Google Wallet: గూగుల్ నుంచి మరో పేమెంట్ యాప్.. గూగుల్ పే ఉండగా.. మరొకటి ఎందుకు?

|

May 15, 2024 | 3:16 PM

దేశంలోని స్మార్ట్ ఫోన్ యూజర్లందరికీ గూగుల్ పే యాప్ గురించి తెలిసినదే. దీని ద్వారా అనేక లావీదేవీలు నిర్వహిస్తుంటారు. డబ్బులను పంపడానికి, ఇతర ఆర్థిక సంబంధమైన పనులకు ఈ యాప్ ను ఎక్కువగా వినియోగిస్తారు. ఇప్పుడు లేటెస్ట్ గా గూగుల్ వాలెట్ అనే యాప్ కూడా అందుబాటులోకి వచ్చింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

Google Wallet: గూగుల్ నుంచి మరో పేమెంట్ యాప్.. గూగుల్ పే ఉండగా.. మరొకటి ఎందుకు?
Google Wallet
Follow us on

దేశంలోని స్మార్ట్ ఫోన్ యూజర్లందరికీ గూగుల్ పే యాప్ గురించి తెలిసినదే. దీని ద్వారా అనేక లావీదేవీలు నిర్వహిస్తుంటారు. డబ్బులను పంపడానికి, ఇతర ఆర్థిక సంబంధమైన పనులకు ఈ యాప్ ను ఎక్కువగా వినియోగిస్తారు. ఇప్పుడు లేటెస్ట్ గా గూగుల్ వాలెట్ అనే యాప్ కూడా అందుబాటులోకి వచ్చింది. అంటే గూగుల్ పే, గూగుల్ వాలెట్ రెండు యాప్ లనూ మనం వినియోగించవచ్చు.

మార్కెట్ కు అనుగుణంగా..

దేశ మార్కెట్ కు అనుగుణంగా రూపొందించిన గూగుల్ వాలెట్ యాప్ అందుబాటులోకి వచ్చింది. వినియోగదారులు తమ కార్డులు, పాస్‌లు, టిక్కెట్లు, కీలు, ఐడీలను సురక్షితంగా నిల్వ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. దీనిని ఆండ్రాయిడ్ వినియోగదారులు గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఫ్లిప్ కార్ట్, మెక్ డొనాల్డ్స్, క్రోమా, ఎయిర్ ఇండియా, విస్తారా, పీవీఆర్, ఇనోక్స్, లెన్సా కార్ట్ , మెక్ మై ట్రిప్ తదితర సుమారు 20 ప్రముఖ భారతీయ బ్రాండ్‌లతో భాగస్వామ్యం ఉంది. వినియోగదారులు ఫ్లైట్ బోర్డింగ్ పాస్‌లు, లాయల్టీ కార్డుల, వివిధ బ్రాండ్‌ల నుంచి వచ్చే గిఫ్ట్ కార్డులను అవసరమైనప్పుడు త్వరిత యాక్సెస్ చేసేందుకు, అలాగే మెట్రో, బస్ టిక్కెట్‌లను కూడా స్టోర్ చేసుకునే వీలుంది. వివిధ కార్పొరేట్ కార్డులను కూడా వాలెట్‌లో నిల్వ చేసుకోవచ్చు. అవసరమైనప్పుడు వాటిని యాక్సెస్ చేయడానికి, చూపించడానికి అవకాశం ఉంది. అయితే ఇప్పటికే గూగుల్ పే ఉన్నందున గూగుల్ వాలెట్ ద్వారా ఆన్ లైన్ లావాదేవీలు నిర్వహించడం సాధ్యంకాదు. అలాగే బ్యాంకు కార్డులను దీనిలో సేవ్ చేయలేము.

గూగుల్ వాలెట్‌ను ఉపయోగించే విధానం

  • ప్లేస్టోర్ నుంచి గూగుల్ వాలెట్ యాప్‌ను డౌన్ లోడ్ చేసుకోండి. మీ గూగుల్ ఖాతా ఆటోమేటిక్‌గా యాప్ తో లింక్ చేయబడుతుంది.
  • యాప్‌ను తెరిచి యాడ్ టు వాలెట్ అనే ఆప్షన్ ను ఎంచుకోండి. దానిలో ఫొటో, లాయల్టీ, గిఫ్ట్ కార్డ్, ట్రాన్స్‌పోర్ట్ పాస్ అనే నాలుగు ఆప్షన్లు కనిపిస్తాయి.
  • బార్‌కోడ్, క్యూ ఆర్ కోడ్‌ను ఉపయోగించి పాస్‌ను సృష్టించడానికి ఫొటోను ఎంచుకోండి.
  • వివిధ బ్రాండ్‌ల నుంచి మీ లాయల్టీ పాయింట్ల డిజిటల్ కాపీలను జోడించడానికి లాయల్టీని ఉపయోగించండి. మీ వాలెట్ కు గిఫ్ట్ కార్డులు , రవాణా పాస్‌లను జోడించడం కోసం మిగిలిన రెండు ఆప్షన్లను ఉపయోగించుకోవాలి.
  • యాప్‌కి మీ బోర్డింగ్ పాస్‌లు, టిక్కెట్‌లను నేరుగా జోడించడానికి ఆన్‌లైన్‌లో లేదా ఇతర యాప్‌లను యాడింగ్ చేయడానికి యాడ్ టు గూగుల్ అనే బటన్ ను నొక్కండి.

డిజిటల్ పేమెంట్లు చేయలేరు..

ఇప్పటికే గూగుల్ పే పనిచేస్తున్నందున గూగుల్ వాలెట్ ను ఉపయోగించి వినియోగదారులు డిజిటల్ పేమెంట్లు చేయలేరు. ఒక్కమాటలో చెప్పాలంటే గూగుల్ పే అనేది ప్రాథమిక చెల్లింపు యాప్‌గా ఉంటుంది. గూగుల్ వాలెట్ యాప్ మాత్రం నాన్ పేమెంట్ వినియోగ కేసుల కోసం రూపొందించారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..