ITR: ఇన్‌కమ్ ట్యాక్స్ రిఫండ్ రాలేదా.. ఆన్‌లైన్‌లో స్టేటస్ చూడండి.. చాలా సులభం..

|

May 16, 2024 | 6:17 PM

మీరు ఇన్ కం ట్యాక్స్ రిటర్న్స్ (ఐటీఆర్) ఫైల్ చేసే సమయంలో వివరాలన్నీ సక్రమంగా నమోదు చేయాలి. వాటికి సంబంధించిన పత్రాలను కూడా సమర్పించాలి. అప్పుడే ఇన్ కం ట్యాక్స్ రిఫండ్ సక్రమంగా అందుతుంది. ఒక వేళ మోసపూరిత వివరాలతో, తప్పుడు డ్యాక్యుమెంట్లు సమర్పించి రిఫండ్ పొందినట్టు నిర్ధారణ అయితే భారీ జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా విధించే అవకాశం ఉంది.

ITR: ఇన్‌కమ్ ట్యాక్స్ రిఫండ్ రాలేదా.. ఆన్‌లైన్‌లో స్టేటస్ చూడండి.. చాలా సులభం..
Itr
Follow us on

పరిమితికి మించిన ఆదాయం పొందుతున్న ప్రతి ఒక్కరూ ప్రభుత్వానికి ఇన్ కమ్ ట్యాక్స్ చెల్లిస్తారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే మీకు వర్తించే పన్ను కన్నా ఎక్కువగా ట్యాక్స్ కడితే ఆ మొత్తం మీకు రిఫండ్ గా తిరిగి వచ్చేస్తుంది. అంటే ఆర్టిక సంవత్సరానికి కట్టాల్సిన పన్ను కంటే అధికంగా చెల్లిస్తే ప్రభుత్వం తిరిగి ఇచ్చేస్తుంది. ఈ అవకాశం ఆదాయపు పన్నుచెల్లిందారులందరికీ ఉంటుంది. దీనిని ఐటీఆర్ ఫైల్ చేసే సమయంలోనే లెక్కిస్తారు. మీ బ్యాంకు ఖాతాలోనే రిఫండ్ సొమ్మును జమచేస్తారు.

సక్రమంగా వివరాలు..

మీరు ఇన్ కం ట్యాక్స్ రిటర్న్స్ (ఐటీఆర్) ఫైల్ చేసే సమయంలో వివరాలన్నీ సక్రమంగా నమోదు చేయాలి. వాటికి సంబంధించిన పత్రాలను కూడా సమర్పించాలి. అప్పుడే ఇన్ కం ట్యాక్స్ రిఫండ్ సక్రమంగా అందుతుంది. ఒక వేళ మోసపూరిత వివరాలతో, తప్పుడు డ్యాక్యుమెంట్లు సమర్పించి రిఫండ్ పొందినట్టు నిర్ధారణ అయితే భారీ జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా విధించే అవకాశం ఉంది.

రిఫండ్ కోసం ఎదురుచూపులు..

ఇప్పటికే చాలామంది సరైన వివరాలు అందజేసి, ట్యాక్స్ రిఫండ్ కోసం ఎదురు చూస్తున్నారు. వీరందరూ ఆన్ లైన్ లో స్టేటస్ ను తెలుసుకునే అవకాశం ఉంది. చాలా సులభమైన పద్ధతులతో ఆదాయపు పన్ను వాపసు స్థితిని తెలుసుకోవచ్చు. సాధారణంగా ఐటీఆర్ రీఫండ్‌లు దాఖలు చేసిన తర్వాత ఏడు నుంచి 120 రోజులలోపు ప్రాసెస్ అవుతాయి. ఈ సమయాన్ని మరింత తగ్గించడానికి చర్యలు తీసుకుంటున్నారు.

తనిఖీ చేసుకోండిలా..

  • ముందుగా ఇన్ కం ట్యాక్స్ ఇండియా వెబ్ సైట్ లోకి వెళ్లండి.
  • మీ యూజర్ ఐడీ (పాన్ నంబర్) , పాస్‌వర్డ్, క్యాప్చా కోడ్‌ను ఉపయోగించి పోర్టల్‌కి లాగిన్ అవ్వండి.
  • వ్యూ రిటర్స్/ఫారమ్స్ ను చూడండి.
  • డ్రాప్ డౌన్ జాబితాలోని సెలెక్ట్ ఎన్ ఆప్షన్ లింక్‌పై క్లిక్ చేయండి. అనంతరం ఆదాయ పన్ను రిటర్న్స్ లింక్‌ ను ఓపెన్ చేయండి. అసెస్‌మెంట్ ఇయర్‌ని ఎంటర్ చేసి సబ్‌మిట్‌పై క్లిక్ చేయండి.
  • ఐటీఆర్ రశీదు సంఖ్య మీద క్లిక్ చేసి, మీ రిఫండ్స్ వివరాలు తెలుసుకోండి.
  • ఫారమ్ 26ASలోని పన్ను క్రెడిట్ స్టేట్‌మెంట్స్ లో కూడా రీఫండ్ చెల్లింపు స్థితి నమోదవుతుంది. మీ ఐటీఆర్ బ్యాంక్ వివరాలలో సమస్య ఉంటే ఆ విషయాన్నిస్క్రీన్ పై తెలియజేస్తుంది.

ఆలస్యానికి కారణాలు ఇవే..

  • కొన్ని కారణాల వల్ల ఐటీఆర్ రిఫండ్లు ఆలస్యం కావచ్చు. ముఖ్యంగా పన్ను చెల్లింపుదారులు తన ఆదాయపు పన్ను రిటర్న్ (ఐటీఆర్)ను ఫైల్ చేసేటప్పుడు సరైన బ్యాంక్ ఖాతా నంబర్, ఇతర బ్యాంక్ సమాచారాన్ని నమోదు చేయడం మరచిపోవచ్చు. అలాగే ప్రయోజనాన్ని పొందడానికి కొంత తప్పుడు సమాచారాన్ని నమోదు చేసి ఉండవచ్చు. ఈ కారణాల వల్ల రిఫండ్ ప్రక్రియలో తిరస్కరణ, ఆలస్యం కలుగుతాయి. వీటిని నివారించాలంటే కచ్చితమైన సమాచారం అందజేయాలి.
  • 26ASలో క్లెయిమ్ చేసుకున్న టీడీఎస్ రిటర్న్స్ కు సంబంధించి అసమగ్ర, లేదా తప్పు సమచారం నమోదు చేయడం వల్ల కూడా ఆలస్యం కావచ్చు.
  • పన్ను చెల్లింపుదారులు తమ ఐటీఆర్ ను నివేదించేటప్పుడు కొన్ని వివరాలను నమోదు చేయడం మర్చిపోయి ఉండవచ్చు. అలాగే అదనపు సమాచారం, అవసరమైన పత్రాలను అందజేయకపోయినా ఆలస్యం జరగుతుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..