Cars With Best Resale Value: ఈ కార్లకు డిమాండ్ మామూలుగా లేదు.. సెకండ్ హ్యాండ్ కార్లయినా హాట్ కేకులే..

| Edited By: Shaik Madar Saheb

Dec 21, 2023 | 8:15 PM

ఓ కారు రీసేల్ వ్యాల్యూ బాగా ఉండాలంటే కొన్ని అంశాలు పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ప్రధానంగా కారు బ్రాండ్, తయారైన సంవత్సరం, కారు రంగు, వాహనం కండిషన్, మార్కెట్లో ఆ కారుకు ఉన్న డిమాండ్, కారు పనితీరు వంటి అంశాల ఆధారంగా రేటు నిర్ణయిస్తారు. మన దేశంలో అనేక బ్రాండ్లకు చెందిన కార్లు మంచి రీసేల్ వ్యాల్యూ ఇచ్చేవి ఉన్నాయి. వాటిపై ఓ లుక్కేద్దాం రండి..

Cars With Best Resale Value: ఈ కార్లకు డిమాండ్ మామూలుగా లేదు.. సెకండ్ హ్యాండ్ కార్లయినా హాట్ కేకులే..
Maruti Suzuki Swift
Follow us on

మీరు కారు కొనాలంటే ఏం ఆలోచిస్తారు? మొదట బడ్జెట్ పరిధి.. ఆ పరిధిలోని బెస్ట్ స్పెక్స్, ఫీచర్లు, మైలేజీ, దాని డిజైన్, సౌకర్యవంతంగా ఉంటుందా అనే అంశాలను పరిశీలిస్తారు. అలాగే రీసేల్ వాల్యూ ఎలా ఉంటుంది అనే విషయాన్ని కూడా ఆలోచిస్తారు. ఎందుకంటే కొంత కాలం వినియోగించిన తర్వాత దానిని స్క్రాప్ చేయడానికి ఎవరూ ఇష్టపడరు. దానిని తిరిగి విక్రయించడానికి మొగ్గుచూపుతారు. అలా విక్రయించినప్పుడు మంచి ధర వచ్చే కార్లను ఎక్కువ మంది ఎంపిక చేసుకుంటారు. అయితే ఓ కారు రీసేల్ వ్యాల్యూ బాగా ఉండాలంటే కొన్ని అంశాలు పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ప్రధానంగా కారు బ్రాండ్, తయారైన సంవత్సరం, కారు రంగు, వాహనం కండిషన్, మార్కెట్లో ఆ కారుకు ఉన్న డిమాండ్, కారు పనితీరు వంటి అంశాల ఆధారంగా రేటు నిర్ణయిస్తారు. మన దేశంలో అనేక బ్రాండ్లకు చెందిన కార్లు మంచి రీసేల్ వ్యాల్యూ ఇచ్చేవి ఉన్నాయి. సెకండ్ హ్యాండ్ కార్లు అయినా హాట్ కేకుల్లా అమ్ముడు పోతాయి. వాటిపై ఓ లుక్కేద్దాం రండి..

హోండా సిటీ..

ఈ మిడ్ సైజ్ సెడాన్ కారు మన దేశంలో అత్యధికంగా కొనుగోలు చేసే సెకండ్ హ్యాండ్ కారు. దీనికి రీ సేల్ వ్యాల్యూ చాలా ఎక్కువ ఉంటుంది. కొత్త కారు కొనాలంటే దీని ప్రారంభ ధర రూ. 11.63లక్షలు(ఎక్స్ షోరూం) నుంచి ఉంటాయి. ఇది స్టైలిష్ లుక్ లో కనిపిస్తుంది. దీనిలో శక్తివంతమైన 1.5 లీటర్ ఇంజిన్ ఉంటుంది. మాన్యువల్, సీవీటీ గేర్ బాక్స్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది.

మహీంద్రా స్కార్పియో..

మన దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎస్యూవీ ఇది. దీని బాక్సీ డిజైన్, పవర్ ప్యాక్డ్ పెర్ఫామెన్స్ టాప్ ప్లేస్ లో ఉంచుతోంది. స్కార్పియో క్లాసిక్, స్కార్పియో ఎన్ వంటి మోడళ్లు మార్కెట్లో ఉన్నాయి. ఈకారుకు కూడా మంచి రీసేల్ వ్యాల్యూ ఉంటుంది. స్కార్పియో పాత మోడళ్లకు కూడా ప్రస్తుతం సెకండ్ హ్యాండ్ మోడళ్లలో మంచి డిమాండ్ ఉంది.

ఇవి కూడా చదవండి

మారుతి సుజుకీ స్విఫ్ట్..

ఈ కారు వ్యాల్యూ ఫర్ మనీ. మన దేశంలో అత్యధికశాతం మంది వినియోగించే కారు ఇదే. ఈ హ్యాచ్ బ్యాక్ 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ తో వస్తుంది. పెట్రోల్, పెట్రోల్-సీఎన్జీ ఇంధన ఆప్షన్లలో అందుబాటులో ఉంది. మాన్యువల్, ఏఎంటీ గేర్ బాక్స్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. ఈ కారు కూడా సెకండ్ హ్యాండ్ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. అందుకే రీసేల్ వ్యాల్యూ బాగా వస్తుంది.

మారుతి సుజుకీ డిజైర్..

కాంపాక్ట్ సెడాన్ మోడల్స్ లో అత్యధికంగా అమ్ముడవుతున్న కారు ఇదే. ఎస్యూవీల రాకతో ఈ కాంపాక్ట్ సెడాన్లకు డిమాండ్ తగ్గింది. అయినప్పటికీ ఈ డిజైర్ మాత్రం చెప్పుకోదగ్గ సేల్స్ ను రాబడుతోంది. దీనిలోని ఫీచర్లు, పవర్ ట్రెయిన్స్ వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. అందుకే దీని రీసేల్ కి కూడా మంచి ధరలు వస్తుంటాయి.

టోయోటా ఇన్నోవా క్రిస్టా..

ఏళ్లుగా మన దేశంలో కొనసాగుతున్న మోడల్ ఇన్నోవా. ప్రస్తుతం టోయోటా ఇన్నోవా క్రిస్టా, ఇన్నోవా హై క్రాస్ వెర్షన్లను మార్కెట్లో ఉంచింది. ఇన్నోవా క్రిస్టాకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. దీని ప్రీమియం డిజైన్, సౌకర్యం, శక్తివంతమైన ఇంజిన్ ఈ కారును టాప్ ప్లేస్ లో నిలబెడుతోంది. అంతేకాక రీసేల్ వ్యాల్యూను కూడా అందిస్తోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..