FD Interest Rates: మళ్లీ పెరిగిన ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు.. ఏ బ్యాంకులో ఎక్కువంటే..

కొన్ని బ్యాంకులు ఇటీవల తమ ఎఫ్ డీ రేట్లను సవరించాయి. వాటిల్లో పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ), బ్యాంక్ ఆఫ్ బరోడా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కోటక్ మహీంద్రా బ్యాంక్ ,ఫెడరల్ బ్యాంక్‌ వంటి బ్యాంకులు ఉన్నాయి. ఇవి జనవరి 2024లో ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచాయి. ఈ నేపథ్యంలో ఆయా బ్యాంకుల్లో తాజా వడ్డీ రేట్లు ఇప్పడు చూద్దాం..

FD Interest Rates: మళ్లీ పెరిగిన ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు.. ఏ బ్యాంకులో ఎక్కువంటే..
Fd Rate
Follow us
Madhu

|

Updated on: Jan 26, 2024 | 7:47 AM

ప్రజల నుంచి అత్యంత నమ్మకం పొందిన సురక్షిత పెట్టుబడి పథకం ఫిక్స్‌డ్ డిపాజిట్(ఎఫ్‌డీ). కచ్చితమైన రాబడితో పాటు అధిక వడ్డీ, పన్ను రాయితీల వంటి ప్రయోజనాలు ఉండటంతో అందరూ వీటిల్లో పెట్టుబడులు పెట్టేందుకు మొగ్గుచూపుతారు. అయితే వీటిలో వడ్డీ రేట్లు అన్ని చోట్ల ఒకేలా ఉండవు. పోస్టాఫీసు, బ్యాంకుల్లో వేర్వేరుగా ఉంటుంది. ఒక్కో బ్యాంకులో ఒక్కో వడ్డీ రేటు ఉంటుంది. ఈ క్రమంలో కొన్ని బ్యాంకులు ఇటీవల తమ ఎఫ్ డీ రేట్లను సవరించాయి. వాటిల్లో పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ), బ్యాంక్ ఆఫ్ బరోడా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కోటక్ మహీంద్రా బ్యాంక్ ,ఫెడరల్ బ్యాంక్‌ వంటి బ్యాంకులు ఉన్నాయి. ఇవి జనవరి 2024లో ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచాయి. ఈ నేపథ్యంలో ఆయా బ్యాంకుల్లో తాజా వడ్డీ రేట్లు ఇప్పడు చూద్దాం..

కర్ణాటక బ్యాంక్..

కర్ణాటక బ్యాంక్ రూ. 2 కోట్ల కంటే తక్కువ డిపాజిట్లపై సాధారణ పౌరులకు 3.5% నుంచి 7.25% మధ్య వడ్డీ రేట్లను అందిస్తోంది. ఈ కొత్త రేట్లు జనవరి 20 నుంచి అమలులోకి వచ్చాయి.

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా..

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో రూ. 2 కోట్ల కంటే తక్కువ డిపాజిట్లకు సంబంధించి సాధారణ పౌరులకు 3.5% నుంచి 7.25% మధ్య వడ్డీ రేట్లను అందిస్తోంది. కొత్త రేట్లు జనవరి 19 నుంచి అమలులోకి వచ్చాయి. రెసిడెంట్ సీనియర్ సిటిజన్ డిపాజిట్‌లకు వర్తించే అదనపు రేట్ కాంపోనెంట్, పైన రేట్ కంటే 0.50% ఎక్కువ. రెసిడెంట్ సూపర్ సీనియర్ సిటిజన్‌లకు వర్తించే అదనపు రేట్ కాంపోనెంట్ 0.75% అదనంగా ఉంటుంది.

ఇవి కూడా చదవండి

ఫెడరల్ బ్యాంక్..

ఫెడరల్ బ్యాంక్ సాధారణ పౌరులకు 7 రోజుల నుంచి 5 సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ కాల వ్యవధిలో 3% నుంచి 7.75% మధ్య స్థిర డిపాజిట్ వడ్డీ రేట్లను అందిస్తుంది. సీనియర్ సిటిజన్లకు బ్యాంక్ 3.50% నుంచి 8.25% మధ్య వడ్డీ రేట్లను అందిస్తోంది. ఈ రేట్లు జనవరి 17 నుంచి అమలులోకి వచ్చాయి.

ఐడీబీఐ బ్యాంక్..

ఐడీబీఐ బ్యాంక్ సాధారణ పౌరులకు 3% నుంచి 7% మధ్య వడ్డీ రేట్లను అందిస్తోంది. అలాగే వృద్ధులకు 3.50% నుంచి 7.50% వరకు 7 రోజుల నుంచి 10 సంవత్సరాల కాల వ్యవధిలో అందిస్తోంది. ఈ కొత్త వడ్డీ రేట్లు జనవరి 17 నుంచి అమలులోకి వచ్చాయి.

బ్యాంక్ ఆఫ్ బరోడా..

బ్యాంక్ ఆఫ్ బరోడా సాధారణ పౌరులకు రూ. 2 కోట్ల కంటే తక్కువ డిపాజిట్లపై ఆయా కాల వ్యవధులను బట్టి 4.25% నుంచి 7.25% వరకు వడ్డీ రేటును అందిస్తోంది. ఈ రేటు జనవరి 15 నుంచి అమలులోకి వచ్చింది.

పంజాబ్ నేషనల్ బ్యాంక్..

పీఎన్బీ ఈ నెలలో రెండుసార్లు రూ. 2 కోట్ల కంటే తక్కువ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచింది. ప్రస్తుత ఈ బ్యాంక్ సాధారణ పౌరులకు 7 రోజుల నుంచి 10 సంవత్సరాలలో మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై 3.5% నుంచి 7.25% వరకు అందిస్తుంది. ఏడు రోజుల నుంచి పదేళ్లలో మెచ్యూర్ అయ్యే ఎఫ్ డీలపై బ్యాంక్ 4% నుంచి 7.75% వరకు వడ్డీ రేటును అందిస్తోంది. సూపర్ సీనియర్లకు 4.3% నుంచి 8.05% వరకు ఉంటుంది. ఈ రేట్లు జనవరి 8 నుంచి అమలులోకి వచ్చాయి.

కోటక్ మహీంద్రా బ్యాంక్..

కోటక్ బ్యాంక్ సాధారణ పౌరులకు 2.75% నుంచి 7.25%, సీనియర్ సిటిజన్లకు 3.25% నుంచి 7.80% వడ్డీ రేటును అందిస్తోంది. ఈ కొత్త వడ్డీ రేట్లు జనవరి 4 నుంచి అమలు చేస్తోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..