఉంటుంది. ఏ బ్యాంకులో మంచి వడ్డీ రేటు ఉందో తెలుసుకొని పెట్టుబడి పెట్టడం ఉత్తమం. సాధారణంగా ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రధాన ప్రైవేట్ రంగ బ్యాంకులతో పోలిస్తే నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు (ఎన్బీఎఫ్సీలు), హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు (హెచ్ఎఫ్సీలు) సహా పలు కార్పొరేట్ ఫిక్స్‌డ్ డిపాజిట్ల వడ్డీ రేట్లు ఎక్కువగా ఉన్నాయి. వ్యాపారం వృద్ధి, విభిన్న నియంత్రణ అవసరాల దృష్ట్యా ఎన్బీఎఫ్సీలు అదనపు క్రెడిట్ రిస్క్‌ను కలిగి ఉన్నాయి. దీని కారణంగా బ్యాంక్ ఫిక్స్ డ్ డిపాజిట్ల కంటే ఎన్బీఎఫ్సీలు అధిక వడ్డీ రేట్లను అందిస్తాయి. అయితే వీటిల్లో పెట్టుబడులు పెట్టేముందు కొన్ని జాగ్రత్తలు మాత్రం తీసుకోవాలి.
కార్పొరేట్ ఎఫ్డీల్లో పెట్టుబడులు పెట్టే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఆయా కంపెనీల పరిస్థితిని అంచనా వేయడానికి మీరు పెట్టుబడి పెట్టే ముందు ఆయా బ్యాంకుల క్రెడిట్ రేటింగ్‌లను తప్పక చూడాలి. డిపాజిటర్లు కార్పొరేట్ ఎఫ్డీలను ఎంచుకునేటప్పుడు CRISIL, ICRA, CARE వంటి రేటింగ్ ఏజెన్సీలు కేటాయించిన రేటింగ్‌లను జాగ్రత్తగా అధ్యయనం చేయాలి. ఎన్‌బీఎఫ్‌సీ లేదా హెచ్‌ఎఫ్‌సీ జారీ చేసే కార్పొరేట్ ఎఫ్‌డీల ఆర్థిక ఆరోగ్యంపై ఏజెన్సీల అంచనా ఆధారంగా వారు ఈ రేటింగ్‌లను కేటాయిస్తారు. అధిక-రేటెడ్ కార్పొరేట్ ఎఫ్డీలు వడ్డీ, అసలు రీపేమెంట్లలో డిఫాల్ట్‌లకు తక్కువ అవకాశాలను కలిగి ఉంటాయి. ఉత్తమ వడ్డీ రేట్లను అందించే కొన్ని కార్పొరేట్ ఎఫ్డీల జాబితాను మీకు అందిస్తున్నాం..
ఇక్కడ అందిస్తున్న కంపెనీల ఫిక్స్‌డ్ డిపాజిట్ల క్రెడిట్ రేటింగ్ AAA. అంటే అత్యధిక స్థాయి భద్రతను సూచిస్తుంది. అంతేకాక తక్కువ క్రెడిట్ రిస్క్‌ను కలిగి ఉంటుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..