Fixed deposits: బ్యాంకులో ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఉన్నాయా.. మీకో గుడ్ న్యూస్.. ఏమిటంటే..
Fixed deposits: రెపో రేట్లను, రివర్స్ రెపో రేట్లలో ఎలాంటి మార్పులు చేర్పులు చేయడం లేదని ఇటీవలే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తెలిపిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 8న జరిగిన నెలవారీ మానిటరీ పాలసీ సమావేశంలో భాగంగా ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది. దీంతో బ్యాంకులు...
Fixed deposits: రెపో రేట్లను, రివర్స్ రెపో రేట్లలో ఎలాంటి మార్పులు చేర్పులు చేయడం లేదని ఇటీవలే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తెలిపిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 8న జరిగిన నెలవారీ మానిటరీ పాలసీ సమావేశంలో భాగంగా ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది. దీంతో బ్యాంకులు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంచాయి. వీటిలో ప్రధానంగా కొటాక్ మహీంద్రా, హెచ్‌డీఎఫ్‌సీ, బ్యాంక్ ఆఫ్ బరోడా తాజాగా వడ్డీరేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. ఏయే బ్యాంకు ఏమేర వడ్డీ రేట్లను పెంచింది. ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చాయో ఓ లుక్కేయండి..
కొటాక్ మహీంద్రా..
కొటాక్ మహీంద్రా బ్యాంకు రూ. 2 కోట్ల కంటే తక్కు మొత్తాలపై ఎఫ్‌డీ రేట్లను పెంచింది. పెంచిన ఈ వడ్డీరేట్లు ఏప్రిల్ 12 నుంచి అమల్లోకి వచ్చింది. పెరిగిన ఈ వడ్డీ రేట్లతో ఏడాదికి 4.75 శాతం వడ్డీ రేటు అందిస్తున్నారు. ఇక రెండు నుంచి మూడేళ్ల డిపాజిట్స్‌కు 5.25 శాతం వడ్డీని చెల్లిస్తున్నారు. ఇక గరిష్టంగా 5 ఏళ్ల నుంచి 10 ఏళ్ల వరకు డిపాజిట్లకు 5.60 శాతం అందిస్తారు.
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ …
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కూడా రూ. 2 కోట్ల కంటే తక్కు మొత్తాలపై ఎఫ్‌డీ రేట్లను పెంచింది. పెరిగిన ఈ వడ్డీ రేట్లు ఏప్రిల్ 6 నుంచి అమల్లోకి వచ్చాయి. పెరిగిన ఈ వడ్డీ రేట్లతో ఏడాదికి 5.10 శాతం వడ్డీ రేటు అందిస్తున్నారు. ఇక మూడు నుంచి ఐదేళ్ల డిపాజిట్స్‌కు 5.45 శాతం వడ్డీని చెల్లిస్తున్నారు. ఇక గరిష్టంగా 5 ఏళ్ల నుంచి 10 ఏళ్ల వరకు డిపాజిట్లకు 5.60 శాతం అందిస్తారు.
బ్యాంక్ ఆఫ్ బరోడా అందిస్తోన్న వడ్డీ రేట్లు..
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కూడా రూ. 2 కోట్ల కంటే తక్కు మొత్తాలపై ఎఫ్‌డీ రేట్లను పెంచింది. పెరిగిన ఈ వడ్డీ రేట్లు మార్చి 22 నుంచి అమల్లోకి వచ్చాయి. పెరిగిన ఈ వడ్డీ రేట్లతో ఏడాదికి 5.00 శాతం వడ్డీ రేటు అందిస్తున్నారు. ఇక మూడు నుంచి ఐదేళ్ల డిపాజిట్స్‌కు 5.35 శాతం వడ్డీని చెల్లిస్తున్నారు. ఇక గరిష్టంగా 5 ఏళ్ల నుంచి 10 ఏళ్ల వరకు డిపాజిట్లకు 5.35 శాతం అందిస్తారు.