ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ వినియోగం అనివార్యంగా మారింది. కచ్చితంగా ప్రతీ ఒక్కరి చేతిలో ఫోన్ ఉండాల్సిందే. అయితే తాజాగా పెరిగిన రీఛార్జ్ ప్లాన్స్‌తో మొబైల్ యూజర్లు రీఛార్జ్ అనగానే భయపడే పరిస్థితి వచ్చింది. మరీ ముఖ్యంగా డ్యూయల్ సిమ్ ఉపయోగించే వారికి పెరిగిన రీఛార్జ్ ధరలు ఇబ్బంది పెడుతున్నాయి. మరి ఇలాంటి తరుణంలో తక్కువ ధరలో ఎక్కువ రోజులు వ్యాలిడిటీ లభించే రీఛార్జ్ ప్లాన్స్ లేవా.? అంటే అవి కూడా ఉన్నాయి. దేశంలో ఉన్న మూడు ప్రధాన టెలికాం సంస్థలకు సంబంధించిన బెస్ట్ రీఛార్జ్ ప్లాన్స్‌పై ఓ లుక్కేయండి..
అత్యంత తక్కువ సమయంలో ఎక్కువ మంది వినియోగదారులను సొంతం చేసుకున్న జియో రూ. 189 ప్లాన్‌ను అందిస్తోంది. ఈ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకుంటే 28 రోజులు వ్యాలిడిటీ లభిస్తుంది. ఇందులో మొత్తం 2 జీబీ డేటా లభిస్తుంది. ఈ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకుంటే అన్‌లిమిటెడ్ కాల్స్ పొందొచ్చు. నెలకు 1000 ఉచిత ఎస్‌ఎంఎస్‌లు పొందొచ్చు. అలాగే జియో టీవీతో పాటు, జియో సినిమాకు ఉచిత యాక్సెస్ లభిస్తుంది.
ఎయిర్‌టెల్ అందిస్తున్న రూ. 199తో రీఛార్జ్ చేసుకుంటే 28 రోజుల వ్యాలిడిటీతో అన్‌లిమిటెడ్ కాల్స్ లభిస్తాయి. ఈ ప్లాన్‌తో 2 జీబీ డేటా పొందొచ్చు. 300 ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి. ఇక ఎయిర్‌టెల్‌లో రూ. 155 ప్లాన్ కూడా లభిస్తోంది. ఇది 24 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది.
రూ. 199 ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకుంటే 28 రోజుల వ్యాలిడిటీ లభిస్తోంది. ఈ ప్లాన్‌లో అన్‌లిమిడెట్ కాల్స్ పొందొచ్చు. దేశంలోని ఏ నెట్‌వర్క్‌కి అయినా కాల్స్ చేసుకోవచ్చు. యూజర్లు రోజుకు సుమారు రూ. 7 చెల్లించాల్సి ఉంటుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..