Bank ATM: త్వరలో కొత్త ఏటీఎంలు.. ఉన్నవన్నీ మారిపోతాయ్.. పూర్తి వివరాలు..
లోపం గ్రహించిన బ్యాంకర్లు ఏటీఎం మెషీన్లను రిఫ్రెష్ చేయాలని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే దేశ వ్యాప్తంగా పాడై, మరమ్మతులతో కాలం నడిపిస్తున్న దాదాపు 40,000 ఏటీఎంలను గుర్తించారు. వాటి స్థానంలో అధునాతన సాంకేతికతతో ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా కొత్త వాటిని తీసుకురావాలని తలపోస్తున్నారు. అలాగే మరో 10,000 కొత్త ఏటీఎంలను కొత్త ప్రాంతాల్లో సమకూర్చాలని ప్రణాళిక చేస్తున్నారు.
దేశ వ్యాప్తంగా అన్ని బ్యాంకుల ఏటీఎంలు అప్ డేట్ కానున్నాయి. ఇప్పటికే ఆయా చోట్ల ఉన్న ఏటీఎంలు చాలా వరకూ సక్రమంగా పనిచేయడం లేదు. అవుట్ డేటెడ్ అయిపోయి మొరాయిస్తున్నాయి. ఈ క్రమంలో వినియోగదారులు ప్రత్యామ్నాయ మార్గాల వైపు మళ్లుతున్నారు. దీంతో లోపం గ్రహించిన బ్యాంకర్లు ఏటీఎం మెషీన్లను రిఫ్రెష్ చేయాలని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే దేశ వ్యాప్తంగా పాడై, మరమ్మతులతో కాలం నడిపిస్తున్న దాదాపు 40,000 ఏటీఎంలను గుర్తించారు. వాటి స్థానంలో అధునాతన సాంకేతికతతో ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా కొత్త వాటిని తీసుకురావాలని తలపోస్తున్నారు. అలాగే మరో 10,000 కొత్త ఏటీఎంలను కొత్త ప్రాంతాల్లో సమకూర్చాలని ప్రణాళిక చేస్తున్నారు. రానున్న ఏడాదిన్నరలో ఈ ప్రక్రియను పూర్తి చేసేలా కసరత్తు చేస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పడు చూద్దాం..
ఇదీ లెక్క..
ఆర్బీఐ డేటా ప్రకారం, అన్ని షెడ్యూల్డ్ బ్యాంకులు సమష్టిగా 2022-23 ఆర్థిక సంవత్సరంలో 4,452 ఏటీఎంలను (ఆటోమేటెడ్ టెల్లర్ మెషీన్లు) జోడించాయి. వాటి నెట్‌వర్క్ మార్చి 2023 నాటికి 2,19,513గా ఉంది. ఇదే క్రమంలో వైట్ లేబుల్ ఏటీఎం ఆపరేటర్లు తమ ఏటీఎం నెట్‌వర్క్‌ను 2023 ఆర్థిక సంవత్సరంలో 4,292 ఏటీఎంల నుంచి మార్చి 2023 నాటికి 35,791కి విస్తరించారు.
ఈ సందర్భంగా సీఎంఎస్ ఇన్ఫోసిస్టమ్స్ మేనేజ్డ్ సర్వీసెస్ ప్రెసిడెంట్ మంజునాథ్ రావు మాట్లాడుతూ ఏటిఎం ఎస్టేట్‌లో చాలా యంత్రాలు పాతబడిపోయినందన వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ క్రమంలో వాటిని రిప్లేస్ చేయాలని భావిస్తున్నట్లు చెప్పారు. ఏటీఎం హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ చుట్టూ ఇప్పుడు చాలా నిబంధనలు ఉన్నాయి. కాబట్టి, బ్యాంకులు పాత ఏటీఎంలను త్వరగా మార్చేలా చేస్తోందని ఆయన వివరించారు. 2024 ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధభాగంలో, 15,000 యూనిట్లను మార్చాలని బ్యాంకులకు ఆదేశాలున్నాయని ఆయన చెప్పారు. ఇది రీప్లేస్‌మెంట్ తో పాటు నెట్‌వర్క్ విస్తరణపై వారి దృష్టిని ప్రతిబింబిస్తుందని ఆయన పేర్కొన్నారు. ప్రైవేట్ రంగ బ్యాంకులు (పీవీబీలు) నగదు పంపిణీదారుల నుంచి నగదు రీసైక్లర్‌లకు మారుతున్నాయన్నారు. ఎందుకంటే ఇది డిపాజిట్ల కోసం బ్రాంచ్ వాక్ ఇన్‌లను తగ్గించడంలో సహాయపడుతుందని.. ఇది మొత్తం నిర్వహణ ఖర్చును తగ్గిస్తుందని వివరించారు. మరోవైపు ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎస్బీ) చాలా దూరంలో లేవు. కాబట్టి, కొన్ని ప్రధాన పీఎస్బీలు కూడా పక్కపక్కనే, నగదు రీసైక్లర్‌లను ఉంచుతున్నాయని రావు చెప్పారు.
ఎంత ఖర్చు అవుతుందంటే..
ఒక ఏటీఎం యంత్రం ధర సుమారు ₹ 3.5 లక్షలు అయితే నగదు రీసైక్లర్ ధర రూ.6 లక్షలు. 50,000 ఏటీఎంలలో 25 శాతం నగదు రీసైక్లర్లు అని ఊహిస్తే, బ్యాంకులకు మొత్తం మూలధన వ్యయం రూ. 2,000 కోట్లు అవుతుంది. 2022-23లో, మొత్తం ఏటీఎంల సంఖ్య (ఆన్‌సైట్,ఆఫ్‌సైట్) 3.5 శాతం పెరిగింది, ప్రధానంగా వైట్ లేబుల్ ఏటీఎం (డబ్ల్యూఎల్ఏ)ల సంఖ్య పెరగడం వల్ల, భారతదేశంలో బ్యాంకింగ్ ట్రెండ్ వృద్ధి చెందింది. మార్చి 2023 చివరి నాటికి షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులు (ఎస్సీబీలు) నిర్వహించే ఏటీఎంలలో, పీఎస్బీలు, పీవీబీలు వాటా వరుసగా 63 శాతం, 35 శాతంగా ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..